డ్రై స్కిన్ నివారణకు పండ్లతో ఫేస్ ప్యాక్

Posted By:
Subscribe to Boldsky

మహిళలు ఎంత అందంగా ఉన్నా కూడా వారికి సౌందర్యం మీద ఆశ ఉండనే ఉంటుంది. ముఖ్యంగా ముఖ కాంతిని పెంచుకోవాలని అతివలు ఆరాటపడుతుంటారు. ఇందుకోసం ముఖానికి ఏవేవో క్రీములు రాస్తుంటారు. కొంత మంది పొడి చర్మంతో ఇబ్బంది పడుతుంటారు. డ్రై స్కిన్ కారణంగా చర్మం దురదగా ఉండటం, రఫ్ గా మారడం జరుగుతుంది. డ్రైస్కిన్ ఎప్పటికప్పుడు నివారించుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. అయితే మనం రోజూ వాడే పండ్లతో డ్రై స్కిన్ నివారించి, ముఖారవిందాన్ని అందంగా మార్చుకోవచ్చు.

ఆరోగ్యం మొత్తానికి పండ్లు చాలా గ్రేట్. పండ్లు తినడం వల్ల మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, పండ్లను రెగ్యులర్ గా తినడం వల్ల క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందుతారు. పండ్లతో మీ ముఖానికి ఫేస్ మాస్క్, లేదా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇంకా పండ్లు ఫేస్ స్రబ్, టోనర్, క్లెన్సర్ గా కూడా ఉపయోగపడుతాయి.

డ్రై స్కిన్ నివారణకు పండ్లతో ఫేస్ ప్యాక్

ఫ్రూట్ ఫేషియల్ గురించి మనందరం ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం. ఫ్రూట్ ఫేషియల్ అంత కష్టమైన పనేం కాదు. జస్ట్ అనుసరించే పద్దతి వల్ల చర్మ శుభ్రపడే విధానం మరియు మాయిశ్చరైజ్ చేసే విధానం తెలుసుకుంటే చాలు. అయితే చర్మానికి పండ్లను ఉపయోగించినప్పుడు అవి తాజాగా ఉండాలి, ప్రిజర్వేటివ్స్ ను ఎంపిక చేసుకోకూడదు. నేచురల్ గా దొరికే పండ్లను ఉపయోగిస్తేమంచిది.

మొటిమలను శాశ్వతంగా మాయంచేసే ఫ్రూట్ ఫేస్ ప్యాక్

ఇంట్లోనే సహజసిద్దంగా ఫ్రూట్ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. కొన్ని ఆర్గానిక్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ కూడా అన్ని రకాల స్కిన్ టోన్ లకు సరిపోవు. కాబట్టి కొన్ని సింపుల్ ఫ్రెండ్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ తో ఇంటి వద్దే ఫేషియల్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

1. అరటి ఫేస్ ప్యాక్ :

1. అరటి ఫేస్ ప్యాక్ :

అరటి పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్,ఫైటో కెమికల్స్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

రిసిపి:

1 అరటి: బాగా పండినది

తేనె : 1 టేబుల్ స్పూన్

ఆలివ్ ఆయిల్ : 1టేబుల్ స్పూన్

మిక్సింగ్ బౌల్: 1

1. ఒక బౌల్ తీసుకుని, అందులో అరటి పండు ముక్కలుగా చేసి వేసి, మొత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత బనాన పేస్ట్ కు తేనె, ఆలివ్ ఆయిల్ కలపాలి.

3. ఈ మిశ్రమాన్ని డ్రై స్కిన్ కు అప్లై చేయాలి.

4. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

మీది పొడి జుట్టా...? ఐతే ఇవిగో ఉత్తమ హోం రెమెడీలు

2. కీరదోసకాయ :

2. కీరదోసకాయ :

డ్రై స్కిన్ కు ఫర్ఫెక్ట్ మాయిశ్చరైజర్ . కుకుంబర్ జ్యూస్ తో డ్రైస్కిన్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

రిసిపి:

కీరదోసకాయ జ్యూస్ : 1 కప్పు

ఫ్రెష్ అలోవెర జ్యూస్ 2 టేబుల్ స్పూన్లు

బౌల్

1. ఈ ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవడానికి కీరదోసకాయను ముక్కలుగా కట్ చేసి, జార్ లో వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత జ్యూస్ ను పక్కన తీసి పెట్టుకోవాలి.

2. కీరదోస కాయ జ్యూస్ ను బౌల్లో వేసి, అందులో అలోవెర జెల్ ను మిక్స్ చేయాలి.

3. ఈ మిశ్రమాన్ని డ్రై స్కిన్ కు అప్లై చేయాలి. 15 నిముసాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

3. బొప్పాయి ఫేస్ ప్యాక్ :

3. బొప్పాయి ఫేస్ ప్యాక్ :

బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ బి, మినిరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల, ఇది డ్రై స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇది ఏజింగ్, ముడుతలు, బ్లాక్ స్పాట్స్ వంటి సమస్యలను నివారిస్తుంది.

రిసిపి:

పెరుగు: 1 టేబుల్ స్పూన్

నిమ్మరసం: 1టేబుల్ స్పూన్

బొప్పాయి పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు

ముల్తాని మట్టి: 1 టీస్పూన్

తేనె: 1 టీస్పూన్

బౌల్ : 1

1. మిక్సింగ్ బౌల్లో బొప్పాయి పేస్ట్ , పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులోనే తేనె, ినమ్మరసం, ముల్తానీ మట్టి వేసి మిక్స్ చేయాలి. స్మూత్ పేస్ట్ లా చేయాలి.

2. ఈ పేస్ట్ ను ముఖం, , మెడ, చేతులకు బ్రష్ తో కోట్ చేయాలి.

3. 15-20నిముషాలు విశ్రాంతి తీసుకుని, తర్వాత చల్లటి ీనటితో శుభ్రం చేసుకోవాలి.

4. అవొకాడో ఫేస్ ప్యాక్:

4. అవొకాడో ఫేస్ ప్యాక్:

న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే అవొకాడో ఫేస్ ప్యాక్ వల్ల పొడి చర్మం తగ్గించుకవోచ్చు. పొడి చర్మం నివారించుకోవడానికి మిల్క్ క్రీమ్ తో పాటు, రోజ్ వాటర్ కూడా అవసరం అవుతుంది.

రిసిపి:

అవొకాడో: 1

పాలక్రీమ్: 2 టేబుల్ స్పూన్లు

రోజ్ వాటర్ : 2 టేబుల్ స్పూన్లు

మిక్సింగ్ బౌల్:

1. అవొకాడోను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

2. తర్వాత అవొకాడో పేస్ట్ కు పాలు, క్రీమ్, రోజ్ వాటర్ కలపాలి.జ

3. మొత్తం మిశ్రమాన్ని స్మూత్ పేస్ట్ గా కలుపుకోవాలి.

4. ఈ పేస్ట్ ను ముఖం మొత్తానికి అప్లై చేయాలి. తర్వాత డ్రై స్కిన్ ఉన్న ప్రదేశంలో కూడా అప్లై చేయాలి.

5. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

చర్మంను కాంతివంతంగా మార్చే విటమిన్ సి ఫ్రూట్ ఫేస్ ప్యాక్

స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్ :

స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్ :

చర్మ సంరక్షణకు ఉపయోగించదగ్గ ఒక బెస్ట్ రెడ్ ఫ్రూట్ ఇది. స్ట్రాబెర్రీస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఆస్ట్రిజెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పొడి చర్మాన్ని నయం చేస్తాయి. స్ట్రాబెర్రీ చర్మం మెరిసేలా చేస్తుంది. స్ట్రాబెరీ ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

రిసిపి:

స్ట్రాబెర్రీస్ : 10

పెరుగు: 1 టేబుల్ స్పూన్

మిక్సింగ్ బౌల్ : 1

1. అరకప్పు స్ట్రాబెరీలను మెత్తగా పేస్ట్ చేసి, అందులో పెరుగును మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి.

2. 10-15నిముషాలు అలాగే ఉంచి , తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల , ఇది చాలా ప్రభావవంతంగా డ్రై స్కిన్ నివారిస్తుంది.

వాటర్ మెలోన్ ఫేస్ ప్యాక్ :

వాటర్ మెలోన్ ఫేస్ ప్యాక్ :

జ్యూసీ వాటర్ మెలోన్ ఒక మంచి రెడ్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికే కాదు, సౌందర్యానికి కూడా ఎక్కువ మేలు చేస్తుంది. ముఖ్యంగా కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

రిసిపి:

వాటర్ మెలోన్ : 2 టేబుల్ స్పూన్లు

కీరదోసకాయ : 2 టేబుల్ స్పూన్లు

పెరుగు: 1 టేబుల్ స్పూన్

పాల పౌడర్ : ఒక టేబుల్ స్పూన్

బౌల్ : 1

1. పుచ్చకాయ, కీరదోసకాయ ముక్కలను బౌల్లో వేయాలి. తర్వాత పెరుగు, పాల పొడి కూడా కలిపి స్మూత్ గా పేస్ట్ లా చేసుకోవాలి.

2. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

3. 15 నిముషాల తర్వాత ముఖంను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మం శుభ్రపడటమే కాదు కాంతివంతంగా మారుతుంది.డ్రై స్కిన్ తగ్గుతుంది.

మామిడి పండు:

మామిడి పండు:

పండ్లలో రారాజుగా పిలుచుకునే మామిడి పండ్లు చర్మానికి కావల్సిన తేమను అందించి డ్రై స్కిన్ తగ్గిస్తుంది.

రిసిపి:

బాదం: 10(పౌడర్ చేసుకోవాలి)

మామిడి పండు: 1(మీడియం సైజ్)

ముల్తానీ మట్టి: 2 టేబుల్ స్పూన్లు

పచ్చిపాలు : 2 టీస్పూన్లు

వాటర్ : 2టీస్పూన్లు

ఓట్ మీల్ : 2 టీస్పూన్లు

మిక్సింగ్ బౌల్ : 1

1. మామిడిపండు ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే బాదం పౌడర్, ముల్తానీ మట్టి, పచ్చిపాలు, ఓట్ మీల్, నీళ్ళు మిక్స్ చేసి, మొత్తం మిశ్రమాన్ని కలపాలి,

2. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.

3. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్ :

ఆరెంజ్ ఫేస్ ప్యాక్ :

ఈ సిట్రస్ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది సెబమ్ తొలగిస్తుంది, మలినాలను, మురికిని తగ్గిస్తుంది, డ్రై స్కిన్ నివారిస్తుంది. చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది.

రిసిపి

పెరుగు: 2 టేబుల్ స్పూన్లు

రోజ్ వాటర్: 1 టేబుల్ స్పూన్

ఆరెంజ్ జ్యూస్: 1 టేబుల్ స్పూన్

బౌల్

1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులో రోజ్ వాటర్, మరియు ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.

2. 20 నిముషాల తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. ఈ ప్యాక్ వల్ల చర్మానికి కావల్సిన తేమ అందుతుంది. పొడి చర్మం తగ్గుతుంది.

మీది పొడి జుట్టా...? ఐతే ఇవిగో ఉత్తమ హోం రెమెడీలు

English summary

Face Packs For Dry Skin | Fruit Face Packs For Dry Skin | Dry Skin Remedies | How To Treat Dry Skin With Fruits in Telugu

Get rid of dry skin problems now with these eight fruit-based face packs that can easily be made at home.
Subscribe Newsletter