కాఫీలో ఉండే చార్మింగ్ అండ్ గ్లోయింగ్ బెనిఫిట్స్..

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

మన రోజువారి దినచర్యలో మొదట చేసే పని కమ్మని కాఫీ తాగడం. నిద్రలేచిన వెంటనే కమ్మని కాఫీ తాగితే ఇక ఆరోజంతా ఉల్లాసంగా, ఉత్సహాంగా ఫీలయ్యే వారు ఎందరో..దీని వెనుక ఎంత మహత్యం ఉందో తెలియదు కానీ, కాఫీ అడిక్ట్ అయ్యుండే వారు మాత్రం వేలల్లో..లక్షల్లో లెక్కపెట్టలేనంత మంది ఉంటారు.

ప్రత్యేకంగా చెప్పాలంటే ఎక్కువగా రచయితలు, మ్యుజీషియన్స్, జర్నలిస్టులకు ఈ వ్యసనం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది స్టెరో టైప్ కానప్పటికీ ఈ వ్యసనం వెనుక మాత్రం ఏదో ఉందనే చెప్పవచ్చు.

ఒక కప్పు కాఫీతో ఆరోగ్యానికి ఆశ్చర్యం కలిగే లాభాలు

కాఫీ గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి. కేవలం కాఫీ మగ్ లో ఉన్న కాఫీ కాదు, కాఫీ పౌడర్ కూడా వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. కాఫీలో చర్మసంరక్షణకు ఉపయోగపడే అద్భుతమైన ప్రయోజనాలెన్నో దాగున్నాయి. కాఫీలో ఉన్న ఉపయోగకరమైన లక్షణాలు చర్మానికి ఒక మ్యాజికల్ ఎఫెక్ట్స్ ను అందిస్తాయి.

ఈ వండర్ ఫుల్ డ్రింక్ తాగడానికి మాత్రమే కాదు, అద్భుతమైన క్వాలిటీ కూడా దాగున్నయానడానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా అందాన్ని మెరుగుపరచడంలో కాఫీ గ్రేట్. మీరు కాఫీ లవర్ కాకపోయినా, మీ చర్మ సౌందర్యాన్నిపెంచడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

చర్మంకు కాఫీ అందించే బ్యూటిఫుల్ బెనిఫిట్స్

కాబట్టి, కేవలం కాఫీ లవర్స్ మాత్రమే కాదు, ఇతరులు కూడా ఈ ఆర్టికల్ చదివిన తర్వాత కాఫీని ఉపయోగించడం వెంటనే ప్రారంభిస్తారు. మరి కాఫీలో దాగున్న ఆ అద్భుతమైన చార్మింగ్ అండ్ గ్లోయింగ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం...

కాఫీ ఫేషియల్ స్ర్కబ్ గా పనిచేస్తుంది

కాఫీ ఫేషియల్ స్ర్కబ్ గా పనిచేస్తుంది

కాఫీలో స్ర్కబ్బింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి. కాఫీ పౌడర్ ఎక్కువ గరుకుగా ఉండదు కాబట్టి, చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. కాఫీ స్ర్కబ్ ను తయారుచేసకోవడం , స్క్రిన్ స్క్రబ్బర్ గా ఉపయోగించడం కూడా సులభం.

ఒక టీస్పూన్ కాఫీపౌడర్ లో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేసి, సన్నితంగా మర్ధన చేయాలి.ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిసోతాయి.

తలను శుభ్రం చేస్తుంది:

తలను శుభ్రం చేస్తుంది:

డెడ్ స్కిన్ సెల్స్ కేవలం చర్మంలోనే కాదు, తలలో కూడా ప్రభావం చూపుతుంది. తలలో చర్మం పొడిబారి, చుండ్రు సమస్యకు దారితీస్తుంది.

కాఫీ పౌడర్ ను తలలో అప్లై చేసి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, తల శుభ్రపడుతుంది. జుట్టు పెరుగుతుంది.

కళ్ళ ఉబ్బును తగ్గిస్తుంది:

కళ్ళ ఉబ్బును తగ్గిస్తుంది:

కళ్ళు ఉబ్బును తగ్గిస్తుంది.అనారోగ్యం, అలసట, ఒత్తిడి కారణంగా కళ్ళు ఉబ్బుతాయి. కాఫీ ఐస్ క్యూబ్స్ ను కళ్ళు ఉబ్బును తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడతాయి. కాఫీ స్ర్కబ్ చాలా సింపుల్ గా టెక్నిక్.

కాఫీ పౌడర్ ను నీళ్ళలో కలిపి , ఐస్ క్యూబ్ ట్రేలో నిపించి ఫ్రిజ్ లో స్టోర్ చేయాలి. ఫ్రీజ్ చేసిన తర్వాత ట్రే నుండి ఐస్ క్యూబ్స్ ను తొలగించాలి. తర్వాత దీన్ని కళ్ళ మీద అప్లై చేసి రబ్ చేయాలి.

స్కిన్ బ్రైట్ గా చేస్తుంది:

స్కిన్ బ్రైట్ గా చేస్తుంది:

కాఫీ స్క్రబ్బిం, ఎక్స్ ఫ్లోయేటింగ్ మాత్రమే కాదు, స్కిన్ బ్రైట్ గా మార్చే ఫార్ముల ఉంది. అందుకు మీరు చేయాల్సిందల్లా, పచ్చిపాలలో కాఫీ పౌడర్ మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేయాలి. డల్ గా ఉన్న మీ చర్మాన్ని బ్రైట్ గా మార్చుతుంది.ఇది చర్మానికి సులభంగా పనిచేస్తుంది. ఇది చర్మానికి నేచురల్ గ్లోను తీసుకొస్తుంది.

English summary

Coffee Benefits On Skin, Benefits Of Coffee On Skin, How Coffee Heals Skin Problems

Coffee would no longer remain a drink for you. Have a look.
Story first published: Tuesday, September 19, 2017, 14:30 [IST]