ఇంటివద్దే శరీర సౌందర్యాన్ని మెరుగుపర్చుకునే విధానం ; స్క్రబ్ మరియు మాస్క్ తయారుచేసుకునే పద్ధతి

By: Deepti
Subscribe to Boldsky

మనం సాధారణంగా మన ముఖాన్ని మాత్రమే ప్యాక్ లు, లోషన్లు, క్రీములు, మాస్క్ లు- ఒక్కటేమిటి ప్రతిదాన్ని ప్రయత్నించి మంచిదేంటా అని వెతుకుతూ, సంరక్షించుకుంటాం. ఈ మొత్తం కథలో మనం మర్చిపోయేదేంటంటే కేవలం మొహమే కాదు, మిగతా శరీరాన్ని కూడా పట్టించుకోవాలని.

శరీరానికి, దాని చర్మ సంరక్షణకి కూడా వివిధ పద్ధతులు, అందంకి సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయి. ముఖానికి, మిగతా శరీర చర్మానికి తీసుకునే సంరక్షణ పద్ధతి రెండూ వేర్వేరు.

సమ్మర్ లో స్కిన్ ట్యాన్(నల్లగా మారిన చర్మాన్ని)తెల్లగా మార్చే గులాబీ, పంచదార బాడీ స్క్రబ్

body polishing at home

ఈ బాడీ పాలిషింగ్ లేదా శరీరానికి మెరుగుపెట్టుకోవడం సెలోన్ లేదా ఇంట్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. దీని లాభాలు ఏంటో కింద చూడండి ;

 • చర్మ స్థితిని మెరుగుపరుస్తుంది
 • మొటిమలు, చర్మపగుళ్ళు, అవాంఛిత రోమాలు వంటి సమస్యలను నయంచేసి చర్మానికి మరింత కాంతిని అందిస్తుంది.
 • చర్మపు పై పొరను తొలగించి చచ్చిపోయిన చర్మకణాలను తీసివేస్తుంది.
 • చర్మంపై తేమ,నీటిశాతం తగ్గకుండా చేస్తుంది
 • చర్మం పైన దుమ్ము,కాలుష్య పదార్థాలు, అదనపు కణాలను తొలగిస్తుంది
 • చర్మకణజాలం, రంధ్రాలకు అడ్డుపడే వాటిని శుభ్రం చేస్తుంది
 • చర్మాన్ని మెత్తగా, హాయిగా మారుస్తుంది
 • చర్మానికి అద్భుత కాంతిని అందిస్తుంది
 • శరీరానికి ఆరోగ్యవంతమైన, కాంతివంతమైన అనుభూతిని అందిస్తుంది

ఇక, ఇప్పుడు మీకు బాడీ పాలిషింగ్ లాభాలు కూడా తెలిసాయి కాబట్టి, ఇక ఇంట్లోనే దాన్ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో శరీర పాలిషింగ్ కి రెండే దశలు- స్క్రబ్బింగ్ అంటే బాగా శుభ్రపరుచుకోవటం మరియు బాడీ మాస్క్ వాడటం.

ఇంటిలో బాడీ పాలిషింగ్ ముందు గోరువెచ్చని నీటితో మొదలవ్వాలి. దాని వల్ల శరీరంపై చర్మ రంధ్రాలన్నీ తెరచుకుని మొదటి పొరపై ఉన్న దుమ్ము, కాలుష్య పదార్థాలు కడిగివేయబడతాయి.

బ్రౌన్ షుగర్ బాడీ స్క్రబ్ తో అమేజింగ్ బెనిఫిట్స్ ..

body polishing at home

మొదటి దశ ; బాడీ స్క్రబ్ వాడకం

ఇవన్నీ మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే, మొదటి పని చర్మాన్ని స్క్రబ్ లేదా రుద్దటం. ఈ చర్మ స్క్రబ్బర్ తయారుచేసుకోవటానికి సరియైన వస్తువులు,దినుసులు ఎంచుకోటం ముఖ్యం. ఎందుకంటే ఇవి మీ చర్మంపై చచ్చిపోయిన పొరను తీసేసి దాని కాంతిని బయటకి తేవాలి.

ఇప్పుడు మనం బాడీ స్క్రబ్ లోని అన్ని వస్తువుల ఒక్కోదాని పాత్రను చూద్దాం.

body polishing at home

సెనగపిండి

ఇది శరీరానికి, ముఖానికి కూడా చాలా మంచి స్క్రబ్ వస్తువు. ఇది మీ చర్మపు మృతపొరలను తీసేస్తుంది. మెడ, కాళ్ళ వంటి తొందరగా నల్లబారే ప్రదేశాలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది.

ఎర్రకందిపప్పు పిండి/ పొడి

మీ శరీరంపై అదనంగా ఉండే జుట్టును తీయడానికి మసూర్ దాల్ లేదా ఎర్రకందిపప్పు హాజరు. ఇది దుమ్ము ధూళికణాలను, చర్మంపై పేరుకున్న అధిక నూనెను కూడా పీల్చుకుంటుంది.

body polishing at home

గంధపు పొడి

అన్నిరకాల చర్మాలకు ఇది పనికొస్తుంది. ఈ గంధపు పొడి నల్లబారిన చర్మం, నల్లటి వలయాలు, మచ్చలు, మొటిమలు అన్నిరకాల చర్మ పగుళ్ళు వంటి అన్నిటికీ పనిచేస్తుంది.

body polishing at home

పసుపు పొడి

పసుపు యాంటి సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ వంటి వైధ్యలాభాలు మాత్రమే కాక చర్మాన్ని మెరిసేలా చేస్తూ, అలర్జీలు,మంట వంటి అన్నిటినీ ఒకవేళ చర్మంపై ఉంటే తొలగిస్తుంది.

body polishing at home

అసలు తేనె లేదా రోజ్ వాటర్

మీ చర్మం రకాన్ని బట్టి మీరు తేనె లేదా రోజ్ వాటర్ ను ఎంచుకోవచ్చు. జిడ్డుచర్మం కలవారు తమ చర్మంపై ఉండే అధిక నూనెపదార్థాలను తొలగించుకోటానికి, మొటిమలకు,చర్మ పగుళ్లకు తేనె వాడటం మంచిది. రోజ్ వాటర్ పొడిచర్మం కలవారికి పనిచేస్తుంది.

body polishing at home

కావాల్సిన వస్తువులు

గంధపు పొడి 1 చెంచా

పసుపు పొడి పావు చెంచా

సెనగపిండి 2 చెంచాలు

కందిపప్పు పొడి 1 చెంచా

అసలు తేనె లేదా రోజ్ వాటర్ ½ కప్పు

1 గాజు పాత్ర

నిర్జీవమైన చర్మానికి కాంతివంతంగా మార్చే కర్భూజ ఫేస్ ప్యాక్

విధానం

 • ఒక గాజు పాత్ర తీసుకుని దాన్ని పొడిగా ఉంచండి.
 • అందులో సెనగపిండి, కందిపిండి, గంధం,పసుపు పొడులను ఒకదాని తర్వాత వేసి పొడిగానే కలపండి.
 • బాగా కలిసాక దీంట్లో తేనె లేదా రోజ్ వాటర్ వేయండి. మరీ ఎక్కువగా వేయద్దు. స్క్రబ్బర్ ఎప్పుడూ మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉండకూడదు.
 • మీ బాడీ స్క్రబ్ తయారయ్యాక, బ్రష్ తీసుకుని మీ శరీరమంతా దాన్ని రాసుకోండి. గుర్తుంచుకోండి, అది మీ శరీరంపై మరీ అట్టకట్టకూడదు అలా అని కారుతూ ఉండకూడదు.
 • మొత్తం చర్మంపై రాసేసాక, 20నిమిషాలు ఆగండి.

ఇరవై నిమిషాల తర్వాత కూడా మీకు ఇంకా ఆరాలనిపిస్తే కొద్దిసేపు ఆగండి. స్క్రబ్ మొత్తం ఎండిపోయాక, చల్లనీరుతో కడగండి.

body polishing at home

రెండవ దశ ; బాడీ మాస్క్ వాడకం

శరీరానికి మాస్క్ తయారుచేయాలంటే సరియైన వస్తువులు సరియైన నిష్పత్తిలో వాడటం తెలియాలి. ఏది ఎక్కువైనా మీ చర్మంపై అతిగా పనిచేస్తుంది లేదా అస్సలు చేయదు. ఈ బాడీ మాస్క్ పొడిని ఇంట్లో తయారుచేసుకుని ఒక పొడి డబ్బాలో 2-3 నెలలపాటు ఉంచుకోవచ్చు. ఇది శరీరం, ముఖం రెండింటికీ రాసుకోవచ్చు.

ఇక బాడీ మాస్క్ తయారుచేసే పద్ధతి, దానిలో వాడే వస్తువుల లాభాలు చదవండి.

body polishing at home

కందిపప్పు

చర్మానికి కందిపప్పు వాడకం ప్రాచీనకాలం నుంచి ఉన్నదే. అందుకే బాడీ స్క్రబ్ లో దాన్ని వాడటం శ్రేయస్కరం. కానీ ప్రతిఒక్కరు అది చర్మానికి వాడేటప్పుడు పేస్ట్ రూపంలోనా, పొడి రూపంలోనా వాడాలి అనే ధ్యాస ఉంచుకోవాలి.

body polishing at home

పెసరపప్పు

పెసరపప్పు శరీరంలో జుట్టు, చర్మంతో సహా అన్ని భాగాలకు పనిచేస్తుంది. పెసరపప్పులో ఉండే విటమిన్ ఎ, సి లు చర్మానికి పోషణ అందించి, దాన్ని మెత్తగా, మృదువుగా చేస్తుంది.

body polishing at home

సెనగపిండి

బాడీ స్క్రబ్ తయారీలో చెప్పినట్లుగా, సెనగపిండి మృతకణాల పొరని తొలగించి, మెడ, కాళ్ళ వంటి కఠిన ప్రదేశాలపై కూడా పనిచేస్తుంది.

body polishing at home

బియ్యంపిండి

మీకు బియ్యంపిండి లేకపోతే బియ్యాన్ని తీసుకుని మిక్సీలో పట్టుకోండి. బియ్యంపిండిలో ఫెరూలిక్ యాసిడ్, అద్భుత సన్ స్క్రీన్ గా పనిచేసే అల్లాన్ టాయిన్ అనే పదార్థాలున్నాయి.

body polishing at home

బాదం

మంచి చర్మానికి రహస్యం బాదం. రోజువారి కొన్ని బాదం పప్పులు తినటమే కాక, మీ చర్మసంరక్షణకి కూడా బాదం వాడవచ్చు.

సారపప్పు

చిరోంజి లేదా సారపప్పు సహజంగా తేమను, కావాల్సిన నూనెపదార్థాలను చర్మానికి అందిస్తాయి.

పసుపు పొడి

ఇది ముఖానికి మేకప్ లేకపోయినా ముఖము, చర్మం మెరిసేలా ఆకర్షణీయంగా చేస్తుంది.

కావాల్సిన వస్తువులు

 • 1/3 కప్పు కందిపప్పు
 • 1/3కప్పు పెసరపప్పు (ఆకుపచ్చని పెసలు మాత్రమే)
 • 1 చెంచా సెనగపిండి
 • 1 చెంచా బియ్యంపిండి
 • 5-8 బాదం
 • ½ చెంచా చిరోంజి
 • పావుచెంచా పసుపు
 • పాలు

విధానం

 • ఒక పొడి మిక్సీ జార్ లో సూచించిన పరిమాణాల్లో కందిపప్పు, పెసరపప్పు,సెనగపిండి, బియ్యంపిండి, బాదం, సారపప్పు అన్నీ వేయండి.
 • గ్రైండ్ చేసి మెత్తని పొడిలా చేయండి.
 • ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో పోసి 2-3 నెలలు దాచుకోండి.
 • మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఒక చెంచాడు పొడిని పొడిగిన్నెలో వేసుకుని, పావుచెంచా పసుపు వేసి పాలతో కలుపుకోండి.
 • పాలను వేయడానికి చెంచాను వాడండి.
 • పాలతో ఆ మిశ్రమాన్ని గట్టిగా వచ్చేంతవరకూ కలపండి.
 • ఈ బాడీ మాస్క్ ను ఎప్పుడూ శరీరంపై పై దిశలో మాత్రమే రాయండి.
 • అరగంట వరకూ ఎండనివ్వండి
 • తర్వాత గోరువెచ్చని నీరుతో కడిగి, ఎప్పుడూ వాడే మాయిశ్చరైజర్ ను రాసుకోండి.
English summary

DIY Body Polishing Method At Home: Scrubber And Mask Recipe

If you are thinking of going for a body polishing treatment, then here is how you can do it at home using simple ingredients.!
Subscribe Newsletter