యాక్నే ప్రోన్ స్కిన్ కలిగిన వారు చర్మ సంరక్షణకై చేయదగిన చేయకూడని 8 పనులు

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

యాక్నే ప్రోన్ (మొటిమల పీడిత) చర్మాన్ని హ్యాండిల్ చేయడం కాస్త సమస్యాత్మకమే. ముక్కుపైనున్న మొటిమ కాస్త తగ్గుముఖం పట్టగానే చెంపపై మరో మొటిమ వస్తున్నట్టు తెలియగానే వచ్చే కంగారుకు అంతే ఉండదు. ఈ మొటిమల సిరీస్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందా అనే ప్రశ్న వారిని వేధిస్తూనే ఉంటుంది. ఫేస్ వాషెస్, క్లీన్సర్లు, అలాగే క్రీంస్, టోనర్స్ తో పాటు ఎన్నో ప్రోడక్ట్స్ ను వాడినా ఫలితం మాత్రం అంత ఆశాజనకంగా ఉండకపోవడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇంతలో, అమ్మ, ఆంటీ, చెల్లెల్లు, నాన్నమ్మలు మొటిమల నివారణకు ఎన్నో రకాల చిట్కాలను విడమరచి చెప్పి వాటిని వెంటనే పాటించమని కంగారు పెడుతూ ఉంటారు. అవన్నీ పాటించినా, చివరకు ఈ మొటిమల సిరీస్ కాస్తైనా తగ్గుముఖం పెట్టినట్టు కనిపించదు.

dos and don'ts for acne

అందువల్ల, యాక్నే ప్రోన్ స్కిన్ కి కేవలం క్రీంస్ తో అలాగే మాస్క్స్ మరియు పాక్స్ తో పరిష్కారం లభించదు. చర్మాన్ని సంరక్షించుకోవడం ద్వారా యాక్నే ప్రోన్ స్కిన్ ను చక్కగా హ్యాండిల్ చేయవచ్చు. ప్రతిరోజు చక్కటి స్కిన్ కేర్ ప్లాన్ తో మీ చర్మాన్ని మీరు సంరక్షించుకుని సహజమైన కాంతిని పెంపొందించుకోవచ్చు. మీ చర్మం యొక్క ప్రతి అవసరాన్ని మీరు గుర్తించి అందుకు తగిన పరిష్కారం చూపిస్తే చర్మంపై కలిగే నిగారింపుని చూసి మీరే ఆశ్చర్యపోతారు. యాక్నే ప్రోన్ స్కిన్ కలిగిన వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చర్మానికి వారు చేయదగినవి చేయకూడనివి తెలుసుకుంటే చక్కటి చర్మ పోషణ లభిస్తుంది.

యాక్నే ప్రోన్ స్కిన్ సంరక్షణకై చేయదగినవి

యాక్నే ప్రోన్ స్కిన్ సంరక్షణకై చేయదగినవి

మనలో చాలా మందికి తెలియని విషయమేంటంటే, మనం శిరోజాల సంరక్షణకు వాడే కొన్ని ప్రొడక్స్ మన చర్మంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఈ విషయం తెలియక శిరోజాల కోసం రకరకాల ప్రోడక్ట్స్ వాడి చర్మాన్ని ఇబ్బందికి గురిచేస్తున్నారు. కాబట్టి మీరేదయినా హెయిర్ ప్రోడక్ట్స్ వాడుతున్నప్పుడు వాటిని ముఖంపై పడకుండా జాగ్రత్త వహించండి. మీ తలని వెనక్కి వంచి హెయిర్ ప్రోడక్ట్స్ ని వాడుకోండి. ఎందుకంటే హెయిర్ ప్రోడక్ట్స్ లో ఉండే పదార్థాలు చర్మంపై నుండే రంధ్రాలను బ్లాక్ చేసి తద్వారా మొటిమలకు దారితీస్తాయి.

క్లీన్సెర్ ని తెలివిగా ఎంచుకోండి

క్లీన్సెర్ ని తెలివిగా ఎంచుకోండి

యాక్నే ప్రొన్ స్కిన్ కలిగిన వారు తెలివైన క్లీన్సర్ ని ఎంచుకోవాలి. ఎందుకంటే, చర్మానికి తగిన తేమని క్లీన్సర్ అందిస్తుంది. క్లీన్సర్లని ఎంచుకునే ముందు సలిసైలిక్ యాసిడ్ లేదా బెంజోయిల్ పెరాక్సైడ్ కలిగిన వాటిని లేదా ఈ రెండూ కలిగిన వాటిని ఎంచుకోండి. యాక్నే ప్రొన్ స్కిన్ కి క్లీన్సర్లు ఫోమ్ లేదా జెల్ రూపంలో ఉంటాయి. అయినప్పటికీ, మోతాదుకు మించి క్లీన్సర్లను వాడటం మంచిది కాదు. ప్రతి రోజు రెండు లేదా మూడు సార్లు క్లీన్సింగ్ అవసరం.

నిద్రవేళ చర్మసంరక్షణ ప్రణాళికను సిద్ధం చేసుకోండి

నిద్రవేళ చర్మసంరక్షణ ప్రణాళికను సిద్ధం చేసుకోండి

యాక్నే ప్రొన్ స్కిన్ కి తగిన చర్మ సంరక్షణని మీరు నిద్రవేళ ఇవ్వడం అవసరం. అందువల్ల, చర్మానికి రాత్రంతా పోషణ లభించి ఉదయానికల్లా తాజాగా కనిపిస్తుంది. బెడ్ టైం స్కిన్ కేర్ రొటీన్ వల్ల మొటిమల సమస్య చాలా వరకు తగ్గుతుంది. క్లీన్సింగ్, టోనింగ్ మరియు మాయిశ్చరైజర్ లని బెడ్ టైం స్కిన్ కేర్ రొటీన్ లో చేర్చండి.

సంస్క్రీన్ ని మరవకండి

సంస్క్రీన్ ని మరవకండి

సూర్యరశ్మికి ఎక్కువగా గురైతే ట్యాన్ ప్రబలెన్స్ తో పాటు చర్మ సమస్యలు వేధిస్తాయని డెర్మటాలజిస్ట్స్ తెలుపుతున్నారు. అందువల్ల, సూర్యరశ్మికి ఎక్కువగా గురవకుండా ఉండేలా జాగ్రత్తపడుతూ అదే సమయంలో చక్కటి సంస్క్రీన్ ని వాడాలి. మీరు వాడే సంస్క్రీన్ లో యూవీబీ అలాగే యూవీఏ ప్రొటెక్షన్ ఉండాలి. పగటివేళ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సంస్క్రీన్ ని తప్పక అప్లై చేసుకోవాలి.

మినరల్ మేకప్ ను ఎంచుకోండి

మినరల్ మేకప్ ను ఎంచుకోండి

యాక్నే ప్రోన్ స్కిన్ పై మేకప్ వేసుకునేందుకు చాలా జాగ్రత్త వహించాలి. మీరు కేవలం ఆయిల్ ఫ్రీ బ్యూటీ ప్రోడక్ట్స్ నే వాడాలి. ఇంకా చెప్పాలంటే, మీరు మినరల్ మేకప్ ప్రొడక్ట్స్ ని వాడటం మంచిది. అందువల్ల మీ చర్మాన్ని మీరు అనవసర ప్రయాసనుండి తప్పించినవారవుతారు. అంతే కాదు, మేకప్ చేసుకునే ఫ్రీక్వెన్సీని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి.

యాక్నే ప్రోన్ స్కిన్ పై చేయకూడనివి చర్మాన్ని విసిగించవద్దు:

యాక్నే ప్రోన్ స్కిన్ పై చేయకూడనివి చర్మాన్ని విసిగించవద్దు:

ముఖంపై మొటిమలు కనపడితే చాలు వాటిని చిదిమేసేస్తే సమస్య పరిష్కారమవుతుందని చాలా మంది భావిస్తారు. కాని, తద్వారా సమస్యను జఠిలం చేసుకున్నవారవుతారని వారు గ్రహించరు. ఇది అలవాటైపోయి తెలియకుండానే మొటిమలను డిస్టర్బ్ చేస్తారు. ఇలా చేయడం మంచిది కాదు. స్కిన్ కేర్ రొటీన్ ని జాగ్రత్తగా పాటించండి. ప్రతి సారి మీరు మీముఖాన్ని తాకగానే మీ చేతులపై నున్న క్రిములు చర్మంపైకి చేరతాయి. తద్వారా మీ ముఖంపై నున్న చర్మం ఇన్ఫెక్షన్ కి గురవుతుంది. అందువల్ల, మీరు తరచూ మీ ముఖాన్ని తాకే అలవాటును దూరంగా ఉంచండి.

స్కిన్ స్క్రబ్బింగ్ ని దూరంగా ఉంచండి:

స్కిన్ స్క్రబ్బింగ్ ని దూరంగా ఉంచండి:

యాక్నే ప్రొన్ స్కిన్ కలిగిన వారు స్క్రీన్ స్క్రబ్బింగ్ కు దూరంగా ఉండడం మంచిది. స్క్రబ్బింగ్ లేదా తీవ్రమైన మర్దన వలన చర్మం ఒత్తిడికి గురై పగుళ్ళకు దారితీయవచ్చు. తద్వారా బ్లీడింగ్ తో పాటు సెప్టిక్ కూడా జరగవచ్చు. అందువల్ల, డెర్మటాలజిస్ట్ చెప్పే వరకు ఎక్సఫోలియేషన్ అనేది యాక్నే ప్రొన్ స్కిన్ కేర్ రొటీన్ లో భాగం కాకూడదు.

ముఖాన్ని ఓవర్ వాష్ చేయకండి:

ముఖాన్ని ఓవర్ వాష్ చేయకండి:

మీకు యాక్నే ఉన్నట్టయితే మీది ఆయిలీ స్కిన్ అని అర్థం. స్త్రీలైనా పురుషులైనా ఆయిలీ స్కిన్ కలిగిన వారు తరచూ ముఖాన్ని కడుగుతూ అదనపు ఆయిల్ ని తొలగించుకోవాలని ప్రయత్నిస్తారు. అయితే, ఓవర్ వాష్ చేయడం వలన చర్మంలో సహజంగా నున్న ముఖ్యమైన నూనెలు తొలగిపోయి చర్మం గరుకుగా మారుతుంది. గరుకుగా మారిన చర్మం మరిన్ని సమస్యలను కొనితెచ్చుకుంటుంది. కాబట్టి కేవలం రెండు నుంచి మూడు సార్లు ముఖాన్ని కడిగితే చాలు.

English summary

Dos And Don'ts For Acne | Skincare For Acne | Skincare For Acne-prone Skin

If your skin is prone to acne, then soap and water are not sufficient to take care of it. For acne-prone skin, there exists some particular dos and don'ts which help the skin improve and move towards clear skin. Look at the listed dos and don'ts for acne-prone skin and you will experience a difference.
Story first published: Wednesday, November 29, 2017, 11:10 [IST]
Subscribe Newsletter