మొటిమలు, మచ్చలు నివారించి, స్కిన్ వైట్ గా మార్చే బేకింగ్ సోడా ఫేస్ మాస్క్..!!

Posted By:
Subscribe to Boldsky

బేకింగ్ సోడాను సోడియం బై కార్బోనేట్ అని కూడా పిలుస్తారు. ఇది వంటలుకు మాత్రమే ఉపయోగించరు. కొన్నివస్తువుల క్లీనింగ్ ఏజెంట్ నుగాను ఉపయోగిస్తారు. అంతే కాదు బ్యూటీ కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు. దీని వల్ల చర్మానికి , కేశాలను అనే ప్రయోజనాలు ఉన్నాయి. మనకు తెలుసు మన బ్యూటీ కోసం ఫేస్ స్క్రబ్బింగ్ కోసం ఉప్పు, పంచదారను ఉపయోగిస్తుంటాం. వాటితో పాటు బేకింగ్ సోడా వంటింటి వస్తువును చర్మ మరియు కేశ సంరక్షణలో ఉపయోగించి బ్యూటీని ఇప్రూవ్ చేసుకోవచ్చు.

ఒక వారంలో మెడ నలుపును మాయం చేసే బేకింగ్ సోడా చిట్కాలు ..!!

మీ ముఖాన్ని స్క్రబ్ చేయడం లేదా పెడిక్యూర్ చేసుకోవడానికి బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు . ఇందులో ఉండే యంటాసిడ్, బేకింగ్ సోడా ప్రకృతిలో మద్యస్థ ఆమ్లం, కాబట్టి మలినాలను శుభ్రపరిచే సామర్థ్యం ఇందులో పుష్కలంగా ఉంది. ఇది ముఖ చర్మం మరియు శరీర చర్మ సంరక్షణకోసం ఒక మంచి ఎక్స్ ప్లోయేట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆల్కలైన్ , యాంటీసెప్టిక్ గుణాల వల్ల సన్ బర్న్ నివారిస్తుంది, స్కిన్ టోన్ ను లైట్ గా మార్చుతుంది. మొటిమలతో పోరాడుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది.

Best Ways To Include Baking Soda In Your Skin Care Routine

ముఖ్యంగా బేకింగ్ సోడాను కడుపు గడబిడగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. ఈ బేకింగ్ సోడాను ఆరోగ్యానికి, మాత్రమే కాకుండా ఇతర స్కిన్ కేర్ మరియు బ్యూటీ ట్రీట్మెంట్ లలో కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే ఆర్గాన్స్ వల్ల అటు బ్యూటీలోనూ, ఇటు ఆరోగ్యానికి చాలా అద్భుతమైన ఫలితాలను అంధించవచ్చు. మీరు కనుక ఖరీదైన బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే, ఈ తక్కువ బడ్జెట్ తో బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడాను ఉపయోగించి తల వెంట్రుకల నుండి కాలి గోళ్ళవరకూ హెల్తీ మరియు బ్యూటీ ట్రీట్మెంట్ లో ఉపయోగించవచ్చు . అయితే మితంగా మాత్రమే ఉపయోగించాలి. వారానికొకసారి మాత్రమే ఉపయోగించాలి. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తుంది.బేకింగ్ సోడాలో దాగున్న బోలెడన్ని బ్యూటీ సీక్రెట్స్..!!

మరి గార్జియస్ స్కిన్ పొందడానికి ఈ బేకింగ్ సోడా ఎలా ఉపయోగించాలో చూద్దాం...

బేకింగ్ సోడా-కొబ్బరి నూనె

బేకింగ్ సోడా-కొబ్బరి నూనె

అరకప్పు బేకింగ్ సోడా తీసుకుని అందులో 2 టీస్పూన్ల కొబ్బరి నూనె, ఒక టీస్పూన్ డిస్టిల్డ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికొకసారి ఇలా చేయడం వల్ల స్కిన్ మాయిశ్చరైజ్ గా ఉంటుంది.

బేకింగ్ సోడా-నిమ్మరసం

బేకింగ్ సోడా-నిమ్మరసం

ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో ఒక టీస్పూన్ డిస్టిల్డ్ వాటర్, ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి, ముఖం శుభ్రం చేసుకుని, ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. ఇలా వారానికొకసారి చే్తే స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.

బేకింగ్ సోడ-యాపిల్ సైడర్ వెనిగర్

బేకింగ్ సోడ-యాపిల్ సైడర్ వెనిగర్

ఒక టీస్పూన్ బేకింగ్ సోడా 3 చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ డిస్టిల్డ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. వారానికొకసారి అప్లై చేస్తే మొటిమలు, మచ్చలు మాయం అవుతాయి.

బేకింగ్ సోడ -ఎగ్

బేకింగ్ సోడ -ఎగ్

ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, ఒక గుడ్డులోని పచ్చసొన బౌల్లో తీసుకుని, రెండింటిని మిక్స్ చేయాలి. రెండూ మిక్స్ చేసిన తర్వాత ఫేస్ కి అప్లై చేయాలి. ఈ ప్యాక్ ను వీక్లి వన్స్ వేసుకుంటే స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది.

బేకింగ్ సోడ-టమోటో గుజ్జు

బేకింగ్ సోడ-టమోటో గుజ్జు

ఒక టేబుల్ స్పూన్ టమోటో గుజ్జుకి ఒక టీస్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేయాలి. అందులో కొద్దిగా డిస్టిల్ వాటర్ మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ఫేస్, నెక్ కు అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వీక్లీ వన్స్ చేస్తే సన్ టాన్ నివారించుకోవచ్చు.

 బేకింగ్ సోడ-ఆలివ్ ఆయిల్

బేకింగ్ సోడ-ఆలివ్ ఆయిల్

ఒక టీస్పూన్ బేకింగ్ సోడతో, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నెక్ అండ్ ఫేస్ కు అప్లై చేసి 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికొకసారి వేసుకుంటే, స్కిన్ హైడ్రేషన్ లో ఉంటుంది. కాంతివంతంగా మారుతుంది.

బేకింగ్ సోడా -కార్న్ ఫ్లోర్

బేకింగ్ సోడా -కార్న్ ఫ్లోర్

ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, ఒక టీస్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, ముఖం, మెడకు అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించుకోవచ్చు.

English summary

Best Ways To Include Baking Soda In Your Skin Care Routine

Read this post to know how to use baking soda on skin and the best ways you could use it when mixed with other ingredients.