Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గులాబీ రేకులతో చర్మానికి నిగారింపు!
రోజ్ వాటర్‌లో వుండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మంలోని కణాలని పరిపుష్టం చేయడంతోపాటు చర్మంలో వుండే టిష్యుల పునరుత్పత్తికి ఉపయోగపడతాయి.
రోజ్ , ఈ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే ఎన్నో ప్రేమలకు ఇది ప్రత్యక్ష సాక్షి. ఇది లేకండా లవ్ వికసించదు అని ఎవ్వరన్నా అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఈ పువ్వుతో తయారయిన వాటర్ వల్ల మన అందానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.
రోజ్ వాటర్‌లో వుండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మంలోని కణాలని పరిపుష్టం చేయడంతోపాటు చర్మంలో వుండే టిష్యుల పునరుత్పత్తికి ఉపయోగపడతాయి.

రోజ్ వాటర్‌లో వుండే మాయిశ్చరైజింగ్ లక్షణం చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది. కళ్లచుట్టూ వుండే నల్లటి చారికలు, మచ్చలు తొలగించుకోవడానికి నిత్యం కొద్దిపాటి రోజ్ వాటర్‌తో శుభ్రం చేస్తే ఫలితం కనిపిస్తుంది.
మండు వేసవిలో ఎండ వేడిమి కారణంగా వచ్చే చర్మ రోగాలకి రోజ్ వాటర్ చక్కటి ఔషదం. మనకు మార్కెట్ లో కూడా రోజ్ వాటర్ విరివిరిగా దొరుకుతుంది. ఇక పోతే రోజ్ వాటర్ వల్ల మన అందానికి కలిగే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

ముఖం తాజాగా మెరుస్తుంది:
గులాబీ రేకల్ని కాసేపు నీటిలో ఉంచాలి. తరవాత ముద్దలా చేసి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాలయ్యాక చన్నీళ్లతో కడిగేసుకోవాలి. దీనివల్ల ముఖం తాజాగా మెరుస్తుంది.

డ్రై స్కిన్ నివారిస్తుంది:
పొడి చర్మం ఉన్నవారికి గులాబీ రేకల్లోని సహజ నూనెలు కావాల్సిన తేమను అందిస్తాయి. రెండు గులాబీపువ్వుల రేకలకు కాస్త తేనె, రెండు చెంచాల పాలు కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరవాత కడిగేయాలి. మృతకణాలు పోవడంతోపాటూ చర్మం మృదువుగా ఉంటుంది.

మొటిమలను నివారిస్తుంది:
గుప్పెడు గులాబీరేకల్ని మెత్తగా చేసుకుని ఆ మిశ్రమానికి కాస్త గులబీ నీరూ, తేనె కలిపి ముఖం, మెడకూ పట్టించాలి. పావుగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. మొటిమల సమస్య తగ్గి.. చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.

సన్ ట్యాన్ నివారిస్తుంది:
ఎండ ప్రభావం వల్ల చర్మం నల్లగా మారిందా..? పెద్ద చెంచాడు గులాబీ ముద్దలో రెండు చెంచాల చందనం, ఒకటిన్నర చెంచా నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి కలపాలి. దీన్ని ముఖానికి రాసి ఆరాక కడిగేయండి. ఇది నలుపుదనాన్ని తొలగించడంతోపాటూ చర్మాన్ని తాజాగా మార్చేస్తుంది.

ముడుతలు తగ్గుతాయి:
రోజ్ వాటర్ లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి రోజ్ వాటర్ చుక్కలను చల్లటినీటిలో వేసి ముఖాన్ని కడగటం వల్ల వయసు కారణంగా వచ్చే ముడతలూ, వలయాలూ దరిచేరకుండా ఉంటాయని బ్యూటీషియన్లు చెబుతున్నారు.

శరీరం మీద మంచి వాసన:
శరీరం దుర్వాసనగా అనిపిస్తుంటే కొన్ని రోజ్ వాటర్ చుక్కలను శరీరానికి అప్లై చేయటం వల్ల దుర్వాసన తగ్గి, సువాసన వ్యాపిస్తుంది.



Click it and Unblock the Notifications