For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహజ సౌందర్యాన్ని ఈ ఆయిల్స్ ద్వారా మీ సొంతం చేసుకోండి...

By Ashwini Pappireddy
|

సంవత్సరాల తరబడి మన సమాజంలో నూనెలను వివిధ రకాలుగా వాడుతున్నారు. అది ప్రకృతి మనకిచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి. కొన్ని నూనెలను వంట కోసం ఉపయోగిస్తారు. అయితే, కొన్ని నూనెలను సౌందర్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

మహిళలు తమ జుట్టుకు ముఖ్యంగా నూనెలను కావాల్సినంత ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె, బాదం నూనె మరియు ఆలివ్ నూనెలు మన జుట్టు ని దృడంగా చేస్తాయి. ఇవి ఇంకా జుట్టుని మందంగా చేసి జుట్టు రాలిపోకుండా మరియు జుట్టుకి నష్టం కలగకుండా సంరక్షిస్తుంది. కొన్ని నూనెలను మన శరీరానికి కూడా ఉపయోగిస్తారు. నూనెలు మన చర్మం మరియు వెంట్రుకలలో కోల్పోయిన తేమను భర్తీ చేసే అద్భుత మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి.

నూనెలు ఇతర సౌందర్య ప్రయోజనాలను కూడా కలిగి వున్నాయి. మనం రోజూ వాడే క్రీమ్స్ కంటే నూనెలు మరింత శక్తివంతంగా ఉంటాయి, అవి కాంతిని మన చర్మంలోకి సులభంగా శోషించబడతాయి. ఇవి ఎపిడెర్మిస్ యొక్క లోతైన పొరలు లోకి చొచ్చుకొని పోయి మనకు ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది.

మెరిసే చర్మానికి ఈ ఆయిల్స్ తో మసాజ్ తప్పనిసరిమెరిసే చర్మానికి ఈ ఆయిల్స్ తో మసాజ్ తప్పనిసరి

సహజ సౌందర్యాన్ని ఈ ఆయిల్స్ ద్వారా మీ సొంతం చేసుకోండి.

రోజువారీ అందం కోసం రొటీన్ గా ఉపయోగించే నూనెలను సాధారణ ప్రయోజనాల కోసమే కాకుండా, ప్రత్యేక సౌందర్య ప్రయోజనాలకోసం అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. నూనెలను ఒక సన్ స్క్రీం లోషన్ గా కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా?అవును ఇది నిజమే!

మనకు వివిధ రకాల ప్రయోజనాలను అందించే వివిధ నూనెలు వున్నాయి. రోజువారీ ఏ నూనెలను ఉపయోగించడంవలన మన సౌందర్య సంరక్షణ లో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు కలిగివున్నాయని తెలుసుకోవాలని వుందా? అయితే దాని గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.

1) ఫేసియల్ క్లీన్సర్:

1) ఫేసియల్ క్లీన్సర్:

పరిశుద్ధత కోసం కూడా ఆయిల్ ని ఉపయోగిస్తారా అని అనుకుంటున్నారా? అవునండి నిజం ముఖం మీద ఉన్నటువంటి మురికి, జిడ్డుని తొలగించడానికి నూనె సహాయం చేస్తుంది. ద్రాక్ష సీడ్ లేదా జోజోబా నూనె తో వృత్తాకార కదలికతో చర్మంపై మర్దనా చేసి దానిని శుభ్రంగా పత్తి తో తుడవండి. మీ చర్మం శుభ్రంగా మారి మరియు ఆశ్చర్యకరంగా జిడ్డులేని ముఖాన్ని చూసి ఆశ్చర్యపోతారు.ఈ పద్ధతి మేకప్ ని తీసివేయడంలో కూడా చాలా ప్రభావవంతమైనది.

2) సన్ స్క్రీన్ లాగా:

2) సన్ స్క్రీన్ లాగా:

క్యారట్ విత్తనాల నూనె లేదా సోయా బీన్ నూనె మన చర్మం సూర్యుడి నుండి సంరక్షించడంలో సహాయపడుతుంది. ఈ నూనెలు చర్మానికి ఒక పొరలా ఏర్పడి, హానికరమైన సూర్య కిరణాలు మన చర్మం మీద పడకుండా కాపాడుతాయి.

ఫేషియల్ ఆయిల్స్ చర్మసంరక్షణకు మంచివేనా ఫేషియల్ ఆయిల్స్ చర్మసంరక్షణకు మంచివేనా

3) ఒక కట్యుల్ ఆయిల్:

3) ఒక కట్యుల్ ఆయిల్:

ఆలివ్ నూనె గోరును బలపరుస్తుంది మరియు వాటికి సహజమైన షైన్ ని ఇస్తుంది. తరచూ గోర్లకి నైల్ పాలిష్ వేయడం మరియు దానిని తీసివేయడానికి వాడే రిమూవర్స్ వల్ల గోళ్లు పొడిగా మారుతాయి. వీటిని ఆలివ్ నూనెలో నానబెట్టడం వలన తిరిగి పటిష్టంగా మారి షైన్ అవుతాయి.

4) బాడీ స్క్రబ్ లాగా:

4) బాడీ స్క్రబ్ లాగా:

కొన్ని నూనెలను మోయిస్తూరిజింగ్ కోసం స్క్రబ్స్ లా కూడా ఉపయోగించవచ్చు. బాదం నూనె లేదా కొబ్బరి నూనెను ఎప్సోమ్ లవణాలు లేదా వోట్స్ తో పాటు కలిపి వాడటం వలన ఒక అద్భుతమైన మరియు సమర్థవంతమైన బాడీ బ్రష్ లాగా శుభ్రం చేస్తుంది. ఈ చర్మం ని శుభ్రపరచడమే కాకుండా, సమర్థవంతంగా తేమ ని కూడా అందిస్తుంది.

5) హెయిర్ కండీషనర్ లాగా:

5) హెయిర్ కండీషనర్ లాగా:

ఆలివ్ మరియు కాస్టర్ నూనెలు వంటి నూనెలు షాంపూ చేసిన తరువాత జుట్టు పొడిబారకుండా జట్టుకి తగినంత తేమని అందించడం లో ఇదొక గొప్ప మార్గం గా చెప్పవచ్చు. ఒక స్ప్రే సీసాలో సమాన పరిమాణంలో వాటిని కలపండి మరియు జుట్టు మీద స్ప్రే చేయండి. అది జుట్టు అంతటా సరిగా చేరడానికి దువ్వెన ని వాడండి. మీరు కండీషనర్ ని ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.ఎందుకంటే ఇది జుట్టుకి కండీషనర్ గా పనిచేసి షైనీ గా చేసి జుట్టు చిట్లి పోకుండా ఉండటానికి సహాయపడుతుంది.

6) లిప్ గ్లాస్ లాగా:

6) లిప్ గ్లాస్ లాగా:

లావెండర్ నూనె లేదా ద్రాక్ష గింజల నూనె వంటి నూనెలు పెదవులకి ముఖ్యమైన మాయిశ్చరైజర్స్. కానీ ఒక లిప్ స్టిక్ ని అప్లై చేసినప్పుడు, అవి అద్భుతమైన సహజ మరియు పెళుసైన పెదవులమీద ప్రభావం చూపిస్తాయి. అవి కూడా మీ పెదవులను ఎక్కువసేపు మృదువుగా ఉంచడం లో సహాయపడతాయి. అంతేకాక, రసాయనికంగా తయారైన వాటి కంటే సహజ పదార్ధాలను వాడడం ఎల్లప్పుడూ చాలా మంచిది.

English summary

Different Ways To Use Oil In Beauty Routine

Read to know what are uses of using oil for daily beauty routine.
Story first published:Friday, September 8, 2017, 18:24 [IST]
Desktop Bottom Promotion