సన్ టాన్, ఎండకు నల్లగా మారిన చర్మానికి ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకునే ఫేస్ ప్యాక్స్

By: Mallikarjuna
Subscribe to Boldsky

సన్ ట్యాన్ అంటే ఏమి? సన్ ట్యాన్ నివారించే మార్గాలు ఏవి? చాలా మంది ఎండ అంటే ఇష్టపడుతారు కానీ, చర్మానికి కాదు. సెలవులు వస్తే చాలు ఒక రోజూ, రెండు రోజుల విహార యాత్రలు ప్లాన్ చేసుకుంటారు. ఎక్కువగా బీచ్ లను ఇష్టపడుతుంటారు.

బీచ్ అనగానే సూర్యరశ్మి, ఇసుక, మరో ప్రక్క నీళ్లు. ఇలాంటి ప్రదేశాలంటే పిల్లలకు చాలా ఇష్టం. ఇష్టంగా, తమాషా ఆడుకుంటారు. సరే, మరి చర్మ సంగతేంటి? బీచ్ లలో మరియు ఎండ ప్రదేశాల్లో ఎక్కువగా గడపడం వల్ల చర్మం త్వరగా నల్లగా మారుతుంది.

ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల, యూవి కిరణాలు నేరుగా చర్మం మీద పడటం వల్ల చర్మ కణాలు డ్యామేజ్ అవుతాయి. చర్మం యొక్క ఆర్ఎన్ఎ మరియు డిఎన్ఎలు దెబ్బతినడం వల్ల చర్మ క్యాన్సర్ కు దారితీస్తుంది.

సన్ టాన్, ఎండకు నల్లగా మారిన చర్మానికి

ఈ సమస్యను తగ్గించుకోవాలంటే చర్మానికి ఎక్కువగా యూవీకిరణాలు తగలకుండా చూసుకోవాలి. చర్మం నల్లగా మారకుండా ఉండటానికి మెలనిన్ తగ్గకుండా చూసుకోవాలి. వీటితో పాటు స్కిన్ టాన్ ను న్యాచురల్ గా తగ్గించే కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి.

సమ్మర్ సన్ టాన్ నివారించే బట్టర్ మిల్క్ ఫేస్ ప్యాక్

చర్మం ట్యాన్ కు గురైనప్పుడు చర్మ నల్లగా, డ్రైగా, మరియు పొడిగా మారుతుంది. స్కిన్ ట్యాన్ నివారించుకోవడం కోసం బ్యూటీ స్టోర్స్ అనేక క్రీములు, రసాయనిక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. స్కిన్ ట్యాన్ ఇన్ స్టాంట్ గా తొలగించే వీటి వల్ల ఊహించినంత ఫతం పొందకపోవచ్చు. అయితే స్కిన్ ట్యాన్ నివారించుకోవడానికి కొన్ని న్యాచురల్ రెమెడీస్ కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

నిమ్మరసం మరియు తేనె:

నిమ్మరసం మరియు తేనె:

లెమన్ మరియు తేనె: స్కిన్ టాన్ తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. నిమ్మరసం టాన్ నివారిస్తే, తేనె మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది.

కావల్సినవి:

తేనె: 2 టేబుల్ స్పూన్లు

నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు

పద్ధతి:

పై రెండు పదార్థాలను తీసుకుని మిక్స్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి.

20 నిముషాలు అలాగే ఉంచి తర్వాత సోపుత శుభ్రం చేసుకోవాలి.

ఈ చిట్కాను రోజూ ఉపయోగిస్తుంటే సన్ టాన్ తొలగించుకోవడానికి మంచి ఫలితం ఉంటుంది.

స్కిన్ టాన్ తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. నిమ్మరసం టాన్ నివారిస్తే, తేనె మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది.

గదం మరియు పసుపు:

గదం మరియు పసుపు:

ఈ రెండు పదార్థాలు తక్షణం చర్మంను స్మూత్ గా మార్చుతాయి మరియు చర్మంను లైట్ గా మార్చుతాయి.

కావల్సినవి:

గందం పొడి : ఒక టేబుల్ స్పూన్

పసుపు : ఒక టేబుల్ స్పూన్

పద్ధతి:

పైన సూచించిన పదార్థాలను మిక్స్ చేసి , దీనికి కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి.

ఈపేస్ట్ ను ముఖానికి అప్లై చేసి, అరగంట అలాగే ఉండాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

టమోటో జ్యూస్, పెరుగు ప్యాక్

టమోటో జ్యూస్, పెరుగు ప్యాక్

సిట్రస్ పండ్లలో హై యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన ఆక్సార్బిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సన్ ట్యాన్ నివారిస్తుంది పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ ట్యాన్ తొలగిస్తుంది.

కావల్సినవి:

టమోటో జ్యూస్: రెండు టేబుల్ స్సూన్లు

పెరుగు : రెండు టేబుల్ స్పూన్లు

పద్ధతి:

పైన సూచించిన రెండు పదార్థాలను మిక్స్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. అరగంట సేపు అలాగే వదిలేసి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

నల్లబడుతున్నచర్మంను కాంతివంతంగా మార్చే హోం రెమెడీస్

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్ చాలా రుచికరంగా ఉంటుంది. ఎంత రుచిగా ఉంటుందో అంత కంటే ఎఫెక్టివ్ గా సన్ టాన్ నివారిస్తుందని నిపునులు సూచిస్తున్నారు. దీన్ని చర్మానికి అప్లై చేస్తే ఒక పెద్ద మ్యాజిక్ జరుగుతుంది. ఇందులో న్యాచురల్ ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఇది సన్ టాన్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కావల్సినవి:

ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్

పద్ధతి:

చర్మ నల్లగా మారిన ప్రదేంలో ఆరెంజ్ జ్యూస్ ను నేరుగా అప్లై చేసి, మసాజ్ చేసి, పూర్తిగా చర్మంలోకి ఇంకిన తర్వాత, మరో 10 నిముషల తర్వాత తిరిగి అప్లై చేయాలి.

పాల పొడి, తేనె మరియు బాదం నూనెతో ట్రీట్మెంట్ :

పాల పొడి, తేనె మరియు బాదం నూనెతో ట్రీట్మెంట్ :

ఈ పదార్థాలన్నీ చర్మానికి గొప్పగా పనిచేస్తాయి. ఎఫెక్టివ్ గా సన్ టాన్ నివారిస్తాయి.

కావల్సినవి:

మిల్క్ పౌడర్ : 1టేబుల్ స్పూన్

నిమ్మరసం కొద్దిగా

బాదం ఆయిల్ ఒక టీస్పూన్

తేనె ఒక టీస్పూన్

పద్దతి:

పైన సూచించిన పదార్థాలన్ని మిక్స్ చేసి, ట్యాన్ కు గురైన ప్రదేశంలో అప్లై చేయాలి. 20 నిముసాల తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం బ్రైట్ గా మారుతుంది. సరైన సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల చర్మానికి రక్షణ కల్పించబడుతుంది. ఎప్పుడూ చర్మానికి సన్ స్క్రీన్ అప్లై చేయాలి. బయటకు వెల్లడానికి 20 నిముషాల ముందు సన్ స్క్రీన్ అప్లై చేయడం మంచిది.

ప్రకాశవంతమైన చర్మంను చూడటానికి ఎప్పుడూ అందంగా ఉంటుంది. కాబట్టి, పైన సూచించిన రెమెడీస్ ను మర్చిపోకుండా ఫాలో అవుతుండండి.

English summary

DIY Tips To Remove Sun Tan Instantly in Telugu

These remedies to get rid of sun tan can work wonders on the state of your skin.
Subscribe Newsletter