స్కిన్ బ్రషింగ్ తో చర్మం మెరిసిపోవడంతో పాటు, మానసిక ప్రశాంతత..!

Posted By:
Subscribe to Boldsky

చర్మంపై మృతకణాలు చేరినప్పుడు కాంతి తగ్గిపోతుంది. చర్మం నిస్తేజంగా, ముడతలుగా కనిపిస్తుంది.ఈ సమస్య పరిష్కారానికి...

బాడీ బ్రషింగ్..చర్మం మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తూ నిగారింపు తీసుకొచ్చే వాటిలో ఇది కూడా ఒక పద్దతి. మెత్తని బ్రిసిల్స్ ఉన్న బ్రష్ లేదా స్పాంజ్ ను ఉపయోగించి చర్మాన్ని శుభ్రపరిచే ఈ ప్రక్రియ వల్ల కేవలం సౌందర్యపరంగానే కాదు..ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి.

బాడీ బ్రష్ మార్కెట్‌లో లభిస్తుంది. ఈ బ్రష్ కుచ్చులు చాలా మెత్తగా ఉంటాయి. స్నానం చేసే సమయంలో ఈ బ్రష్‌తో మృదువుగా చర్మంపై రబ్ చేస్తే మురికి, మృతకణాలు తొలగిపోతాయి.

Benefits Of Skin Brushing

సరైన రక్తప్రసరణకు, మానసిక ప్రశాంతతకు ఇలా ఈ ప్రక్రియ వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇంతకీ ఏంటీ ఈ స్కిన్ బ్రిషింగ్ ? దీని వల్ల కలిగే ఉపయోగాలేంటి..? తదితర విషయాలన్నీ మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే వెంటనే చదివేయండి...

మెత్తని, పొడవాటి బ్రిసిల్స్ ఉన్న బ్రష్ ఉపయోగించి చర్మంపై మ్రుదువుగా రుద్దడం వల్ల పై పొరల్లో పేరుకుపోయిన దుమ్ము, ధూళి, డెడ్ స్కిన్ సెల్స్, వంటి వాటిని తొలగించే ప్రక్రియనే స్కిన్ బ్రషింగ్ అంటారు. అలాగని ఇదేమీ అంత కష్టమైనదీ కాదు. ఇందుకు వేరొకరి సహాయం కూడా అవసరం లేదు. ఎవరికి వారు సులభంగా బ్రషింగ్ చేసుకోవచ్చు.

స్కిన్ బ్రషింగ్ వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం...

మృతకణాలు, దుమ్ము, ధూళి..వంటివి తొలగిపోవడానికి

మృతకణాలు, దుమ్ము, ధూళి..వంటివి తొలగిపోవడానికి

స్కిన్ బ్రషింగ్ వల్ల చర్మంపై ఉండే మృతకణాలు, దుమ్ము, ధూళి..వంటివి తొలగిపోవడమే కాదు...రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది. వ్రుద్ధ్యాప్య ఛాయలు కూడా అంత తొందరగా దరి చేరవు. ఈ ప్రక్రియ వల్ల కేవలం సౌందర్యపరంగానే కాదు...ఆరోగ్య పరంగా కూడా పలు ప్రయోజనాలున్నాయి.

స్కిన్ బ్రషింగ్ వల్ల చర్మం మెరిసిపోవడంతో పాటు, మానసిక ప్రశాంతత

స్కిన్ బ్రషింగ్ వల్ల చర్మం మెరిసిపోవడంతో పాటు, మానసిక ప్రశాంతత

స్కిన్ బ్రషింగ్ వల్ల చర్మం మెరిసిపోవడంతో పాటు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రస్తుత జీవనశైలిలో ప్రతి ఒక్కరికీ సమస్యగా మారుతోన్న ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఇది బాగా దోహద పడుతుంది.

చర్మంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది

చర్మంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది

అలాగే ఈ ప్రక్రియలో చర్మంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. కాబట్టి శరీరానికి ఇదో మంచి డీటాక్సిఫయర్ అని చెప్పుకోవచ్చు.

వ్యాధినిరోధక శక్తి కూడా మెరుగువుతుంది.

వ్యాధినిరోధక శక్తి కూడా మెరుగువుతుంది.

లింఫాటిక్ వ్యవస్థ మీద ప్రభావం చూపి శరీరంలోని మలినాలు బయటకు పోయేలా చేస్తుంది. ఫలితంగా వ్యాధినిరోధక శక్తి కూడా మెరుగువుతుంది.

సెల్యులైట్ బారి పడకుండా కూడా జాగ్రత్తపడవచ్చు.

సెల్యులైట్ బారి పడకుండా కూడా జాగ్రత్తపడవచ్చు.

జీర్ణ వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది.శరీరంలో ఒకేచోట కొవ్వులు పేరుకుపోకుండా కాపాడుతుంది. అలాగే బ్రషింగ్ వల్ల సెల్యులైట్ బారి పడకుండా కూడా జాగ్రత్తపడవచ్చు.

బాడీ బ్రషింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

బాడీ బ్రషింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

సాధారణంగా చాలా మంది పొడి చర్మం మీదే బ్రష్ లేదా స్పాంజ్ ఉపయోగించి బ్రషింగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే దానికి బదులు స్నానం చేసే సమయంలోనే శరీరంపై ఒకసారి నీళ్ళు పోసుకున్న తర్వాత కాస్త ఆరనిచ్చి ఆ తర్వాత స్కిన్ బ్రషింగ్ చేసుకోవడం వల్ల చర్మంపై పేరుకున్న మలినాలు, మృతకణాలు..చాలా సులభంగా తొలగిపోతాయి.

బాడీ బ్రషింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

బాడీ బ్రషింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

అంతే కాదు..చర్మం కూడా మృదువుగా, నిగారింపు సంతరించుకుంటుంది. అయితే బ్రష్ ని ఎప్పుడూ కూడా గుండెవైపుకు వచ్చే దిశలోనే ఉపయోగించాల్సి ఉంటుంది.

బాడీ బ్రషింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

బాడీ బ్రషింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

ఉదాహరణకు: కాళ్లపై చర్మాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు బ్రష్ లేదా స్పాంజ్ ను కింద నుంచి పైదిశగా అంటే గుండెవైపు వచ్చేలా ఉపయోగించాలి. అలాగే మెడ వద్ద శుభ్రం చేసుకునేటప్పుడు పై నుంచి కిందకు అంటే మెడ నుండి ఎదబాగం వైపు ఉపయోగించాలి. ఇలా ఏ భాగంలో చేసుకుంటున్నా బ్రష్ లేదా స్పాంజ్ మాత్రం గుండెవైపుగానే ఉపయోగించడం మంచిది.

బాడీ బ్రషింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

బాడీ బ్రషింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

శరీరానికి పొడవాటి బ్రిసిల్స్ ఉన్న బ్రష్ ని లేదంటే స్పాంజిని ఉపయోగిస్తే ముఖానికి మాత్రం చిన్న చిన్న మెత్తని బ్రిసిల్స్ ఉన్న బ్రష్ ని ఉపయోగించాలి. శరీరానికి ఉపయోగించిన బ్రష్ లేదా స్పాంజ్ ను ముఖానికి వాడకూడదు. ఒక వేల వాడితే సౌందర్య పరంగా పలు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

English summary

Benefits Of Skin Brushing

There are so many benefits of dry brushing. In other words, it is called as body brushing. It is a procedure of brushing your skin when it is not wet but when it is dry. In this post, let us talk about its benefits.
Story first published: Monday, February 20, 2017, 15:39 [IST]
Subscribe Newsletter