For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెషియల్ సీరం Vs ఫెషియల్ మాయిశ్చరైజర్ - వీటి మధ్య తేడాలు ఏమిటి?

By Lakshmi Perumalla
|

సౌందర్య పరిశ్రమ ఒక సముద్రం మీద నిరంతరం చూసే హోరిజోన్ లాగా ఉంటుంది. మొదటి చూపులో ముగింపు ఉంటుంది. కానీ దగ్గరకు వెళ్లే కొద్ది మార్గం మరింతగా ఉంటుంది. ప్రజల జీవితంలో ప్రతి దశలోనూ సౌందర్య అవసరాలు ఉంటాయి. అనేక ఉత్పత్తులను అభివృద్ధి చేయడం ద్వారా మార్కెట్లు దీన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి.

ఈ జాబితాలో ప్రక్షాళన, ఎక్సోసియేటర్, టోనర్, స్క్రబ్, క్రీమ్, లోషన్, మాయిశ్చరైజర్, సీరం వంటి అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. మీకు నిజంగా వీటి మధ్య తేడాలు తెలుసా? చర్మంపై వాడటం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా?

<strong>ముఖంపై అన్ వాంటెడ్ హెయిర్ ఇబ్బంది పెడుతోందా ?</strong>ముఖంపై అన్ వాంటెడ్ హెయిర్ ఇబ్బంది పెడుతోందా ?

అన్ని ఉత్పత్తులు ఒకే రకంగా కన్పిస్తాయి. ముఖాన్ని సబ్బుతో కడగాలి. క్రీమ్ ని ముఖంపై రాయాలని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ బ్యూటీ ఉత్పత్తులకు కూడా నియమాలు ఉంటాయని తెలియదు. అన్ని ఉత్పత్తులు ముఖ్యమైనవి. అలాగే ప్రతి ఒక్కటి చర్మం కోసం ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కలిగి ఉంటుంది.

అయినప్పటికీ చాలా మంది ప్రజలకు బ్యూటీ ఉత్పత్తుల మీద సరైన అవగాహన లేదు. అటువంటి వారికి ఈ ఆర్టికల్ బాగా సహాయపడుతుంది. మాయిశ్చరైజర్ మరియు సీరం మధ్య వ్యత్యాసంను తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చదవండి.

<strong>ముఖంలో బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించే హోం మేడ్ ఫేషియల్స్</strong>ముఖంలో బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించే హోం మేడ్ ఫేషియల్స్

సీరం

సీరం

సీరం సౌందర్య నిపుణులచే గుర్తించబడింది. అలాగే ఎక్కువ ప్రజాదరణ కూడా పొందింది. చాలా మంది ఖరీదైన వస్తువులను కొనకుండా ఉండటం వలన సెరమ్ కొనుగోలు చేస్తారు. కానీ అధిక ధరలకు కూడా కారణాలున్నాయి.

సీరం చర్మంపై ప్రభావవంతంగా పనిచేయటానికి అనేక రకాల క్రియాశీల పదార్ధాలతో నిండి ఉంటుంది. ఆ క్రియాశీల పదార్ధాల సంఖ్య 10 నుంచి 15 వరకు ఉండవచ్చు.

సీరం ద్రవ రూపంలో ఉండి చర్మంపై కాంతిని ఇస్తుంది. సీరం గురించి సాంకేతికంగా చెప్పాలంటే సీరంలో అణువులు సూక్ష్మ-పరిమాణంలో ఉండుట వలన చర్మంలో త్వరగా వ్యాప్తి చెందుతాయి. చర్మం లోపలి పొరలలోకి వెళ్ళటం వలన లోపల నుండి మెరుపు వస్తుంది. సీరం సమయోచిత ప్రయోజనాల కోసమే కాకుండా చర్మం మూలాల నుండి పనిచేస్తుంది.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ ని చర్మంపై ఉపయోగిస్తే చర్మం తేమగా ఉంటుంది. అంతేకాక చర్మం మృదువుగా ఉంటుంది. మాయిశ్చరైజర్ లో ముఖ్యంగా రసాయన విషయాలు ఆక్సిజన్,హైడ్రోజన్ బంధాలు మరియు నీరు ఉండుట వలన తేమను ఆకర్షిస్తుంది. మాయిశ్చరైజర్ లో క్రియాశీలక పదార్థాల సంఖ్య సీరంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి.

మాయిశ్చరైజర్ క్రీమ్ మరియు లోషన్ రూపంలో లభ్యం అవుతుంది. లోషన్ లను శాస్త్రీయంగా ఎమోలియింట్ అని పిలుస్తారు. వాటి నిర్మాణంలో కాంతి ఉంటుంది. మాయిశ్చరైజర్ లో అణువులు సీరంలో కన్నా పెద్దగా ఉండి చనిపోయిన చర్మ కణాల మధ్య అంతరాన్ని కలిగిస్తాయి. క్రీమ్ లలో ఖనిజ నూనెలు మరియు పెట్రోలియం కలిగి ఉండి సమ్మోహనాలు అని పిలుస్తారు. క్రీమ్ లలో అణువులు పెద్దవిగా ఉండి చర్మం లోపలికి చొచ్చుకొనిపోయి తాత్కాలిక హైడ్రేషన్ కోసం లోషన్ల కంటే వేగంగా పని చేస్తాయి.

సీరం మరియు మాయిశ్చరైజర్ యొక్క ప్రయోజనం

సీరం మరియు మాయిశ్చరైజర్ యొక్క ప్రయోజనం

అనేక రకాల కారణాలతో చర్మం పొడిగా మారుతుంది. చర్మం లోపలి పొరలకు వెళ్లకుండా బాహ్యచర్మం వరకు పైకి ప్రయాణించే సమయానికే చాలా తేమను కోల్పోతుంది. ఇది సర్వ సాధారణంగా జరుగుతుంది. అంతేకాకుండా వాతావరణం,జన్యు, చర్మ స్వభావాన్ని బట్టి కూడా జరుగుతుంది.

ఈ సమయంలో మాయిశ్చరైజర్ ని ఉపయోగిస్తే చర్మం పొడిగా మారకుండా నిరోధిస్తుంది. ఇది మాయిశ్చరైజర్ యొక్క ఏకైక ప్రయోజనం. మాయిశ్చరైజర్ ని వాడటం మానివేస్తే పొడి చర్మం యొక్క పరిస్థితి పునరావృతమవుతుంది. మాయిశ్చరైజర్ శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వవు.

సీరం వేరొక ప్రయోజనం కోసం పనిచేస్తుంది.ఇది చర్మం యొక్క నిర్దిష్ట అవసరాలను లక్ష్యంగా చేసుకుంటుంది.సీరం మోటిమలు, ముడుతలు, పిగ్మెంటేషన్, విటమిన్ C లోపం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది.

చర్మ సమస్యల పరిష్కారానికి చర్మం లోపలి పొరలలో లోతుగా పనిచేస్తుంది. నిర్వహణ సరిగ్గా చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సీరం చర్మ నష్ట మరమత్తులో బాగా సహాయపడుతుందని చెప్పవచ్చు.

ఇక్కడ గుర్తించదగ్గ వాస్తవం ఏమిటంటే, సీరం మరియు మాయిశ్చరైజర్ రెండూ కూడా చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అయితే మాయిశ్చరైజర్ పూర్తిగా పనిచేయదు. అందువల్ల రెండింటినీ మెరుగైన ఫలితాలను పొందడానికి ఉపయోగించాలి.

సీరం మరియు మాయిశ్చరైజర్ ని ఉపయోగించటానికి మార్గాలు

సీరం మరియు మాయిశ్చరైజర్ ని ఉపయోగించటానికి మార్గాలు

సీరం విషయానికి వస్తే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. సీరంలో ఎక్కువ చురుకైన పదార్ధాలు ఉండుట వలన చర్మం యొక్క అధిక భాగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా సీరంను చాలా తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు. ఒక డ్రాప్పర్ లేదా ఇతర మార్గాల సహాయంతో ఉపయోగిస్తారు. చర్మాన్ని శుభ్రపరచిన తర్వాత మాత్రమే మాయిశ్చరైజర్ రాయాలి. అప్పుడు పదార్థాలు చొచ్చుకుపోవడానికి సహాయం చేస్తుంది.పడుకొనే సమయంలో చర్మం యొక్క పునర్ యవ్వనీకరణ జరుగుతుంది. కాబట్టి నిద్రపోయే ముందు సీరంని ఉపయోగించడం మంచిది.

సీరంను వాడిన తరువాత మాయిశ్చరైజర్ ని ఉపయోగించాలి. మాయిశ్చరైజర్ ని చర్మానికి రాసే సమయంలో బొటనవేలు నియమం అనుసరించి చేయాలి. మాయిశ్చరైజర్ ని అవసరాల కోసం ఎప్పుడైనా ఉపయోగించవచ్చు.

సీరం మరియు మాయిశ్చరైజర్ యొక్క జీవితకాలం

సీరం మరియు మాయిశ్చరైజర్ యొక్క జీవితకాలం

సీరం యొక్క జీవితకాలం మాయిశ్చరైజర్ కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సీరంలో శక్తివంతమైన పదార్ధాలు ఉంటాయి. అయితే ఆ పదార్ధాలు నీటిలో కరుగుతాయి. సీరంను సరిగ్గా నిల్వ చేస్తే సుమారు 6 నెలల నుండి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. సీరంను కాంతికి బహిర్గతం లేకుండా చల్లని మరియు పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. మాయిశ్చరైసర్స్ సుదీర్ఘ కాలం నిల్వ ఉంటాయి. ఇది నిల్వ రకాన్ని బట్టి మారుతుంది.

English summary

Facial Serum Vs Facial Moisturiser - What's The Difference?

Even then, there are some sections of people who don't have the knowledge of what they are using on the skin. This article might help them. Read on to know the difference between a moisturiser and a serum.
Story first published: Sunday, October 8, 2017, 13:00 [IST]