For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎగ్జిమా( తమార,గజ్జి) చర్మ వ్యాధులను నివారించే న్యాచురల్ రెమెడీస్

By Mallikarjuna
|

ఎక్జిమా దీన్ని వైద్యపరిభాషలో తమార,గజ్జి అనికూడా పనిలుస్తురు. వైద్య పరంగా చర్మానికి వచ్చే ఒక వ్యాధి, స్కిన్ ఎర్రగా కమిలిపోవడం, దురదపుట్టడం, చీకాకు, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు ఉంటాయి. దీన్ని డెర్మటైటిస్ అని పిలుస్తారు . ముఖ్యంగా 5ఏళ్ళ లోపు పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది.

పిల్లల్లో ఎక్జిమా లక్షణాలు ముఖంలో ఎక్జిమా రాషెస్ కనబడుతుంటాయి . అది అలాగే మెల్లిగా చేతులకు, కాళ్ళకు మరియు పాదాలకు పాకుతుంది , పెద్దవారిలో మోకాళ్ళు మరియు మోచేతుల వద్ద ఈ లక్షణాలు కనబడుతాయి.

eczema treatment with natural remedies

ఎగ్జిమా నివారణకు 6 ఆయుర్వేదిక్ రెమెడీస్ఎగ్జిమా నివారణకు 6 ఆయుర్వేదిక్ రెమెడీస్

ఎగ్జిమాకు కారణాలు: జన్యుసంబంధమైనవి, ఆస్త్మా ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇతరుల్లో విటమిన్ బి6లోపించినప్పుడు, బడ్ల సర్క్యులేషన్ సరిగా లేప్పుడు ఎక్జిమా లక్షణాలు కనబడుతాయి .వాతావరణలో పరిస్థితుల కారణంగా, వాతావరణంలో ఎక్కువ వేడి, తరచూ ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఒత్తిడి మొదలగునవి ఎక్జిమాకు దారితీస్తుంది.

లక్షణాలు:

దురద కలిగి చిన్న చిన్న పోక్కులతో ఎర్రగా ఉంటాయి. తల మీద అయితే దురద ఉండి, పొట్టు రేగుతు వెంట్రుకలు రాలిపోతాయి. భార్య భర్తల్లో ఒకరికి ఉంటె మరొకరికి వచ్చే అవకాసం ఉంది..

ఎగ్జిమా నివారించడానికి కొన్ని హోం మేడ్ న్యాచురల్ టిప్స్ ఉన్నాయి. అవేంటంటే..

స్నానం

స్నానం

ఎగ్జిమా నివారించుకోవడానికి స్నానం ఒకటి చేస్తే సరిపోదు. రొటీన్ గా చేసే స్నానం చేసే పద్దతిని మార్చాలి. :

గోరువెచ్చని నీటిలో ఒక కప్పు మినిరల్ ఆయిల్ ను వేసి స్నానం చేయాలి. అలాగే ఓట్ మీల్ మిక్స్ చేసి కూడా స్ాననం చేయొచ్చు.

పాలు, ఆలివ్ ఆయిల్ సమంగా కలిపి వేడినీళ్ళలో కలిపి స్నానం చేస్తే ఎగ్జిగా నయం అవుతుంది.

పసుపు

పసుపు

పసుపులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి కాబట్టి, ఎగ్జిమాను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. కాబట్టి ఒక టేబుల్ స్పూన్ల పసుపులో 3 చెంచాలా రోజ్ వాటర్ మిక్స్ చేసి చర్మానికి పూర్తిగా అప్లై చేయాలి. ఇలా చేస్తుంటే ఎగ్జిమా నివారిస్తుంది.

అలోవెర:

అలోవెర:

కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు నయం చేసే గుణాలు మెండుగా ఉన్నాయి . చర్మ సమస్యలకు నివారణకు పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు . కలబందఆకులో రసం ద్రవంలా ఉంటుంది, ఆలోవెర లీప్ కట్ చేసి అందులో నుండి జెల్ ను స్పూన్ తో తీసుకోవాలి. ఇది కాలిన గాయాలను, పుండ్లు, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉపయోగించడం ఎలా: కలబంద ఆకును కట్ చేసి, అందులోని కలర్ లెస్ జెల్ ను తీసుకోవాలి. ఈ జెలన్ ను చర్మ సమస్యలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ముఖ్యంగా స్కిన్ ఇరిటేషన్ మరియు ఇన్ఫ్లమేషన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.

నూనెలు:

నూనెలు:

ఎగ్జిమా సమస్యలను నివారించడంలో కొబ్బరినూనె, జోజోబ ఆయిల్ ను గోరువెచ్చని నీళ్ళలో వేసి స్నానం చేయాలి. ఈ నూనెతో మసాజ్ చేయకూడదు. నూనెను జస్ట్ అప్లై చేసి స్నానం చేయాలి. .

గ్లిజరిన్:

గ్లిజరిన్:

ట్రెడిషనిల్ రెమెడీ. గ్లిజరిన్ ఎగ్జిమా నివారిస్తుంది. గ్లిజరిన్ ను నీటిలో మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలిజ తర్వాత 5నిముషాల తర్వాతస్నానం చేయాలి. . ఈ చిట్కాలు రెగ్యులర్ గా అనుసరిస్తే తప్పకుండా ఎగ్జిమా నివారించుకోవచ్చు.

English summary

Eczema Treatment With Natural Remedies | Treat Eczema At Home | Natural Remedies For Eczema

Treat Eczema At Home With These Natural Remedies. Your eczema problem can now be treated at home with these homely natural remedies.
Story first published:Wednesday, October 4, 2017, 15:42 [IST]
Desktop Bottom Promotion