బ్లాక్ హెడ్స్ ను శాశ్వతంగా తొలగించే ఇంటి చిట్కాలు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

చర్మ సమస్యలు వివిధ రకాలుగా బాధిస్తుంటాయి. అలాంటి చర్మ సమస్యల్లో ఒకటి బ్లాక్ హెడ్స్ . ముఖంలో ఒక చిన్న మొటిమ వస్తేనే తట్టుకోలేని వారు, ఒక సారి వచ్చిన తర్వాత మొండిగా మారే బ్లాక్ హెడ్స్ కథేంటి..?

బ్లాక్ హెడ్స్ ముఖంలో ఏభాగంలో అయినా రావచ్చు. బ్లాక్ హెడ్స్ ముఖ అందాన్ని పాడుచేస్తుంది. బ్లాక్ హెడ్స్ ను తొలగించడం అంత సులభం కాదు.

బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి ఇప్పటికే మీరు అనేక విధాలుగా ప్రయత్నించి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం పొందక విసిగి వేసారి పోయినట్లైతే, మీకోసం చాలా సింపుల్ రెమెడీస్ ను పరిచయం చేస్తున్నాము. వీటిని ఇంట్లోనే మీరే స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఇవి అద్భుతంగా పనిచేసి, బ్లాక్ హెడ్స్ ను పూర్తిగా తొలగిస్తాయి. అందుకు కేవలం రెండు పదార్థాలుంటే చాలు మీ ముఖం తిరిగి గులాబి పువ్వులా వికసిస్తుంది.

Effective DIY 2-Ingredient Masks To Banish Blackheads

ఈ అద్భుతమైన నేచురల్ పదార్థాలును మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేస్తే చర్మ రంద్రాలను శుభ్రం చేసి, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. దాంతో బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి. ఈ నేచురల్ పదార్థాల్లో విటమిన్ సి , యాంటీ కాంపౌండ్స్, స్కిన్ ఫ్రెండ్లీ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఈ రెమెడీస్ ను పురాతన కాలం నుండి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

బ్లాక్ హెడ్స్ ను ఎఫెక్టివ్ గా..శాశ్వతంగా తొలగించే ఆ రెండు అద్భుతమైన, నేచురల్ పదార్థాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

సూచన: ఈ ఫేస్ ఫ్యాక్స్ ను ఉపయోగించడానికి ముందు స్కిన్ కి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

జెలిటిన్ పౌడర్ మరియు పాలతో ఫేస్

జెలిటిన్ పౌడర్ మరియు పాలతో ఫేస్

జెలిటిన్ పౌడర్ మరియు పాలు రెండింటిలో యాంటీ ఫంగల్ కాంపౌండ్స్ అధికంగా ఉన్నాయి. ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది. బ్లాక్ హెడ్స్ తగ్గిస్తుంది.

ఎలా తయారుచేయాలి: ఒక టీస్పూన్ జెలిటిన్ పౌడర్ మరియు పాలను మిక్స్ చేయాలి. తర్వాత ఈ మాస్క్ ను ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

 అల్లం టీ మరియు బ్రౌన్ షుగర్ మాస్క్

అల్లం టీ మరియు బ్రౌన్ షుగర్ మాస్క్

గ్రీన్ టీ మరియు బ్రౌన్ షుగర్ పవర్ ఫుల్ స్కిన్ ఫ్రెండ్లీ యాంటీ ఆక్సిడెంట్ కలిగనది. ఇది మూసుకుపోయిన చర్మ రంద్రాలు తెరచుకునే చేసి, చర్మ రంద్రాలను లోపలి నుండి శుభ్రం చేసి బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.

ఎలా తయారుచేయాలి :

రెండు టీస్పూన్ల చల్లటి గ్రీన్ టీ తీసుకుని, అందులో బ్రౌన్ షుగర్ వేయాలి. రెండూ బాగా కలిసే వరకూ మిక్స్ చేసి తర్వాత ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పసుపు మరియు పుదీనా రసంతో ఫేస్ ప్యాక్

పసుపు మరియు పుదీనా రసంతో ఫేస్ ప్యాక్

పసుపు ఒక ట్రెడిషినల్ రెమెడీ. ఇది స్కిన్ కండీషన్ ను ట్రీట్ చేస్తుంది. బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది. ముఖ్యంగా పుదీనా జ్యూస్ ను కాంబినేషన్ తో చర్మానికి ఫేస్ ప్యాక్ ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఈ ప్యాక్ చర్మం రంద్రాల నుండి డెడ్ స్కిన్ సెల్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.

ఎలా తయారుచేసుకోవాలి:

ఒక టీస్పూన్ పసుపు పౌడర్ 2 టీస్పూన్ల పుదీనా జ్యూస్ మిక్స్ చేసి, స్మూత్ గా పేస్ట్ చేసి, తర్వాత ముఖానికి ప్యాక్ లా వేసుకుని 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

ముల్తానీ మట్టి, యాపిల్ సైడర్ వెనిగర్ తో ఫేస్ ప్యాక్

ముల్తానీ మట్టి, యాపిల్ సైడర్ వెనిగర్ తో ఫేస్ ప్యాక్

ఈ రెండు పదార్థాలు ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తాయి. ఈ రెండింటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

ఎలా తయారుచేయాలి:

ఒక టీస్పూన్ ముల్తానీ మట్టి, అందులో 5 చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, ఈ మాస్క్ ను ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాలు అలాగే వదిలేసి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఎగ్ వైట్ మరియు బేకింగ్ పౌడర్

ఎగ్ వైట్ మరియు బేకింగ్ పౌడర్

ఎగ్ వైట్ మరియు బేకింగ్ పౌడర్ రెండింటి కాంబినేషన్ చర్మానికి నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. ఇది చర్మంలోని మలినాలను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. బ్లాక్ అయిన చర్మ రంద్రాలతో సహా శుభ్రపరుస్తుంది. బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.

ఎలా తయారుచేయాలి:

ఒక టీస్పూన్ బేకింగ్ పౌడర్ లో ఒక ఎగ్ వైట్ వేసి రెండూ మిక్స్ చేసి, రెండింటిని ముఖం మొత్తానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

తేనె మరియు నిమ్మరంతో ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ మాస్క్

తేనె మరియు నిమ్మరంతో ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ మాస్క్

నిమ్మరసంలో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు తేనెలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలతో కలిసినప్పుడు, ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది చర్మంలోని బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.

ఎలా తయారుచేయాలి:

ఒక టీస్పూన్ తేనె తీసుకుని, అందులో ఒక టీస్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ మిక్స్ చేయాలి. దీన్ని బ్లాక్ హెడ్స్ మీద అప్లై చేసి, 15 నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి

కార్న్ మీల్ పౌడర్ మరియు రోజ్ వాటర్ తో ఫేస్ మాస్క్

కార్న్ మీల్ పౌడర్ మరియు రోజ్ వాటర్ తో ఫేస్ మాస్క్

రెండు పదార్థాలు ఉపయోగించి బ్లాక్ హెడ్స్ ను మాయం చేసే మరో అద్భుతమైన హోం రెమెడీ. కార్నిమీల్ పౌడర్ మరియు రోజ్ వాటర్. ఈ రెండింటి కాంబినేషన్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండి చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది.

ఎలా తయారుచేయాలి:

సింపుల్ గా ఒక టీస్పూన్ కార్నిమీల్ పౌడర్ లో ఒక స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల బ్లాక్ హెడ్స్ ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి. ఈ ప్యాక్ ను బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

 ఆలివ్ ఆయిల్ మరియు ఆరెంజ్ తొక్క పౌడర్ :

ఆలివ్ ఆయిల్ మరియు ఆరెంజ్ తొక్క పౌడర్ :

ఆలివ్ ఆయిల్ మరియు ఆరెంజ్ పీల్ పౌడర్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేసన్ బ్లాక్ హెడ్స్ ను తొలగించడలో గ్రేట్ గా సహాయపడుతాయి.

ఎలా తయారుచేయాలి:

ఈ మాస్క్ తయారుచేసుకోవడానికి ఒక టీస్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ మరియు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి. 15 నిముషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి.

English summary

Effective DIY 2-Ingredient Masks To Banish Blackheads

Blackheads, the unsightly lesions, can crop up at any part of your face. Also referred to as open comedones, blackheads can be extremely hard to get rid of.
Story first published: Monday, May 29, 2017, 19:30 [IST]
Subscribe Newsletter