ఎండల్లో హాయ్..హాయ్...చర్మానికి చల్లదనాన్ని అందించే ప్యాక్స్..!!

Posted By:
Subscribe to Boldsky

సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు...ఎండ వేడికి చర్మం మండిపోతూ, ఎర్రగా...నల్లగా కమిలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇక బయటకు వెళ్లి వస్తే ముఖంలో కళ పోయిన నిర్జీవంగా మారిపోతుంది. మరి అలసిపోయిన చర్మానికి తిరిగి పునరుత్తేజ పరచాలంటే వేసవి వేడి నుండి చల్లదనాన్ని అందంచే ప్యాక్స్ ఏవైనా ఉన్నాయా అంటే...ఖచ్చితంగా ఉన్నాయనే అంటున్నారు సౌందర్య నిపుణులు .

ఇంట్లో లభించే సహజసిద్దమైన పదార్థాలతోనే కొన్ని ప్యాక్స్ తయారుచేసుకుని వాటి ద్వారా వేసవిలో చర్మాన్ని సంరక్షించుకోవచ్చంటున్నారు సౌైందర్య నిపుణులు. ఇంతకీ ఆ ప్యాక్స్ ఏంటో తెలుసుకుందాం. అందులో ఉపయోగించే పదార్థాలేంట..ఎలా సహాయపడుతాయాయో వెంటనే తెలుసుకుందాం..

ఒకసారి ఎండలోకి వెళ్తే శరీరంలోని నీటి స్థాయిలు తగ్గిపోయి, చర్మం వాడిపోయినట్లు అయిపోతుంది. ఇక పెరిగిన ఉష్ణోగ్రత కారణంగా ట్యాన్ వంటి సమస్యలు కూడా తలెల్తే అవకాశాలు లేకపోలేవు. అయితే కొన్ని ఫేస్ ప్యాక్స్ ఉపయోగించడం ద్వారా అటు చర్మానికి చల్లదనాన్ని అందిస్తూనే , ఇటు సౌందర్య సంబంధిత సమస్యలకు స్వస్తి పలకవచ్చు.

పాలు, నిమ్మరసం:

పాలు, నిమ్మరసం:

అరకప్పు చల్లటి పాలు తీసుకుని, అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసుకుని 15 నుండి 20 నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా చర్మంపై పేరుకున్న ట్యాన్ తొలగిపోవడంతో పాటు మచ్చలు, మొటిమలు కూడా తగ్గుముఖం పడుతాయి. అలాగే నిమ్మరసం చెమట ఎక్కువ పట్టకుండా చేసి, చర్మం సాప్ట్ గా , తాగా కనిపించేందుకు దోహదం చేస్తుంది.

పుదీనా, పెరుగు:

పుదీనా, పెరుగు:

గుప్పెడు పుదీనా ఆకులు తీసుకుని సరిపడినన్నీ నీళ్ళు వేస్తూ మెత్తగా పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఇందులో చెంచా పసుపు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. సుమారు 10 నుండి 15 నిముషాలు ఆరనిచ్చి తర్వాత గాఢత తక్కువగా ఉండే సోప్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పుదీనా అలసిన చర్మానికి చల్లదనం, జీవం అందిస్తుంది, పసుపు యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది.

శెనగపిండి :

శెనగపిండి :

కొద్దిగా శెనగపిండి తీసుకుని అందులో సరిపడా పెరుగు వేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో నిమ్మ రసం చేర్చి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసుకుని, 15 నుండి 20 నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. శెనగపిండి చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మంను ప్రకాశవంతంగా మారేలా చేస్తుంది. పెరుగు మేనుకు చల్లదనాన్ని అంధిస్తుంది.

కలబంద, పెరుగు:

కలబంద, పెరుగు:

ఒక చిన్న పాత్రలో కలబంద గుజ్జు 4 చెంచాలు, పెరుగు 2 చెంచాలు తీసుకుని, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు మందంగా కనిపించేలా ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. సుమారు 10 నుండి 15 నిముషాలు ఆరనిచ్చి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఎంజైమ్స్, అమైనో యాసిడ్స్, విటమిన్ ఎ, బి, సి, ఎఫ్..వంటివన్నీ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా చర్మానికి చల్లదనం అందడంతో పాటు ఎండకు కమిలిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది.

పుచ్చకాయ, తేనె :

పుచ్చకాయ, తేనె :

రెండు లేదా మూడు పుచ్చకాయ ముక్కలు తీసుకుని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ టా చేసుకోవాలి. ఇందులో చెంచా తేనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు దట్టంగా పట్టించాలి. సుమారు 15 నుండి 20 నిముషాలు ఆరనిచ్చి తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి చల్లదాన్ని అందించడంతో పాటు తిరిగా తాజాగా కనిపించేలా చేస్తాయి. అలాగే చర్మంపై ఉండే ముడుతలు, సన్నిని గీతలు కూడా తగ్గుముఖం పడతాయి.

దోసకాయతో :

దోసకాయతో :

దోసకాయ తీసుకుని తొక్క తొలగించి, చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నాలుగు లేదా ఐదు బాదం పప్పులు తీసుకుని దోసకాయ ముక్కల్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమంలో చల్లని పాలు కొద్దిగా వేసి బాగా కలిపి దా్ని ముఖం, మెోడకు ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. దాదాపు 10 నుండి 15 నిముషాల పాటు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా అలసిన చర్మం తక్షణమే తాజాగా మారుతుంది. అలాగే ప్రకాశంతమైన, మ్రుదువైన చర్మాన్ని సొంతం చేసుకుంటారు,

టామోటో:

టామోటో:

బాగా పండిన టమోటో ఒకటి తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో కాస్త తేనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమంతో ముఖం, మెడకు ప్యాక్ వేసుకోవాలి. 15 నుండి 20 నిముషాలు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు చర్మ తత్వం ఉన్న వారికి ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది.

బనానా ఫేస్ ప్యాక్ :

బనానా ఫేస్ ప్యాక్ :

సమ్మర్లో ఆయిల్ స్కిన్ సమస్యను ఎదుర్కొనే వారు చాలా మందే ఉంటారు. సమ్మర్లో ఆయిల్ స్కిన్ సమస్యను నివారించుకోవడానికి బనానా ఫేస్ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది. బాగా పండిన అరటి పండ్లను మెత్తగా గుజ్జులా చేసి, అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె రెండు టేబుల్ స్పూన్ల క్రీమ్ చేర్చి ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మం స్మూత్ గా మారుతుంది. మాయిశ్చరైజర్ అందిస్తుంది.

వేడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

వేడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

పైన సూచించిన ప్యాక్ రోజూ వేసుకోవడం ద్వారా వేసవిలో వేడికి అలసిన చర్మానికి తిరిగి తాజాదనం చేకూరుతూనే, వేడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Best Homemade Face Packs for Summer

    Best Homemade Face Packs for Summer, Tired of the sticky, tanned and greasy looking skin in summers? During summers, sweat can make you look dull and dark. So, here are few homemade face packs that can provide the cooling effect to your skin and fight sun tan in summers. Homemade summer faces packs to stay co
    Story first published: Wednesday, May 3, 2017, 11:44 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more