గుడ్డులోని పచ్చ సొనతో పసిడి బొమ్మలా మెరిసిపోండిలా..!

Posted By:
Subscribe to Boldsky

రోజూ ఒక గుడ్డు తినండి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి అంటారు నిపుణులు. అయితే కొంత మంది గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బరువు పెరుగుతారని ఆందోళన చెందుతుంటారు. అయితే కొందరు మాత్రం గుడ్డు తెల్లసొనలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి అంటారు. అలా అని గుడ్డులోని పచ్చసొనను అంత తేలికగా తీసిపారయకండి...అందులో కూడా ఎన్నో విటమిన్లు, మినిరల్స్ శరీరానికి అవసరయ్యే కొవ్వులు ఉంటాయి. అందుకే రోజుకు కనీసం ఒక ఉడకబెట్టిన గుడ్డునైనా పూర్తిగా తీసుకోవాలంటారు నిపుణులు.

అయితే ఈ మద్య కాలంలో ఫిట్ నెస్ లో భాగంగా తెల్ల సొనను తినే వారు ఎక్కువైపోయారు. మరి ఇలాంటి వారంతా పచ్చసొనను పడేస్తున్నట్లేనా? అలాంటి అవసరం లేకుండా గుడ్డు పచ్చసొనను సౌందర్య సంరక్షణకు చక్కగా ఉపయోగించుకోవచ్చని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.

చర్మ సంరక్షణకైతే ఇది మరింత బాగా ఉపయోగపడుతుందట. మరి ఆ ప్రయోజనాలేంటో, వాటిని ఎలా పొందాలో, అందుకు గుడ్డు పచ్చసొనను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

హెయిర్ కండీషనర్ గా ..:

హెయిర్ కండీషనర్ గా ..:

గుడ్డులోని పచ్చసొన జుట్టుకి మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. దీన్ని జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల కురులు మెరిసిపోతాయి. అంతే కాదు.. ఒత్తైన జుట్టు సొంతం చేసుకోవడానికి జుట్టు చివర్లు చిట్లడాన్ని తగ్గించడానికి ఇదెంతో సహాయపడుతుంది. అందుకోసం ఒక గుడ్డు పచ్చసొనను తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, కప్పు నీళ్లు చేర్చి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కు అప్లై చేసుకోవాలి. 15 నిముషాల తర్వాత తలస్నానం చేస్తే మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది.

పొడి చర్మానికి :

పొడి చర్మానికి :

చాలా మందిలో సీజన్ ఏదైనా చర్మం డ్రైగా మారి పొలుసుల్లా చర్మం రాలుతుంటుందిజ దీనికి కూడా పచ్చసొన పరిష్కారం. దీనికోసం ఒక గుడ్డులోని పచ్చసొనలో టేబుల్ స్పూన్ తేనె కలిపి చర్మానికి అప్లై చేసుకుని, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి కావల్సిన పోషణ అందివ్వడంతో పాటు, చర్మ డ్రైగా మారకుండా చేస్తుంది.

మెరిసే చర్మానికి :

మెరిసే చర్మానికి :

గుడ్డు పచ్చసొనలో ఉండే విటమిన్స్, మినిరల్స్ చర్మానికి కావల్సిన జీవాన్ని అందిస్తాయి. దాంతో చర్మం కళగా మెరిసిపోతుంది. దీనికోసం పచ్చసొనకు పెరుగు కలిపి బాగా గిలకొట్టాలి. అందులోనే కొద్దిగా తేనె, నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్ చర్మంపై పొరను శుభ్రం చేస్తుంది. స్కిన్ టోన్ కూడా మెరుగుపడుతుంది.

అవొకాడోతో అందం:

అవొకాడోతో అందం:

పచ్చసొనను అవకాడో కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మానికి చాలా లాభాలుంటాయి. ఈ రెండింటిలోనూ మన చర్మానికి అవసరమైన కొవ్వులుంటాయి. కాబట్టి తేమ కోల్పోయి, నిర్జీవమైన చర్మాన్ని ఇవి తిరిగి మెరుగుపరుస్తాయి. అందుకోసం అవొకాడో సంగం తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. మరో బౌల్లో పచ్చసొన, పెరుగు మిక్స్ చేసి, తర్వాత రెండింటిని కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత నీటితో తడిపిన టిష్యుతో తుడిచి చన్నీటితో క్లీన్ చేసుకోవాలి.

 మొటిమల నివారణకు :

మొటిమల నివారణకు :

పచ్చసొన మొటిమలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అందుకోసం ఒక బౌల్లో కొద్దిగా తేనె, బాదం నూనె, గుడ్డులోని పచ్చసొన మిక్స్ చేసి పెట్టాలి. దీన్ని మొటిమలున్న చోట అప్లై చేసి 20 నిముషాల పాటు ఉంచి, తర్వాత తడిగా ఉన్న టిష్యూ పేపర్ తో తుడిచి చన్నీటితో ముఖం కడుక్కుంటే సరిపోతుంది. మొటిమల సమస్య తగ్గుతుంది.

ముడుతలను నివారిస్తుంది:

ముడుతలను నివారిస్తుంది:

గుడ్డులోని పచ్చసొన చర్మాన్ని బిగుతుగా మార్చడం ద్వారా ముడుతలను నివారిస్తుంది. ఇందులోని పోషకాలు చర్మంలోని కొల్లాజెన్ బంధాలను మరింత స్ట్రాంగ్ చేస్తుంది. దాంతో వయస్సు పైబడకుండానే వచ్చిన ముడతలు తగ్గిపోతాయి. అందుకోసం ఒక అరటిపండును మెత్తగా చేసి, అందులో ఆలివ్ నూనె, ఒక గుడ్డులోని పచ్చసొన కలిపి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత తడి వస్త్రంతో తుడిచి తర్వాత వేడి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

కోడిగుడ్డులోని పచ్చసొనతో

కోడిగుడ్డులోని పచ్చసొనతో

కోడిగుడ్డులోని పచ్చసొనతో వివిధ రకాల ప్యాక్స్ వేసుకోవచ్చు. ఇది చర్మానికి గట్టిగా అంటుకుంటుంది. కాబట్టి మరీ ఎక్కువ సేపు ఉంచుకోకూడదు. అలా ఉంచితే ముడుతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది గుర్తించుకుని, ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే అందంగా మెరిసిపోతారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Egg Yolk for Face and Hair..!

    It’s hard to believe that an egg yolk good for body. It’s been proven by a science. The egg yolk contains a chemical compound that body needed. Egg is a wonderful and natural product that can be used for skincare. And, actually, facial masks with the use of an egg are very effective!
    Story first published: Friday, April 21, 2017, 15:27 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more