బ్యూటి టిప్స్: అందాన్ని మెరుగుపరుచుకోవడానికి గ్రీన్ టీ ఫేస్ ప్యాక్..!

Posted By:
Subscribe to Boldsky

గ్రీన్ టీ గురించి మీరు వినే ఉంటారు? గ్రీన్ టీలో అనేక ఆరోగ్య, సౌందర్య రహస్యాలు దాగున్నాయి. గ్రీన్ టీ చర్మ సంరక్షణలో గొప్పగా సమాయపడుతుందన్న విషయం మీకు తెలుసా?గ్రీన్ టీని చర్మ సంరక్షణకు ఏవిధంగా ఉపయోగించాలో ఈ ఆర్టికల్లో తెలపడం జరిగింది. !

అలాగే రెగ్యులర్ గా ఒకటి, రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల చర్మం, జుట్టు అందానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాదు, బాడీలో ఇంటర్నల్ గా కూడా గొప్ప ప్రయోజనాలు అందుతాయి. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ శక్తిని పెంచుతుంది.

Different Ways To Include Green Tea In Your Beauty Regimen

గ్రీన్ టీ మన ఇండియాలో అంత ప్రసిద్దికాకపోయినా, హెల్తీ బెవరేజ్ గా ఈ మద్య కాలంలో చాలా పాపులర్ అయింది. ఎందుకంటే, గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్, మ్యాంగనీస్, విటమిన్ బి వంటి ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. బ్లాక్ టీ, కాఫీ కంటే గ్రీన్ టీ హెల్తీ డ్రింక్.

శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగాలి. ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గ్రీన్ టీని వివిధ రకాల బ్యూటీ క్రీమ్స్, ఫేస్ మాస్క్ , స్ర్కబ్బింగ్ లో ఉపయోగిస్తుంటారు. గ్రీన్ టీని వివిధ రకాల బ్రాండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా మిక్స్ చేస్తుంటారు. అయితే గ్రీన్ టీ చర్మ సంరక్షణలో ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం...

 క్లియర్ స్కిన్:

క్లియర్ స్కిన్:

ఏ ఫేస్ ప్యాక్ లో అయినా సరే, మచ్చ గ్రీన్ టీ పౌడర్ ను మిక్స్ చేయాలి. ఈ మాస్క్ వల్ల చర్మంలో మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఇంకా ఇందులో స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుండటం వల్ల డార్క్ స్పాట్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఫెయిర్ స్కిన్:

ఫెయిర్ స్కిన్:

గ్రీన్ టీ మాస్క్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మంలో ఫెయిర్ నెస్ తీసుకురావడానికి ఫర్ఫెక్ట్ పదార్థం. అలాగే స్కిన్ టాన్ తొలగిస్తుంది. గ్రీన్ టీ తీసుకుని, చల్లారిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి.

ఫిర్మ్ స్కిన్:

ఫిర్మ్ స్కిన్:

గ్రీన్ టీలో ఉండే ఫాలీఫినాల్స్ చర్మం సాగకుండా లేదా వదులవ్వకుండా ఉబ్బుగా కనబడేట్లు చేస్తుంది. గ్రీన్ టీ ఆకులను పసుపు, పాలతో మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. అందమైన చర్మం పొందడానికి దీన్ని ఉపయోగించాలి.

మొటిమలు:

మొటిమలు:

గ్రీన్ టీ లో కాటన్ డిప్ చేసి, మొటిమలు, మచ్చలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. గ్రీన్ టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను స్మూత్ గా మార్చుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

గ్లోయింగ్ స్కిన్:

గ్లోయింగ్ స్కిన్:

గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్స్ చర్మంను మెరిసేట్లు, క్లియర్ చేస్తుంది. గ్రీన్ టీ ఆకులను , శెనగపిండి, పెరుగు తో చేర్చి, చర్మానికి అప్లై చేసి స్ర్కబ్బింగ్ చేసుకోవచ్చు. స్కిన్ కేర్ బెనిటిఫిట్స్ బెటర్ గా పొందడానికి గ్రీన్ టీ గొప్పగా సహాయపడుతుంది.

ఏజింగ్ కంట్రోల్ చేస్తుంది:

ఏజింగ్ కంట్రోల్ చేస్తుంది:

గ్రీన్ టీలో ఉండే ఔషధగుణాలు, హానికరమైన ఫ్రీరాడికల్స్ ను క్రమబద్దం చేస్తుంది. ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. గ్రీన్ టీకి కొద్దిగా కొబ్బరి నూనెను మిక్స్ చేసి, ముఖానికి మెడకు, అప్లై చేయాలి. రాత్రి పడుకునే ముందు అప్లై చేస్తే ఫలితం మరింత బెటర్ గా ఉంటుంది. ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

చర్మ రంద్రాలను ష్రింక్ చేస్తుంది:

చర్మ రంద్రాలను ష్రింక్ చేస్తుంది:

గ్రీన్ టీని ఫ్రిజ్ లో నిల్వచేసి, అవసరమైనప్పుడు బయటకు తీసి అందులో కాటన్ బాల్ డిప్ చేయాలి. దీంతో ముఖం, మెడ మొత్తం అప్లై చేయాలి. ఇలా చేయడంవల్ల గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్స్, చల్లని వాటర్ చర్మ రంద్రాలను మూసుకునేలా చేస్తుంది.

టోనర్:

టోనర్:

గ్రీన్ టీ ముఖంలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నాలుగు బాగాల నీళ్ళలో ఒక బాగం గ్రీన్ టీ తీసుకోవాలి. దీన్ని స్పే బాటిల్లో నింపి, దీన్ని మొత్తం షేక్ చేయాలి. ఈ నీటితో ప్రతి రోజూ ముఖం శుభ్రం చేసుకోవాలి.

 డెడ్ స్కిన్ తొలగిస్తుంది:

డెడ్ స్కిన్ తొలగిస్తుంది:

గ్రీ్ టీలో ఎక్స్ ఫ్లోయేటింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి., దీన్ని రెగ్యులర్ ఫేస్ వాస్ గా , ఫర్ఫెక్ట్ స్ర్కబ్బింగ్ గా ఉపయోగించుకోవచ్చు. ఈ స్ర్కబ్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మం సాఫ్ట్ గా గ్లోయింగ్ గా మెరిసిపోతుంటుంది.

డార్క్ సర్కిల్స్ :

డార్క్ సర్కిల్స్ :

కళ్ళ క్రింద చర్మం చాలా సెన్సింటివ్ గా, లైంగ్ గా ఉంటుంది. కళ్ళ క్రింది బాగంలో ఈ మాస్క్ వేసుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు. కాటన్ బాల్ తీసుకుని, గ్రీన్ టీలో డిప్ చేసి,కళ్ళక్రింది రోజుకు రెండు సార్లు అప్లై చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి.

English summary

Different Ways To Include Green Tea In Your Beauty Regimen

Indulge in the goodness of green tea and know how to use it to treat most of your skin and hair problems.
Story first published: Tuesday, March 28, 2017, 20:00 [IST]
Subscribe Newsletter