For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైస్ పౌడర్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!!

బియ్యం నీళ్ళలో కంటే బియ్యం పిండిలో మరిన్ని అద్భుత ప్రయోజనాలున్నాయని బ్యూటిషియన్లు అంటున్నారు. రైస్ పౌడర్ తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంలో నిగారింపు వస్తుందని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు.

|

బియ్యం నీళ్ళలోని హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాం కదా..!బియ్యం నీళ్ళల్లో ఆరోగ్య ప్రయోజనాల కంటే బ్యూటీ బెనిఫిట్సే ఎక్కువగా ఉన్నాయి. అంతే కాదు, బియ్యం నీళ్ళలో కంటే బియ్యం పిండిలో మరిన్ని అద్భుత ప్రయోజనాలున్నాయని బ్యూటిషియన్లు అంటున్నారు. రైస్ పౌడర్ తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంలో నిగారింపు వస్తుందని సూచిస్తున్నారు. అందుకే పురాతన కాలంలో దీన్ని ఎక్కువగా ఉపయోగించే వారని తెలియజేస్తున్నారు. బియ్యం పిండిని వంటలకు మాత్రమే కాదు, చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

 Benefits Of Using Rice Powder Face Packs

అందుకే దీన్ని ''ఫేమస్ ఏసియన్ బ్యూటీ సీక్రెట్'' అని కూడా అంటారు. రైస్ వాటర్ మరియు రైస్ పౌడర్ ను ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మ సంరక్షణలో ఎఫెక్టివ్ గా పనిచేసి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఏషియన్ బ్యూటీ సీక్రెట్ ను మీరు ఎందుకు ఫాలో అవ్వకూడదు. ?

బియ్యం పిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు. చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది. గతంలో వీటి గురించి తెలుసుకోవాలంటే ఏ పేపర్ లోనో, మ్యాగజైనో చూడాల్సి వచ్చేవి. అయితే ఇప్పుడు ఇన్ స్టాంట్ గా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను వెంటనే ఇంటర్నెంట్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాము.

రైస్ పౌడర్ ను ముఖానికి ఎలా ఉపయోగించాలి. ఫేస్ ప్యాక్ ను ఏవిధంగా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం...

 స్కిన్ లైటనింగ్ కోసం :

స్కిన్ లైటనింగ్ కోసం :

రైస్ పౌడర్ కు కొద్దిగా పెరుగు మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం, మెడ మొత్తానికి అప్లై చేయాలి. 15 నిముషాలు డ్రైగా మారిన తర్వాత దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది. ఇన్ స్టాంట్ గా స్కిన్ టోన్ మారుతుంది.

 డార్క్ సర్కిల్స్ నివారిస్తుంది:

డార్క్ సర్కిల్స్ నివారిస్తుంది:

కళ్ళ క్రింది నల్లని చారలు, నల్లని వలయాలు వయస్సైన వారి లక్షణాలను సూచిస్తాయి. ఏజింగ్ లక్షణాలను కనబడనివ్వకుండా డార్క్ సర్కిల్స్ ను మాయం చేయాలంటే బియ్యం పిండిలో ఆముదం నూనెను మిక్స్ చేసి, కళ్ళ క్రింది ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

చర్మానికి సన్ డ్యామేజ్ ను నివారిస్తుంది:

చర్మానికి సన్ డ్యామేజ్ ను నివారిస్తుంది:

రైస్ పౌడర్ లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఈ నేచురల్ రెమెడీ సూర్యరశ్మి నుండి వెలువడే యూవికిరణాల నుండి చర్మంను కాపాడటంలో సహాయపడుతుంది. అందుకోసం కొద్దిగా రైస్ పౌడర్ తీసుకు,ి అందులో కొద్దిగా పాలు మిక్స్ చేయాలి. పేస్ట్ లా చేసి, ముఖానికి అప్లై చేయాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే చర్మంలో తప్పనిసరిగా మార్పువస్తుంది. స్కిన్ టాన్ నివారిస్తుంది.

ఫేస్ పౌడర్ గా కూడా వేసుకోవచ్చు:

ఫేస్ పౌడర్ గా కూడా వేసుకోవచ్చు:

బియ్యం పిండిని నైస్ గా జల్లించి అందలో కార్న్ స్ట్రార్చ్ (మొక్కజొన్న పౌడర్ )ను మిక్స్ చేసి, మీరే స్వయంగా పౌడర్ ను తయారుచేసుకోవచ్చు. ఈ పౌడర్ వల్ల చర్మంలో ఎక్కువ జిడ్డు కనబడదు. ఎక్కువ సమయం నేచురల్ స్కిన్ కలిగి ఉంటారు.

స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది:

స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది:

చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయంటే చర్మం చూడటానికి చాలా డల్ గా కనబడుతుంది. రైస్ పౌడర్ లో కోర్స్ స్ట్రక్చర్ కలిగి ఉండటం వల్ల చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఈ రైస్ పౌడర్ కు తేనె లేదా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి, స్క్రబ్ చేయడం వల్ల చర్మంలో డెడ్ స్కిస్ సెల్స్ తొలగిపోయి, కొత్త చర్మ కణాలు ఏర్పడుతాయి.

ఏజ్ స్పాట్స్ ను నివారిస్తాయి:

ఏజ్ స్పాట్స్ ను నివారిస్తాయి:

బియ్యం పిండిలో కొద్దిగా కీరదోసకాయ జ్యూస్ మిక్స్ చేసి, ఫేస్ కు ప్యాక్ వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మంలో వయస్సైన లక్షణాలు కనబడనివ్వదు. చర్మంను టైట్ గా మార్చుతుంది. ఇది టాన్ నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. అలాగే చర్మానికి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

English summary

Benefits Of Using Rice Powder Face Packs

Rice powder has many skin benefits. Why not use this easily available ingredient to get the best skin of your life?
Story first published: Tuesday, January 24, 2017, 17:22 [IST]
Desktop Bottom Promotion