మొటిమలు, మచ్చలు(జిట్ స్కార్స్)తొలగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

చర్మంలో ఉండే హెయిర్ ఫాలీ సెల్స్ ఆయిల్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ , యాక్నేతో నిండిపోతే, చర్మం అసహ్యంగా కనబడుతుంది. యాక్నే(మొటిమల)ను గిల్లడం వల్ల ఏర్పడే మచ్చలను పోగొట్టుకోవడం చాలా కష్టం అవుతుంది.

మొటిమలతో ఏర్పడిన మచ్చల లేదా జిట్ స్కార్స్ ను తొలగించుకోవడానికి కొద్దిగా ఓపిక మరియు శ్రమ, సమయం కేటాయించాలి. ఇలా మొటిలను గిల్లడం వల్ల ఏర్పడిన మెండి మచ్చలను తొలగించుకునే క్రమంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఇవి పర్మనెంటెగా అలాగే ఉండిపోతాయి.

ఈ జిట్ స్కార్స్ ను తొలగించుకోవడం కొద్దిగా కష్టమైన, వీటిని పూర్తిగా తొలగించలేమని చెప్పలేం. కాబట్టి, కొన్ని ప్రయత్నాలను మరియు నేచురల్ పదార్థాలను ఉపయోగించడం వల్ల వీటిని నేచురల్ గా తగ్గించుకోవచ్చు. మరి ఆ నేచురల్ పదార్థాలేంటో ఒక సారి తెలుసుకుందాం..

1. నిమ్మరసం మరియు బేకింగ్ సోడా మాస్క్ :

1. నిమ్మరసం మరియు బేకింగ్ సోడా మాస్క్ :

నిమ్మరసం బేకింగ్ సోడా మొండిగా మారిన మచ్చలను తొలగిస్తుంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మొటిమలు, మచ్చల మీద అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

2. కొబ్బరి నూనె:

2. కొబ్బరి నూనె:

యాక్నే సమస్యను తగ్గించుకోవడానికి టాప్ లిస్ట్ లో ఉన్నది కొబ్బరి నూనె. ఇది మొటిమల తాలూకు మచ్చలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల మొటిమలతో పాటు, మొండిగా మారిన మచ్చలను కూడా నివారిస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని, ముఖానికి అప్లై చేసి ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేయాలి. ఈ నూనె చర్మంలోకి పూర్తిగా అబ్సార్బ్ అయ్యే వరకూ ఉండనివ్వాలి. ఇందులో ఉండే విటమిన్, ఫ్యాటీ యాసిడ్స్ జిట్ స్కార్స్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

3. అలోవెర జెల్:

3. అలోవెర జెల్:

అలెవెర జెల్ మరో కామన్ హోం రెమెడీ. మొటిలను మచ్చలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలోవెర జెల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది మొటిమలను, మచ్చలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. స్కిన్ ఇరిటేషన్ ను నివారిస్తుంది.అలోవెర జెల్ తీసుకుని మొటిమలు, మచ్చల మీద అప్లై చేసి ముఖం శుభ్రం చేసుకోవాలి.

4. బంగాళదుంప జ్యూస్

4. బంగాళదుంప జ్యూస్

జిట్ స్కార్స్ నివారించుకోవడం కోసం బంగాళదుంపను ఉపయోగించడం మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇందులో ఉండే విటమిన్స్, మినిరల్స్ చర్మంలోని మచ్చలను మాయం చేయడానికి సహాయపడుతుంది. మచ్చలను సులభంగా తొలగిస్తుంది. ఒక పొటాటో తీసుకుని , సన్నని స్లైస్ గా కట్ చేసుకోవాలి. పొటాటో స్లైస్ ను రబ్ చేసి, కొద్ది సేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. మెంతీ సీడ్స్ రెమెడీ

5. మెంతీ సీడ్స్ రెమెడీ

యాక్నే నివారించడంలో మెంతులు గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి జిట్ స్కార్స్ సులభంగా తొలగిస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వివిధ రకాల చర్మ సమస్యలను నివారిస్తాయి. కొన్ని మెంతులను తీసుకుని రాత్రుల్లో వాటిని నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేయాలి. పేస్ట్ చేసి, ఈ పేస్ట్ ను మొండిగా మారిన మచ్చలు, మొటిమల మీద అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

6. గ్లిజరిన్

6. గ్లిజరిన్

చాలా మందికి గ్లిజరిన్ లో పవర్ ఫుల్ బెనిఫిట్స్ గురించి తెలియదు. జిట్ స్కార్స్ ను తొలగించడంతో పాటు, ఇతర చర్మ సమస్యలను నివారించడంలో గ్లిజరిన్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది జిట్ స్కార్స్ తొలగించడం మాత్రమే కాదు, ఇది గ్లోయింగ్ స్కిన్ ను ప్రమోట్ చేస్తుంది.

ఒక స్పూన్ గ్లిజరిన్ తీసుకుని, అందులో నిమ్మ రసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసాన్ని, గ్లిజరిన్ రెండూ మిక్స్ చేసి చర్మానికి ఉపయోగించడం వల్ల స్కిన్ లో గ్లో పెరుగుతుంది. ఈ హోం రెమెడీని వారంలో రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

7. కీరదోసకాయ

7. కీరదోసకాయ

కీరోదసకాయలో ఉండే కూలింగ్ లక్షణాలు హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. చర్మాన్ని కూల్ గా మార్చడం మాత్రమే కాదు, కీరదోసకాయలో చర్మాన్ని ప్రశాంత పరుస్తుంది. జిట్ స్కార్స్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

ఒక కీరదోసకాయ తీసుకుని, ముక్కలుగా కట్ చేసి, పేస్ట్ చేయాలి. అందులో చిటికెడు పసుపు మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

8. శెనగపిండి మరియు పెరుగు

8. శెనగపిండి మరియు పెరుగు

రెండు స్పూన్ల శెనగపిండి తీసుకుని, అందులో పెరుగు చేర్చాలి. ఈ రెండు పాదార్థాలను మిక్స్ చేసి, మచ్చలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఒక గంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుబ్రం చేసుకోవాలి.

ఈ హోం రెమెడీని ఉపయోగించడం వల్ల జిట్ స్కార్స్ తొలగిపోతాయి, ఇందులో ఉండే యాక్టివ్ ఎంజైమ్స్ అందుకు గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిలో ఉండే స్కిన్ బ్లీచింగ్ లక్షణాలు చర్మంను హెల్తీగా మరియు కాంతివంతంగా మార్చడానికి సహాయపడుతుంది.

English summary

Easy Home Remedies That Can Help To Heal Zit Scars

Getting rid of the zit scars may be difficult and tricky, but it is surely not impossible. So, here we mention to you some of the top natural ingredients that can help to heal the zit scars on face easily.
Subscribe Newsletter