మీ వయస్సుని 10ఏళ్లు వెనెక్కి తీసుకెళ్లి..యంగ్ గా మార్చే అద్భుతమైన ఫేస్ మాస్క్ లు..!!

Posted By:
Subscribe to Boldsky

వయసు పెరగడం అనేది న్యాచురల్ ప్రాసెస్. ప్రతి ఒక్కరూ.. ఈ సమస్యను ఎదుర్కోవాల్సిందే. చర్మంలో వయసు చాయలు మొదలైనప్పుడు.. ముడతలు, ఫైన్ లైన్స్ కనిపిస్తాయి. ఇవి మిమ్మల్ని అందవిహీనంగా మారుస్తాయి. అయితే ప్రతి ఒక్కరూ అసలు వయస్సు కంటే మరింత యంగ్ గా కనిపించాలనికోరుకుంటారు. పైన తెలిపిన ఏజింగ్ లక్షణాలను ఏ ఒక్కరూ కోరుకోరు.

అయితే ఇటువంటి పరిస్థితికి కారణం చాలా సందర్భాల్లో సరైన చర్మ సంరక్షణ లేకపోవడం, అన్ హెల్తీ ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ వంటి రకరకాల కారణాల వల్ల.. ప్రీమెచ్యూర్ ఏజింగ్ సంకేతాలు కనిపిస్తాయి. ఒకవేళ దీనికోసం మీరు న్యాచురల్ రెమిడీ కోసం వెతుకుతుంటే.. హోంరెమిడీస్, హెర్బల్ రెమిడీస్ ప్రయత్నించడం వల్ల 10 ఏళ్లు మీ వయసు వెనక్కి వెళ్తుంది. అంటే 10ఏళ్లు యంగ్ గా కనిపిస్తారు.

Face Masks To Keep Your Skin 10 Years Younger

ఏజింగ్ స్కిన్ నివారించడంలో ఈ హోం మేడ్ ఫేస్ మాస్క్ లు అద్భుతంగా సహాయపడుతాయి.వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. అంతే కాదు వీటిలో ఉండే నేచురల్ ప్రోటీన్స్, విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ చర్మంను యంగ్ గా మార్చేస్తాయి. మరి మీరు కూడా 10 ఏళ్ళ యంగర్ లుక్ ను సొంతం చేసుకోవాలి. ఫేవ్ లెస్ స్కిన్ పొందాలనుకుంటే మీకోసం ఇక్కడ కొన్ని హోం మేడ్ ఫేస్ మాస్క్ లు ఉన్నాయి. వాటిని ఎలా తయారుచేసుకోవాలి. ఎలా వేసుకోవాలి..ఏవిధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం..!

దానిమ్మ ఫేస్ మాస్క్

దానిమ్మ ఫేస్ మాస్క్

దానిమ్మలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. దానిమ్మ ఫేస్ మాస్క్ ఖచ్చితంగా చర్మసౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఫ్యాక్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించబడి, కాంతివంతమైన చర్మాన్ని అందిస్తాయి.

దానిమ్మ విత్తనాలు 3 టీస్పూన్లు తీసుకుని, అందులో ఉడికించిన ఓట్స్ కొద్దిగా , రెండు స్పూన్ల పాలు మిక్స్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మెత్తగా పేస్ట్ లా తయారయ్యాక ఫేస్ కు ప్యాక్ వేసుకుని అరగంట తర్వాత ముఖాన్నిచల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్ మరియు తేనె మాస్క్

ఓట్ మీల్ మరియు తేనె మాస్క్

ఈ పేస్ మాస్క్ ను తేనె, ఓట్ మీల్ తో తయారుచేసుకోవాలి.ఈ రెండు మిశ్రమాన్ని బాగా కలగలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఓట్ మీల్ , హనీ ఫేస్ మాస్క్ చర్మంను డీప్ గా ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. దాంతో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

ఇంకా ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మానికి యంగ్ లుక్ ను అందిస్తుంది. ఒక వారంలో 5 సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అరటితో యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్

అరటితో యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్

అరటిపండులో ఫైబర్ , యాంటీఆక్సిడెంట్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మంను యంగ్ గా మార్చుతుంది. ఫ్రెష్ గా ఉంచుతుంది. చర్మానికి అరటిపండును వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. బాగా పండిన అరటి పండు తీసుకుని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా తేనె, ఫ్రెష్ క్రీమ్ ను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ లో ఉండే విటమిన్ ఇ మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు ఏజింగ్ లక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది

బొప్పాయి, పెరుగు ఫేస్ మాస్క్

బొప్పాయి, పెరుగు ఫేస్ మాస్క్

బొప్పాయి మరియు పెరుగులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు టానిన్స్ చర్మానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది. ఇది క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందివ్వడం మాత్రమే కాదు, చర్మంలోని మెటిమలను, మచ్చలను మరియు ఇతర ఏజింగ్ లక్షణాలను తొలగిస్తుంది.బొప్పాయి, పెరుగు ఫేస్ మాస్క్ ను ఉపయోగించడంలో ఇది నేచురల్ సన్ స్క్రీన్ లా పనిచేస్తుంది. ఈ మాస్క్ ను వారంలో రెండు మూడు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 కోకనట్ మిల్క్ మాస్క్

కోకనట్ మిల్క్ మాస్క్

కోకనట్ మిల్క్ లో విటమిన్స్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా చర్మానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. కోకనట్ మిల్క్ లో ఉండే మినిరల్స్ చర్మంను సాప్ట్ గా మాయిశ్చరైజ్డ్ గా మార్చుతుంది. కొద్దిగా కొబ్బరి పాలు తీసుకుని అందులో నిమ్మరసం, తేనె మరియు కొద్దిగా గ్లిజరిన్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

క్రాన్ బెర్రీ ఫేస్ మాస్క్

క్రాన్ బెర్రీ ఫేస్ మాస్క్

క్రాన్ బెర్రీస్ లో ఉండే విటమిన్ సి చర్మంను సాప్ట్ గా మరియు గ్లోయింగ్ గా మార్చుతుంది. ఇది ముడుతను , ఫైన్ లైన్స్ ను మాయం చేస్తుంది. డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది. గుప్పెడు క్రాన్ బెర్రీస్ ను తీసుకుని అందులో విత్తనాలను తొలగించాలి. వీటికి 5-6 ద్రాక్ష చేర్చి , ఒక స్పూన్ నిమ్మరసం, అలోవెర జెల్ మిక్స్ చేసి, మిక్సీలో వేసి మెత్గగా చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ డ్రైస్కిన్ ను హైడ్రేట్ గా మార్చుతుంది.

 స్ట్రాబెర్రీ ఫేస్ మాస్క్

స్ట్రాబెర్రీ ఫేస్ మాస్క్

స్ట్రాబెర్రీలో ఫ్రీరాడిక్స్ తొలగించే యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. గుప్పెడు స్ట్రాబెర్రీస్ మరియు పెరుగు తీసుకుని మెత్గా చేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.

అవసరం అయితే కొద్దిగా ఎసెన్సియల్ ఆయిల్ మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవాలి. స్ట్రాబెర్రీ ఫేస్ మాస్క్ ను రోజువిడిచి రోజు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Face Masks To Keep Your Skin 10 Years Younger

Love the skin you're in and make it look more youthful than ever by trying out these best face masks that suit all skin types.
Story first published: Thursday, February 23, 2017, 14:09 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter