యవ్వనంగా కనబడాలంటే చాక్లెట్ ఫేస్ మాస్క్ ట్రై చేయండి

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

చర్మసౌందర్యాన్ని సంరక్షించే అద్భుతమైన లక్షణం చాక్లెట్ అనే లక్జరియస్ స్కిన్ కేర్ ఇంగ్రీడియెంట్ సొంతం. ఫ్లెవనాల్స్ తో పాటు ఫ్రీ రాడికల్స్ ని ఎదుర్కొనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాక్లెట్ లో పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల, చర్మం దెబ్బతినకుండా చర్మాన్ని సంరక్షించే సామర్థ్యం చాక్లెట్ కు కలదు.

ఫ్రీ రాడికల్స్ అనేవి చర్మానికి అత్యంత హానికరం. చర్మంలోని కొలాజెన్ స్థాయిలను విచ్ఛిన్నం చేసి తద్వారా చర్మంపై ఏజింగ్ సైన్స్ కు దారితీస్తాయి.

effective diy chocolate face mask

ఇక్కడే, చాక్లెట్ యొక్క అవసరం ఏర్పడుతుంది. చర్మానికి హానీ కలిగించే ఫ్రీ రాడికల్స్ ని ఎదుర్కొని చర్మాన్ని సంరక్షించే గుణం చాక్లెట్ లో కలదు.

యవ్వనవంతమైన చర్మాన్ని పొందటం కోసం మీరు ఈ ప్రత్యేకమైన పదార్థాన్ని అనేకరకాలుగా వాడుకోవచ్చు. ఈరోజు, బోల్డ్ స్కైలో, ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే వివిధ రకాల చాక్లెట్ ఫేస్ మాస్క్ ల గురించి వివరించాము.

ఈ అద్భుతమైన DIY మాస్క్స్ ద్వారా ప్రీమెచ్యూర్ ఏజింగ్ సైన్స్ ను నిర్మూలించవచ్చు. తద్వారా, కాంతివంతమైన యూత్ ఫుల్ గ్లో తో మెరిసిపోవచ్చు. ఈ మాస్క్స్ ని ప్రయత్నించి అద్భుతమైన ఫలితాలను పొందండి.

ఈ ఫేస్ మాస్క్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి:

గమనిక: ఈ మాస్క్స్ ను ప్రయత్నించే ముందు మీ చర్మంపై ప్యాచ్ టెస్ట్ ను నిర్వహించడం తప్పనిసరి.

1. చాక్లెట్ + ఎగ్ వైట్

1. చాక్లెట్ + ఎగ్ వైట్

ఒక బౌల్ లో రెండు టీస్పూన్ల చాక్లెట్ ద్రవాన్ని తీసుకోండి. చాక్లెట్ ని మెల్ట్ చేస్తే చాక్లెట్ ద్రవం తయారవుతుంది. అందులో, ఒక ఎగ్ వైట్ ను జోడించండి.

ఈ రెండు పథార్థాలను బాగా కలిపి ముఖంపై బాగా అప్లై చేసుకోండి.

దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ మాస్క్ ని మీ ముఖంపై ఉంచుకోండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

ఈ మాస్క్ ని వారానికి ఒకసారి అప్లై చేయడం ద్వారా చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.

2. చాక్లెట్ + ఆలివ్ ఆయిల్

2. చాక్లెట్ + ఆలివ్ ఆయిల్

ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను ఒక టీస్పూన్ చాక్లెట్ ద్రవంతో బాగా కలపండి.

ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ లా అప్లై చేసి పది నిమిషాల వరకు అలాగే ఉంచండి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

ఈ చాక్లెట్ మాస్క్ ని నెలలో రెండుసార్లు వాడటం ద్వారా చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి విముక్తి పొందవచ్చు.

3. చాక్లెట్ + రోజ్ వాటర్

3. చాక్లెట్ + రోజ్ వాటర్

కేవలం ఒక టీస్పూన్ చాక్లెట్ ద్రవానికి ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ని జతచేయండి.

ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సున్నితంగా అప్లై చేయండి. ఈ ఫేస్ మాస్క్ ని పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచండి.

ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

ఈ మాస్క్ ని ప్రతి వారం అప్లై చేసుకోవడం ద్వారా యవ్వనవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోండి.

4. చాక్లెట్ + ఆల్మండ్ ఆయిల్

4. చాక్లెట్ + ఆల్మండ్ ఆయిల్

మూడు టీస్పూన్ల ఆల్మండ్ ఆయిల్ ని ఒక టీస్పూన్ చాక్లెట్ ద్రవంతో బాగా కలపండి.

ఈ మిశ్రమాన్ని మాస్క్ లా మీ ముఖంపై అప్లై చేయండి.

మీ చర్మంపై ఈ మాస్క్ ని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచండి. ఆ తరువాత తేలికపాటి క్లీన్సెర్ మరియు గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

నెలలో రెండుసార్లు ఈ మాస్క్ తో మీ చర్మాన్ని గారాబం చేయడంతో చర్మంపైనున్న ముడతలు అలాగే ఫైన్ లైన్స్ కనుమరుగవుతాయి.

5. చాక్లెట్ + బనానా

5. చాక్లెట్ + బనానా

బాగా పండిన అరటిపండుని గుజ్జులా చేసుకుని అందులో రెండు టీస్పూన్ల చాక్లెట్ ద్రవాన్ని కలపండి.

ఇలా తయారయిన మిశ్రమాన్ని మీ ముఖంపై పలుచని పొరలా అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉంచండి.

ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో పాటు తేలికపాటి క్లీన్సర్ తో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

ఈ పద్ధతిని రెండువారాలు ఒకసారి పాటించడం ద్వారా కోమలమైన, కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

6. చాక్లెట్ మిల్క్ + రోజ్ ఎస్సెన్షియల్ ఆయిల్

6. చాక్లెట్ మిల్క్ + రోజ్ ఎస్సెన్షియల్ ఆయిల్

ఒక గ్లాస్ బవుల్ ని తీసుకుని అందులో చాక్లెట్ ద్రవాన్ని పోసి దానికి రెండు నుంచి మూడు టీస్పూన్ల పచ్చి పాలను అలాగే మూడు చుక్కల రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ ను కలపండి.

ఈ పదార్థాలని బాగా కలిపండి. ఇలా తయారైన మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ లా అప్లై చేసుకోండి.

ఈ మిశ్రమాన్ని కనీసం పది నిమిషాల పాటు మీ చర్మంపై ఉండనివ్వండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

నెలకోసారి ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేయడం ద్వారా మొటిమల వంటి చర్మ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

7. చాక్లెట్ + తేనె

7. చాక్లెట్ + తేనె

ఒక టీస్పూన్ చాక్లెట్ ను రెండు టీస్పూన్ల తేనెతో బాగా కలపండి.

ఇలా తయారైన మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచండి.

ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

ఈ చాక్లెట్ మాస్క్ ని అప్లై చేయడం ద్వారా చర్మానికి తగినంత తేమ అందుతుంది.

8. చాక్లెట్ + విటమిన్ ఐ ఆయిల్

8. చాక్లెట్ + విటమిన్ ఐ ఆయిల్

విటమిన్ ఈ క్యాప్సూల్ నుంచి ఆయిల్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇప్పుడు, ఇందులో ఒక టీస్పూన్ చాక్లెట్ ద్రవాన్ని కలపండి.

ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోండి.

ఈ ఫేస్ ప్యాక్ ని పదినిమిషాల వరకు కడపవద్దు. పదినిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

ఈ అద్భుతమైన ఫేస్ మాస్క్ ని వాడి మొటిమలు, మచ్చల వంటి సమస్యలకు చెక్ పెట్టి యవ్వనవంతమైన చర్మాన్ని సులభంగా పొందండి.

English summary

Easy And Effective DIY Chocolate Face Masks For Youthful Skin

Chocolate is a luxurious skin care ingredient that can transform the state of your skin. It is known to be replete with flavonols, powerful antioxidants that can combat free radicals and prevent them from causing damage to your skin. Chocolate when mixed with other ingredients helps you to attain youthful skin