చర్మానికి అవకాడో వల్ల ప్రయోజనాలు

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

మీకు ఏది మంచిదో సహజంగా తల్లికి తెలుస్తుంది. ఆమె మనకు రుచికరమైన పళ్ళు, కూరగాయలు ఇస్తుంది, వాటిలో మనకు బాగా ఉపయోగపడే పండు అవకాడో గా పిలవబడుతుంది.

అవకాడో క్రీమ్, బటర్ తో కూడిన నిర్మాణం వల్ల దాన్ని “నేచర్స్ బటర్” అని పిలుస్తారు. ఎంతో అద్భుతమైన పోషకాలు కలిగిన ఈ పండు, మీ చర్మాన్ని, గోళ్ళని, మీ జుట్టుని మృదువుగా ఉంచే బి, సి, ఇ, కే వితమిన్లతో పాటు అమినో ఆసిడ్లు, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లను కూడా కలిగి ఉంది.

benefits of avocado for skin | how to use avocado for skin

చర్మానికి అవకాడో వల్ల ప్రయోజనాలు

అవకాడో మీ చర్మ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది, యాక్నే కి చికిత్సగా, మొటిమలు, వయసు వల్ల వచ్చిన మచ్చలపై బాగా పనిచేసి మీ చర్మాన్ని మృదువుగా, సున్నితంగా చేస్తుంది.

ఇతర సహజ పదార్ధాలతో కలిపినా అవకాడో ఫేషియల్ మాస్క్ మీ చర్మాన్ని అద్భుతంగా చేస్తుంది.

ఈ ఆర్టికిల్ లో, వీటి అద్భుతమైన ప్రయోజనాలను, మీరు ఇంట్లోనే అవకాడో ఫేస్ మాస్క్ లను ఎలా తయారుచేసుకోవలో తెలియచేస్తారు. త్వరగా దీనిపై దృష్టి పెట్టండి.

తేనె,అవకాడో మాస్క్:

తేనె,అవకాడో మాస్క్:

తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి యాక్నే, ఇతర చర్మ సంబంధిత సమస్యలపై బాగా పనిచేస్తుంది. ఇది ఒక మంచి తేమ కలిగినటువంటిది, అవకాడోతో కలిపి నపుడు, ఇది అద్భుతాలు చేస్తుంది. ఈ మిశ్రమం రంధ్రాలను మెరుగుపరిచి, చర్మాన్ని గట్టిగా చేసి, వయసు తగ్గేట్టు కనిపించడానికి సహాయపడుతుంది.

దీన్ని ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ చూడండి.

ఎలా ఉపయోగించాలి:

1.పండిన అవకాడో ని నలిపి, 1-2 టేబుల్ స్పూన్ల తేనెను కలపండి.

2.ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సున్నితంగా పూయండి.

3.ఇలా 20 నిమిషాల పాటు ఉండండి.

4.సాధారణ నీటితో కడిగేయండి.

కీరదోస,అవకాడో:

కీరదోస,అవకాడో:

నీటి శాతం ఎక్కువగా ఉన్న కీరదోస మీ చర్మం తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. దీన్ని అవకాడో తో కలిపితే, ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

1.అవకాడో గుజ్జుని నలిపి, దాన్ని కీరదోస రసంతో కలపండి.

2.మీ ముఖంపై ఈ మిశ్రమాన్ని సమానంగా అప్లై చేయండి.

3.ఇలా 15-20 నిమిషాల పాటు ఉంచండి.

4.గోరువెచ్చని నీటితో కడిగేయండి.

5.ఇలా వారానికి ఒకసారి చేయండి.

వోట్మీల్, అవకాడో

వోట్మీల్, అవకాడో

పొడి చర్మం గల వారికి ఈ చికిత్స ఉపయోగకరంగా ఉంటుంది. ఓట్మీల్ దద్దుర్లను తగ్గించి, దురదల నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. అవకాడో చర్మాన్ని తేమగా, హైడ్రేట్ గా ఉంచుతుంది.

ఎలా ఉపయోగించాలి:

1.అవకాడో, ఉడికించిన ఓట్మీల్ తో కలపండి.

2.ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సమానంగా రాయండి.

3.అది ఆరిపోయే వరకు అలాగే వదిలేయండి.

4.సాధారణ నీటితో కడిగేయండి.

5.ప్రతి రెండు వారాలకు ఒకసారి ఇలా చేయండి.

అరటి పండు, అవకాడో మాస్క్:

అరటి పండు, అవకాడో మాస్క్:

అరటిపండు లో విటమిన్లు, ఇతర పోషకాలు అధికంగా ఉండడం వల్ల ఇవి చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

వీటి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ప్రమాదకర బాక్టీరియాపై పోరాడి చర్మాన్ని రక్షించడానికి సహాయపడతాయి. యాక్నే, మొటిమల చికిత్సకు అరటిపండు, అవకాడో మిశ్రమ చికిత్స చాలా మంచిది.

ఎలా ఉపయోగించాలి:

1.ఒక బౌల్ లో ఒక అవకాడో ని చిదమంది.

2.అరటిపండు తొక్కతీసి, చిన్నచిన్న ముక్కలుగా చేయండి.

3.ఒక ఫోర్క్ సహాయంతో ఈ రెంటిని కలపండి. మృదువైన మిశ్రమం తయారవుతుంది.

4.మీ ముఖం మొత్తం ఈ మిశ్రమాన్ని పూయండి.

5.ఇలా 15-20 నిముషాలు వదిలేయండి.

6.గోరువెచ్చని నీటితో కడిగేయండి.

7.ప్రతిరోజూ ఇలా చేయండి.

పెరుగు, అవకాడో మాస్క్:

పెరుగు, అవకాడో మాస్క్:

పెరుగులో ప్రో-బయోటిక్ బాక్టీరియా ఉండడం వల్ల ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతేకాకుండా, యాక్నే కు కారణమైన బాక్తీరియాని చంపడానికి కూడా ఇది సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

1.ఒక బౌల్ లో ఒక అవకాడో ని చిదమండి.

2.పెరుగు ని అవకాడో మిశ్రమంతో కలపండి.

3.దీన్ని మీ చర్మంపై అప్లై చేయండి.

4.ఈ మాస్క్ ని 15-20 నిమిషాల పాటు వదిలేయండి.

5.సాధారణ నీటితో కడిగేయండి.

6.మీరు ఈ ఫేస్ మాస్క్ ని ప్రతిరోజూ వాడండి.

నిమ్మకాయ, అవకాడో మాస్క్:

నిమ్మకాయ, అవకాడో మాస్క్:

నిమ్మకాయ సిట్రిక్ ఆసిడ్ ని కలిగి ఉంటుంది కాబట్టి, ఇది డెడ్ స్కిన్ సేల్స్ ని చంపి, మీ చర్మానికి జీవత్వాన్ని కలిగిస్తుంది. వీటిలోని యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు యాక్నేపై పోరాడడానికి సహాయపడతాయి.

వాడడం ఎలా:

1.అవకాడో ని ఒక బౌల్ లో తీసుకోండి.

2.సగం నిమ్మకాయని కోయండి

3.నిమ్మకాయ నుండి రసాన్ని బైటకి తీయండి.

4.అవకాడో మిశ్రమానికి నిమ్మరసాన్ని కలపండి.

5.ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేయండి. దేబ్బాలపై, కళ్ళు లేదా పెదాలపై ఈ మిశ్రమాన్ని రాయకండి.

6.ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై 15 నిమిషాల పాటు ఉంచండి.

7.సాధారణ నీటితో ముఖాన్ని కడగండి.

8.శుభ్రమైన తువాలుతో ముఖాన్ని తుడవండి.

9.ఇలా వారానికి 2-3 సార్లు చేయండి.

10.మీరు బైటికి వెళ్ళేటపుడు సన్ స్క్రీన్ ని అప్లై చేయండి.

కొబ్బరి నూనె, అవకాడో మాస్క్:

కొబ్బరి నూనె, అవకాడో మాస్క్:

కొబ్బరి నూనె యాక్నే కి కారణమయ్యే బాక్టీరియాని చంపడమే కాకుండా మీ చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది కూడా. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సన్ డామేజ్ ని,వృద్ధాప్యం నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

మీరు పొడి చర్మం కలిగి ఉంటె, ఈ మాస్క్ మీ చర్మానికి మంచి ఆహరం.

ఎలా వాడాలి:

1.ఒక బౌల్ మాష్ చేసిన అవకాడో మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ వర్జిన్ కొబ్బరి నూనెను కలపండి.

2.పదార్ధాలను బాగా కలపండి.

3.ఆ మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేయండి.

4.ఆ మాస్క్ ని మీ చర్మంపై 15-20 నిమిషాల పాటు ఉంచండి.

5.సాధారణ నీటితో కడిగేయండి.

6.అందమైన చర్మం కోసం ఈ విధానాన్ని ప్రతిరోజూ చేయండి.

పసుపు, పెరుగు, అవకాడో మాస్క్:

పసుపు, పెరుగు, అవకాడో మాస్క్:

పసుపు కర్క్యుమిన్ కలిగి ఉండడం వల్ల ఇది యాక్నే, ఎగ్జిమా, నల్ల చారలను పోగొట్టి, మీ చర్మాన్ని చైతన్యాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. అవకాడో తో పెరుగు కలిపినపిన ఈ ఫేస్ మాస్క్ ముడతలు, మృదువైన చర్మ౦పై అద్భుతంగా పనిచేస్తుంది.

వాడడం ఎలా:

1.బౌల్ లో ఒక అవకాడో ని మాష్ చేయండి.

2.ఒక బౌల్ అవకాడో మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ పసుపుని కలపండి.

3.ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలపండి.

4.ఈ పదార్ధాలు అన్నిటినీ సరిగా కలపండి.

5.ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేయండి.

6.ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచండి.

7.సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి, శుభ్రమైన తువాలుతో తుడవండి.

8.ఇలా వారానికి 2-3 సార్లు చేయండి.

గుడ్డు లోని పచ్చసొన, అరటిపండు, అవకాడో మాస్క్:

గుడ్డు లోని పచ్చసొన, అరటిపండు, అవకాడో మాస్క్:

గుడ్డు పచ్చ సొనలో ప్రోటీన్లు, ఎ, బి2, బి3 వంటి విటమిన్లు ఉంటాయి, ఇవి మీ చర్మ కాలాలలో ఉన్న తేమను నిలబెట్టి, చర్మం మృదువుగా, సున్నితంగా ఉండేట్టు చేస్తుంది.

ఎలా వాడాలి:

1.సగం అండిన అవకాడో, అరటిపండు తీసుకోండి.

2.ఎగ్ వైట్ నుండి పచ్చ సొన ను వేరుచేయండి.

3.ఒక బౌల్ లో పచ్చ సొన, అవకాడో, అరటిపండు ను కలపండి.

4.గట్టి పేస్ట్ లా చేయండి.

5.ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సమంగా రాయండి.

6.ఈ మిశ్రమాన్ని 15-20 నిముషాలు వదిలేయండి.

7.సాధారణ నీటితో మీ ముఖాన్ని కడిగి, శుభ్రంగా తుడుచుకోండి.

8.మీరు కలలుకనే చర్మం వచ్చే వరకు ఇలా ప్రతిరోజూ చేయండి.

గ్రీన్ టీ, అవకాడో మాస్క్:

గ్రీన్ టీ, అవకాడో మాస్క్:

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు, మంటను తగ్గించే ఎపిగాలోకేటేచిన్ గాలేట్ (EGCG) ఎక్కువగా ఉంటాయి. మరోవైపు అవకాడో చర్మాన్ని మృదువుగా చేస్తుంది; ఈ రెండూ కలిస్తే, మీ చర్మానికి ఇది చాలా అద్భుతమైన పదార్ధం.

ఎలా వాడాలి:

1.చేతినిండా గ్రీన్ టీ ఆకులను తీసుకోండి.

2.ఒక బౌల్ లో ఒక అవకాడో మొత్తాన్ని మాష్ చేయండి.

3.ఇప్పుడు, ఒక ఫోర్క్ ని ఉపయోగించి ఈ రెండు పదార్ధాలను బాగా కలపండి.

4.మీ మొత్తం ముఖంపై ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.

5.ఇలా 15-20 నిమిషాల పాటు వదిలేయండి.

6.సాధారణ నీటితో ముఖాన్ని కడగండి.

7.ఇలా ప్రతిరోజూ చేయండి.

జాగ్రత్తలు:

కొంతమందికి కొన్ని పదార్ధాల వల్ల అలర్జీ రావొచ్చు, కాబట్టి ముందు చర్మంపై పాచ్ టెస్ట్ చేయండి.

English summary

benefits of avocado for skin | how to use avocado for skin

benefits of avocado for skin | how to use avocado for skin, Check out the benefits of avocado for skin care.
Story first published: Friday, December 1, 2017, 13:00 [IST]