సమ్మర్లో చర్మ సమస్యలు, స్కిన్ టాన్ నివారించే మ్యాంగో ఫేస్ ప్యాక్స్..!!

Posted By:
Subscribe to Boldsky

బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్లు సమ్మర్ ఈజ్ బ్యాక్...ఈ సమ్మర్లో చర్మంలో ఎంత కావాలంటే అంత చెమట, జిడ్డు పొందుతారు. ముఖాన్ని ఎన్ని సార్లు శుభ్రం చేసుకుంటారో అన్నది విషయం కాదు, ఎంత శుభ్రం చేసుకున్నా, కొన్ని నిముషాల్లోనే చర్మం తిరిగి ఆయిలీగా మారిపోతుంది. కాబట్టి, వేసవిలో రిఫ్రెష్ గా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఎన్ని ప్రయత్నించాని ఇంకా దేనికోసమో అన్వేషణ సాగుతూనే ఉంటుంది కదా..!?

వేసవిలో మీరు ఎప్పడైనా మ్యాంగో ఫేస్ ప్యాక్ ప్రయత్నించారా ? మామిండి పండ్లు నోరూరించే రుచికరమైన పండ్లు మాత్రమే కాదు, ఈ సమ్మర్ ఫ్రూట్ డ్యామేజ్డ్ స్కిన్ ను ట్రీట్ చేయడంలో అద్భుతమైన రెమెడీ. ముఖ్యంగా వేసవిలో దీని ప్రయోజనాలు ఎక్కువ...

Best Mango Face Packs For Your Skin

పండ్లలో రారాజుగా పిలుచుకునే ఈ సమ్మర్ ఫ్రూట్ మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టమే. ఇందులో ఒక్క రుచి, తియ్యదనం, రంగు వాసన మాత్రమే కాదు, ఆరోగ్యం, అందం పరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి మొదలగునవి అద్భుతంగా ఉంటాయి. ఇవి చర్మానికి అనేక అద్భుతాలను చేస్తాయి.

సమ్మర్ లో మామిడితో మజా చేయండి..సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి...!

మామిడిపండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది. మామిడి పండ్లను బ్యూటి కోసం నేరుగా ఉపయోగించడం లేదా పెరుగు, పసుపు, పాలు , తేనె వంటి ఇతర పదార్థాలతో మిక్స్ చేసి ఉపయోగించడం వల్ల మరిన్ని గ్రేట్ బ్యూటి బెనిఫిట్స్ ను పొందవచ్చు.

మామిడి పండ్లలో ఉండే కొల్లాజెన్ వల్ల ఇది చర్మానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది ప్రీమెచ్యుర్ ఏజింగ్ ను నివారిస్తుంది. అలాగే చర్మంలో ప్యాచెస్ ను నివారిస్తుంది. అంతే కాకుండా మామిడి పండ్లలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని సాప్ట్ గా మరియు సపెల్ గా మార్చుతుంది.

కాబట్టి, సమ్మర్ సీజనల్లో చర్మాన్ని రక్షించుకోవాలన్నా, చర్మ అందాన్ని మెరుగు పరుచుకోవాలన్నా మామిడి పండ్లతో బెస్ట్ ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకోవాల్సిందే. మామిండి పండ్లు అన్ని చర్మ తత్వాలకు సహాయపడుతుంది. మరి వీటితో హాట్ సమ్మర్లో ఫేస్ ప్యాక్స్ ఎలా వేసుకోవాలి, ఏవిధంగా ప్రయోజనాలను అందిస్తోందో తెలుసుకుందాం...

మామిడి -ముల్తాని మట్టి:

మామిడి -ముల్తాని మట్టి:

మామిడి పండులోని గుజ్జు మాత్రం వేరుచేసుకుని, అందులో ముల్తాని మట్టి మిక్స్ చేసి పేస్ట్ లా చేసి దీన్ని ముఖానికి అప్లై చేసి డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పూర్తిగా తేమగా ఉంటుంది.

మామిడి-బాదం-ఓట్ మీల్ :

మామిడి-బాదం-ఓట్ మీల్ :

రోజంతా ఎక్కవగా కష్టపడి, అలసి ఇంటికొస్తే, మీ అలసిపోయిన చర్మానికి ఏవిధంగా రక్షణ కల్పిస్తారు?అలసిన చర్మం తిరిగి పునరుత్తేజం అవ్వాలంటే మామిడిపండ్ల గుజ్జు, బాదం పౌడర్, ఓట్ మీల్ పౌడర్ , పచ్చిపాలు, ముల్తాని మట్టి, వాటర్ మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. డెఫినెట్ గా మీరు రిఫ్రెష్ అవుతారు. మార్పు కూడా కనబడుతుంది.

మ్యాంగో విత్ హనీ :

మ్యాంగో విత్ హనీ :

తేనెలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు , మామిడిపండ్లతో కలిసినప్పడు, సూపర్ ఫేస్ ప్యాక్ గా పనిచేస్తుంది. మామిడి పండు గుజ్జులో కొద్దిగా తేనె, పెరుగు మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. బేబీ సాప్ట్ స్కిన్ పొందడానికి ఈ ప్యాక్ గ్రేట్ గా హెల్ఫ్ అవుతుంది.

మ్యాంగో విత్ రోజ్ వాటర్ :

మ్యాంగో విత్ రోజ్ వాటర్ :

మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్లైతే, మీరు రోజ్ వాటర్ ను ఉపయోగించడం మంచిది. రోజ్ వాటర్ చర్మంలోని చొచ్చుకుని పోయి, అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంటుంది.

మామిడి పండు -శెనగపిండి:

మామిడి పండు -శెనగపిండి:

వేసవిలో చర్మ సమస్యలో ఒకటి సన్ ట్యాన్, సన్ టాన్ కు గురి కాకూడదనుకుంటే, సరైన చర్మ సంరక్షన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది డార్క్ ప్యాచెస్ ను నివారిస్తుంది. ఈ హెల్తీ ఫేస్ ప్యాక్ తో సన్ టాన్ సమస్యను ను ఎక్సలెంట్ గా నివారించుకోవచ్చు. అందుకు ఒక మామిడి పండులో గుజ్జు తీసుకుని, అందులో శెనగపిండి, బాదం పౌడర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది ముఖంలో డార్క్ ప్యాచ్ లను నివారించడంతో పాటు చర్మంను అందంగా తయారుచేస్తుంది.

మామిడిపండు-ఓట్ మీల్ స్ర్కబ్ :

మామిడిపండు-ఓట్ మీల్ స్ర్కబ్ :

స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవడానికి ముఖంలో నేచురల్ గ్లో తీసుకురావడానికి స్ర్కబ్బింగ్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మామిడికాయ గుజ్జులో ఓట్ మీల్ పౌడర్ మిక్స్ చేసి ముఖం , మెడకు అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో మర్ధన చేయాలి. ఓట్ మీల్ చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మం తేమగా , కాంతివంతంగా మార్చుతుంది.

English summary

Best Mango Face Packs For Your Skin

The 'King' of fruits is one of the most important reasons that people don't complain much about summer. Being rich in vitamins A and C, mango is really a perfect option to treat skin issues. Besides, it contains helpful antioxidants that help prevent diseases like cancer.
Story first published: Wednesday, April 5, 2017, 13:48 [IST]
Subscribe Newsletter