త‌క్కువ ఖ‌ర్చులో ఈ 11 స‌హ‌జ ప‌దార్థాల‌తో మీ చర్మాన్ని ఎల్ల‌ప్పుడు తాజాగా!

By: sujeeth kumar
Subscribe to Boldsky

స‌రైన చ‌ర్మ సంర‌క్ష‌ణ లేక‌, పొల్యూష‌న్‌, ఎక్కువ‌గా కెమిక‌ల్స్‌తో కూడుకున్న స్కిన్ ప్రొడ‌క్ట్స్‌పైన ఆధార‌ప‌డటం వ‌ల్ల చ‌ర్మం కాంతిహీనంగా మారుతోంది. ఇలాంటి అనారోగ్య‌క‌ర‌మైన లైఫ్ స్టైల్ అల‌వాట్ల‌తో నానాటికీ చ‌ర్మం పాడ‌వుతోంది.

ఇలా జ‌ర‌గ‌డం మూలాన అంద‌మైన చ‌ర్మ‌కాంతి సొంతం చేసుకునేందుకు మేక‌ప్ పైనే ఆధార‌ప‌డాల్సి వ‌స్తోంది. ఇలాంటి బ్యూటీ ట్రీట్‌మెంట్స్ కోసం వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తోంది. అయితే సింపుల్‌గా, త‌క్కువ ఖ‌ర్చుతో, నాణ్య‌మైన విధానాల‌ను పాటించి చ‌ర్మాన్ని ఫ్రెష్ గా, కాంతిమంతంగా మ‌ల‌చుకోవ‌చ్చు.

అందంగా మారడానికి సింపుల్ ఫేషియల్ ప్యాకేజ్

Natural Ingredients You Can Use To Refresh Your Skin

స‌హ‌జమైన ప‌ద్ధ‌తుల్లో స్కిన్ ను తాజాగా, ఆరోగ్యంగా ఉంచుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చ‌ర్మ క‌ణాల‌కు నూత‌నేత్తోజం తీసుకురావ‌డంతో పాటు పాలిపోయిన వాటికి సైతం ఈ స‌హ‌జ ప‌దార్థాలు తోడ్ప‌డ‌తాయి.

ప్ర‌కృతిలో సహ‌జంగా ల‌భించే వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టిరీయల్ ఎలిమెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. అన్ని ర‌కాల చ‌ర్మ త‌త్వాల‌కు అవి స‌రిపోతాయి. పైగా ఎల్ల‌ప్పుడూ చ‌ర్మాన్ని ఫ్రెష్‌గా , క్లీన్‌గా ఉంచడంతో స‌హాయ‌ప‌డ‌తాయి.

మీ జేబుకు చిల్లు ప‌డ‌కుండా కొన్ని ర‌కాల స‌హ‌జ ప‌దార్ధాల‌తో చ‌ర్మాన్ని అందంగా ఎలా మ‌ల‌చుకోవ‌చ్చో ఇప్పుడు చూద్దాం...

ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని అందించే ఫ్రూట్ జ్యూసులు

1. కీర దోస‌

1. కీర దోస‌

చ‌ర్మాన్ని లోప‌లి నుంచి శుభ్ర‌ప‌రిచేందుకు కాస్తంత కీర దోస పేస్ట్‌ను ముఖానికి బాగా రాసుకోవాలి. ఆ త‌ర్వాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. తాజా దోస జ్యూస్‌ను కూడా తీసి ఫేషియ‌ల్ టోన‌ర్‌లా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇలా రోజుకోసారి చేస్తుంటే చ‌ర్మం తాజాగా క‌నిపిస్తుంటుంది.

2. అలోవెరా జెల్‌

2. అలోవెరా జెల్‌

అలోవెరా మొక్క‌లోంచి వ‌చ్చే గుజ్జు చ‌ర్మానికి చాలా మంచిది అంటారు. చ‌ర్మానికి రిఫ్రెషింగ్ లుక్‌ని ఇస్తుంది. దీన్ని చ‌ర్మానికి నేరుగా వాడొచ్చు లేదా ఇంట్లో ల‌భించే ఇత‌ర స‌హ‌జ ప‌దార్థాల‌తోనూ కలిపి వాడొచ్చు. రోజుకోసారి అలోవేరా జెల్ వాడ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా, క్లియ‌ర్‌గా మారుతుంది.

3. లెమ‌న్ జ్యూస్‌

3. లెమ‌న్ జ్యూస్‌

తాజా నిమ్మ‌కాయ ర‌సంలో దూదిని ముంచి చ‌ర్మంపైన రుద్దాలి. స్కిన్‌ను ఇది లోప‌లి నుంచి శుభ్రం చేయ‌గ‌ల‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల కొన్ని రోజులుగా అల‌సినట్టుగా క‌నిపించే చ‌ర్మం తిరిగి పుంజుకొని అందంగా క‌నిపిస్తుంది.

4. తేనె

4. తేనె

తేనెలో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తేనె వాడ‌కం వ‌ల్ల‌ కొన్ని నిమిషాల్లోనే చ‌ర్మం తాజాగా క‌నిపిస్తుంది. కొంచెం తేనె తీసుకొని చ‌ర్మంపై స‌న్న‌ని పూత‌లాగా పూయాలి. ఇలా రోజు చేయ‌డం వ‌ల్ల డ‌ల్‌నెస్ త‌గ్గి చ‌ర్మం ఫ్రెష్‌గా క‌నిపిస్తుంది. తేనెను ఇత‌ర స‌హ‌జ ప‌దార్థాల‌తో క‌లిపి కూడా వాడుకోవ‌చ్చు.

5. రోజ్ వాట‌ర్‌

5. రోజ్ వాట‌ర్‌

చాలా స్కిన్ కేర్ ఉత్ప‌త్తుల్లో రోజు వాట‌ర్ ఓ అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని అంటారు. రోజ్ వాట‌ర్ న్యాచుర‌ల్ క్లెన్స‌ర్‌గా ప‌నిచేస్తుంది. చ‌ర్మంలో ఉన్న మ‌లినాల‌ను ఇట్టే తొల‌గించేస్తుంది. స‌హ‌జ అందాల‌ను తిరిగి తేగ‌ల శ‌క్తి రోజ్ వాట‌ర్‌కుంది. రాత్రి ప‌డుకునే ముందు రోజ్‌వాట‌ర్‌ను చ‌ర్మానికి రాసుకుంటే పొద్దున్నే ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

6. కుంకుమ పువ్వు

6. కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు కాండ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టిరీయా ఏజెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి చ‌ర్మంలో ప‌గుళ్ల‌ను మాయం చేయ‌గ‌ల‌వు. తాజాగా ఉంచ‌గ‌ల‌వు. లోప‌లి నుంచి చ‌ర్మాన్ని శుభ్రం చేయ‌గ‌ల‌వు. అందుకే డ‌ల్‌గా, పాలిపోయిన చ‌ర్మం ఉంటే కుంకుమ పువ్వుతో రెగ్యుల‌ర్‌గా శుభ్రం చేయ‌డం వ‌ల్ల ఫ‌లితం క‌నిపిస్తుంది.

7. గ్రీన్ టీ

7. గ్రీన్ టీ

కొంచెం తాజా గ్రీన్ టీ త‌యారు చేసుకొని ఫ్యాన్ కింద చ‌లార్చుకోవాలి. దీన్ని ముఖానికి మ‌ర్ద‌న చేసుకోవాలి. అప్పుడు ముఖం క్లీన్‌గా, ఫ్రెష్‌గా క‌నిపిస్తుంది. ఇలా క్ర‌మంగా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంలో డ‌ల్‌నెస్ త‌గ్గి ముఖం కాంతివంతంగా త‌యార‌వుతుంది.

8. ప‌సుపు

8. ప‌సుపు

ప‌సుపును సౌంద‌ర్య సాధ‌నంలో భాగంగా పురాత‌న కాలం నుంచి వాడుతున్నారు. ప‌సుపు వాడ‌కం వ‌ల్ల చ‌ర్మం తాజాగా అనిపించ‌డ‌మే కాదు మునుప‌టి డ‌ల్‌నెస్ మొత్తం పోతుంది. దీన్ని నేరుగా వాడొచ్చు లేదా ఏదైనా ఇంట్లో చేసుకున్న స‌హ‌జ‌మైన క్రీమ్‌లో క‌లుపుకొని వాడొచ్చు. ఎలా వాడినా అద్భుత‌మైన ఫ‌లితాల‌ను చూడొచ్చు.

9. ఆల్మండ్ ఆయిల్‌

9. ఆల్మండ్ ఆయిల్‌

మీరు రోజువాడే ఫేస్ క్రీమ్‌లో లేదా టోన‌ర్‌లో కొన్ని చుక్క‌ల ఆల్మండ్ ఆయిల్ కలుపుకొని వాడి చూడండి. ఫ‌లితాల‌ను మీరే చూస్తారు. మీ చ‌ర్మం మ‌రింత కాంతివంతంగా, తాజాగా అయ్యేందుకు కొన్ని రోజులే ప‌డుతుంది. ఆల్మండ్ ఆయిల్‌ను రోజు వాడ‌డం వ‌ల్ల త్వ‌ర‌లోనే మీ చ‌ర్మం తాజాగా అనిపిస్తుంది.

10. పుదీన జ్యూస్‌

10. పుదీన జ్యూస్‌

పుదీన జ్యూస్ మంచి స్కిన్ రీఫ్రెషింగ్ టోన‌ర్‌లా ప‌నిచేస్తుంది. చ‌ర్మాన్ని కాంతివంతంగా చేయ‌గ‌ల కెపాసిటీ దీనికుంది. కొంచెం పుదీన జ్యాస్‌ను స్ప్రే బాటిల్‌లో వేసుకొని రోజు వాడితే చ‌ర్మం రోజంతా తాజాగా క‌నిపిస్తుంది.

11. పెరుగు

11. పెరుగు

పెరుగులో అన్ని ర‌కాల స‌హ‌జ పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇది చ‌ర్మాన్ని తాజాగా ఉంచడంలో స‌హాయప‌డ‌తాయి. ఎన్నో చ‌ర్మ రుగ్మ‌త‌ల‌కు పెరుగు ప‌రిష్కారం చూపగ‌ల‌దు. పెరుగును చ‌ర్మంపై వాడ‌డం వ‌ల్ల మంచి రూపాన్ని సంత‌రించుకోగ‌ల‌దు. వారానికి రెండు సార్లు ఏదో రూపంలో వాడ‌డం చాలా మంచిది. మంచి పాజిటివ్ ఫ‌లితాల‌ను చూడొచ్చు.

English summary

11 Natural Ingredients You Can Use To Refresh Your Skin

Natural ingredients are the best to make your skin look refreshed and glowing.
Story first published: Monday, October 23, 2017, 11:30 [IST]
Subscribe Newsletter