For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంలో మంట, వాపు, దురద తగ్గించే 15 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Mallikarjuna
|

మన శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం. మన శరీరాన్నంతటని ఎండ, వాన, గాలి నుండి కాపాడేది చర్మం. మన శరీరంలోని అన్ని అవయవాల కంటే అతి సున్నితమైనది కూడా చర్మమే.

రోజు రోజుకి వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతుండటం వల్ల ఆరోగ్య దుష్ప్రభావాలే కాదు, చర్మంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. వాతావరణంలోని కాలుష్యం, వేడి, వల్ల సూర్యకిరణాల నుండి వెలువడే యూవికిరణాల వల్ల చర్మం మరింత డ్యామేజ్ అవుతున్నది.

మన చర్మం చాలా సున్నితంగా ఉంటుంది, కాబట్టి, దాన్ని ఆరోగ్యంగా చూసుకోవల్సిన బాధ్యత మనదే. ఎండ, యూవీకిరణాల బారిన పడకుండా చర్మాన్ని కాపాడుకోవాలి. లేదంటే, చర్మం మరింత డ్యామేజ్ అవుతుంది. సన్ రేస్, కాలుష్యం, ఇతర పొల్యూషన్ కారణంగా చర్మం నిర్జీవంగా, మురికిగా తయారవుతుంది. దాంతో సెన్సిటివ్ స్కిన్ కాస్తా హార్డ్ గా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చర్మం ఎర్రగా కందిపోవడం లేదా ఆ ప్రదేశంలో ఎక్కువ మంట పెట్టడం జరుగుతుంటుంది.

15 Effective Home Remedies For Burning Sensation Of The Skin

ఈ బర్నింగ్ సెన్షేషన్ కు కారణం స్కిన్ ఇన్ఫ్లమేషన్. కాబట్టి, ఇన్ఫ్లమేషన్ వల్ల చర్మం మరింత డ్యామేజ్ కాకుండా కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో డ్యామేజ్ కాస్తే ఉండవచ్చు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల చర్మం ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది.

స్కిన్ ఇన్ఫ్లమేషన్ కు గురైనప్పుడు, చర్మం ఎర్రగా కదిపోవడం, చర్మంలో మంట, దురద, వాపు, నొప్పి ఉంటుంది. ఈ లక్షణాలున్న స్కిన్ ఇన్ఫ్లమేషన్ కు కారణాలు అనేకం..వాటిలో కొన్ని..

కాలిన గాయాలు, బొబ్బలను నయం చేసే 15 వంటింటి చిట్కాలుకాలిన గాయాలు, బొబ్బలను నయం చేసే 15 వంటింటి చిట్కాలు

1) ఎక్కువగా ఎండలో తిరగడం:

ఎక్కువ సమయం ఎండలో బయట తిరగడం వల్ల, రెగ్యులర్ గా సన్ స్క్రీన్ ఉపయోగించకపోవడం వల్ల స్కిన్ ఇన్ఫ్లమేషన్ కు కారణం అవుతుంది.

2) అలర్జీలు:

ఈ రోజుల్లో డస్ట్ అలర్జీ చాలా సాధరణమైపోయింది. ఈ కారణగా చర్మం ఎర్రగా, దురదగా అనిపిస్తుంది. వీటిలో వేటిని మనం తప్పించుకోలేము .

3) కీటకాలు లేదా చీమలు కుట్టడం వల్ల:

కొన్ని రకాల కీటకాలు కుట్టినప్పుడు వెంటనే చర్మం ఎర్రగా మారడం, వాపు, మంట ఏర్పడుతుంది. దాంతో స్కిన్ ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది.

4) కొన్ని రకాల మొక్కలు లేదా మూలికలను ముట్టుకున్నప్పుడు దురద, చీకాకు:

కొన్ని రకాల కెమికల్ ప్లాంట్స్ ముట్టుకున్నప్పుడు స్కిన్ అలర్జీకి కారణం అవుతుంది. అలాంటి మొక్కలకు దూరంగా ఉండటమే మంచిది.

5) చర్మ సమస్యలు :

ఎగ్జిమా, పోరియోసిస్ వంటి కొన్ని రకాల చర్మ సమస్యల కారణంగా చర్మంలో చీకాకు, దురద, మంట , వీటిలో ఏకారణం వల్ల అయినా స్కిన్ ఇన్ఫ్లమేసన్ మరియు రెడ్ నెస్ కు , దురదకు కారణం అవ్వొచ్చు. కొన్ని సందర్బాల్లో దురద మంట ఎక్కువగా ఉంటుంది.

చర్మంలో దురద, బర్నింగ్ సెన్షేషన్ తగ్గించుకోవడానికి కొన్ని న్యాచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

1) అలోవెరా:

1) అలోవెరా:

చర్మంలో మంట, వాపు గురించి మాట్లాడినప్పుడు, అలోవెరాకు మించిన రెమెడీ మరోకటి లేదు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా చర్మానికి ఉపశమనం కలిగించి, మంట, వాపులను తగ్గిస్తాయి .

కావలసినవి:

- కలబంద జెల్ 1 టేబుల్ స్పూన్

విధానం:

1) కొంత అలోవెర జెల్ తీసుకుని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి మర్ధన చేయాలి.

2) మంట, ఇన్ఫ్లమేషన్ తగ్గే వరకూ రోజులో కొన్ని సార్లు అప్లై చేయాలి.

2) నిమ్మ రసం:

2) నిమ్మ రసం:

నిమ్మకాయలు కూలింగ్ ఎఫెక్ట్ ను ఆస్ట్రిజెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది చర్మాన్ని కూల్ గా మార్చి, చర్మంలో మంట, ఎరుపును తగ్గిస్తుంది.

కావలసినవి:

- 1 నిమ్మకాయ

- ఒక స్వచ్ఛమైన రుమాలు

విధానం:

1) శుభ్రమైన గిన్నెలో 1 నిమ్మకాయ రసం పిండుకోవాలి.

2) దానిలో వస్త్రాన్ని ముంచి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి.

3) వోట్మీల్:

3) వోట్మీల్:

వోట్మీల్ చర్మానికి చల్లదనం అందిస్తుంది. చర్మంలో దురద, మంట నుండి ఉపశమనం కలిగించి, వాపును కూడా తగ్గిస్తుంది.

కావలసినవి:

- 1 కప్ వోట్మీల్

- నీళ్లు 2 కప్పులు

విధానం:

1) నీటిలో రెండు కప్పుల వోట్మీల్ ను వేసి నానబెట్టాలి.

2) తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి మర్దన చేయాలి

చర్మంపై అసహ్యంగా కనిపించే కాలిన మచ్చలు నివారించే రెమిడీస్..!చర్మంపై అసహ్యంగా కనిపించే కాలిన మచ్చలు నివారించే రెమిడీస్..!

4) పసుపు:

4) పసుపు:

పసుపులో అద్భుతమైన యాంటీ బాక్టీరియల్ మరియు యాంటి ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దాంతో ఆ ప్రాంతంలో మంట, వాపు తగ్గుతుంది.

కావలసినవి:

- 1-అంగుళాల పసుపు వేరు

- 1 టేబుల్ స్పూన్ నీరు

విధానం:

1) పసుపును తీసుకుని, నీళ్ళు జోడించి మెత్తగా పేస్ట్ లా కలుపుకోవాలి

2) ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతానికి వర్తింప చేసి 15 నిమిషాలు తర్వాత శుభ్రం చేసుకోవాలి

5) చమోమిలే టీ:

5) చమోమిలే టీ:

ఈ టీ ఒక పెద్ద యాంటీ ఫంగల్ ఏజెంట్, ఇది అంటువ్యాధి నుండి ఏ చికాకును తక్షణమే ఉపశమనం చేస్తుంది. ఇది తక్షణమే బర్నింగ్ సంచలనాన్ని తగ్గిస్తుంది, ఎరుపును తగ్గిస్తుంది.

కావలసినవి:

- 1 చమోమిలే టీ బ్యాగ్

- 1 కప్పు వేడి నీళ్ళు

- శుభ్రంగా ఉండే చిన్న క్లాత్ పీస్

విధానం:

1) వేడి నీటిలో చమోమిలే టీ సిద్ధం చేసి, చల్లబరచాలి.

2) శుభ్రంగా ఉన్న వస్త్రాన్ని చిన్న ముక్కలు చేసి చమోమెలీ టీలో డిప్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి.

6) ఆపిల్ సైడర్ వినెగర్:

6) ఆపిల్ సైడర్ వినెగర్:

యాపిల్ సైడర్ వినెగర్లో ఉన్న యాసిడ్స్ బర్నింగ్ సెన్షేషన్ తగ్గిస్తుంది.చర్మంలో మంటను, వాపు, ఎరుపును తగ్గిస్తుంది.

కావలసినవి:

- ఆపిల్ సైడర్ వినెగార్ 1 టేబుల్ స్పూన్

- 1 కప్పు నీళ్ళు

- శుభ్రంగా ఉన్న వస్త్రం

విధానం:

1) ఒక కప్పు నీటిలో ఆపిల్ సైడర్ వెనిరగ్ ను కలపాలి

2) ఈ వాటర్ లో క్లాత్ ను డిప్ చేసి, తర్వాత దాన్ని చర్మంపై ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి.

7) లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్:

7) లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్:

లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్లో కూలింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది చర్మంను స్మూత్ గా చల్లగా మార్చుతుంది. ఇందులో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మంలో మంటను దురద, వాపుల నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

కావలసినవి:

- లావెండర్ ఆయిల్ రెండు చుక్కలు

- ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్

విధానం:

1) ఆలివ్ నూనెతో పాటు లావెండర్ నూనెను కలపండి.

2) ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతానికి సమానంగా అప్లై చేసి మసాజ్ చేయండి.

8) కలేన్ద్యులా ఎసెన్షియల్ ఆయిల్:

8) కలేన్ద్యులా ఎసెన్షియల్ ఆయిల్:

కలేన్ద్యులా ఆయిల్ ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాన్ని కలిగి ఉంది. ఇది చర్మంలో వాపు, ఎరుపు తగ్గిస్తుంది.

కావలసినవి:

- 3-4 చుక్కల కలెన్డ్యులా ఎసెన్షియల్ ఆయిల్

- ఒక గ్లాసు నీళ్ళు

- ఒక క్లీన్ వస్త్రం

విధానం:

1) ఒక పాన్ లో ఒక గ్లాసు నీళ్ళు పోసి వేడి చేయాలి.

2) కలేన్ద్యులా నూనె జోడించండి.

3) ఈ మిశ్రమానికి వస్త్రాన్ని ముంచండి మరియు ప్రభావిత ప్రాంతానిలో అప్లై చేయాలి. రెండు మూడు సార్లు రిపీట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

9) శాండ్వుడ్ పౌడర్:

9) శాండ్వుడ్ పౌడర్:

గంధపు పొడి చాలా చల్లగా ఉంటుంది. ఇది వెంటనే ఎరుపు మరియు దురద చర్మం నుండి ఉపశమనం పొందుతుంది. రోజ్ వాటర్ ను కలపడం వల్ల సన్ బర్న్ నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.

కావలసినవి:

- గంధపు పొడి 2 టీస్పూన్లు

- గులాబీ నీళ్ళు 2 టేబుల్ స్పూన్లు

విధానం:

1) పేస్ట్ చేయడానికి రెండు పదార్ధాలను కలపండి.

2) ప్రభావిత ప్రాంతానికి ఈ పేస్ట్ ని అప్లై చేయండి.

3) కొద్ది సేపటి తర్వాతచల్లటి నీటితో కడగడం.

10) బిట్టర్ గార్డ్:

10) బిట్టర్ గార్డ్:

ఇది రుచిలో చాలా చేదుగా ఉండవచ్చు. కానీ చేదులోనే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది దురద తగ్గుతుంది మరియు చర్మంను చల్లబరుస్తుంది.

కావలసినవి:

1/2 కాకరకాయను ముక్కలుగా చేసుకోవాలి.

- నీళ్ళు

విధానం:

1) కాకరకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకూ కొన్ని నీళ్ళవేసి ఉడికంచుకోవాలి.

2) వాటిని తీసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

3) చర్మం మీద అప్లై చేసి 20 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి.

11) దాల్చిన చెక్క:

11) దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో నయం చేసే గుణాలు అధికంగా ఉన్నాయి. స్కిన్ రాషెస్ మరియు ఎర్రగా కందిన చర్మం మీద అప్లై చేస్తే బ్యాక్టీరియా వల్ల వచ్చిన ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా నివారిస్తుంది. త్వరగా నయం చేస్తుంది.

కావలసినవి:

- 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్

- నిమ్మరసం 1 టేబుల్ స్పూన్

విధానం:

1) రెండు పదార్థాలను కలిపి మృదువైన పేస్ట్ లా కలుపుకోవాలి.

2) ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి, 15 నిముసాలు అలాగే ఉంచాలి.

3) 15 నిముషాల తర్వాత నీటితో కడగాలి.

12) టమాటో పురీ:

12) టమాటో పురీ:

టమోటోల్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి,. ఇవి చర్మంలో బర్నింగ్ సెన్షేషన్ తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేసన్ రెడ్ నెస్ తగ్గిస్తుంది.

కావల్సినవి:

- 1 పచ్చి టమోటా

విధానం:

1) బ్లెండర్లో టమోటా ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

2) ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి

13) హెన్నా ఆకులు:

13) హెన్నా ఆకులు:

హెన్నా, లేదా గోరింటాకు శరీరంలో వేడి తగ్గిస్తుంది, దాంతో చర్మంలో మంటలు తగ్గుతాయి. అలాగే స్కిన్ రెడ్ నెస్, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

కావలసినవి:

- డ్రై హెన్నా లీవ్స్ (ఎండిన గోరింటాకు)

- కొబ్బరి నూనె 1 టీస్పూన్

విధానం:

1) డ్రై హెన్నా లీవ్స్ ను పొడి చేసుకోవాలి.

2) ఈ పొడికి కొంచెం నీళ్ళు కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

3) తర్వాత ముందుగా ప్రభావిత ప్రాంతంలో కొద్దిగా హెన్నా పౌడర్ ను అప్లై చేయాలి. తర్వాత హెన్నా మిశ్రమాన్ని అప్లై చేయాలి.

4) 15 నిముషాల తర్వాత కడిగేయాలి.

14) బాసిల్ లీవ్స్

14) బాసిల్ లీవ్స్

తులసి ఆకుల్లో గొప్ప ఔషధ గుణాలున్నాయి. ఇది చర్మంను స్మూత్ గా మార్చుతుంది. చర్మంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

కావలసినవి:

- ఎండిన తులసి ఆకులు కొద్దిగా

- కొన్ని నీళ్ళు

విధానం:

1) తులసి ఆకులను పొడిచేసి, నీళ్ళు కలిపి పేస్ట్ చేయాలి.

2) తర్వాత ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి

3) అరగంట తర్వాత కడిగేయాలి.

15) ఐస్:

15) ఐస్:

చర్మం ఎరుపు మరియు మంటను తగ్గించడానికి ఉత్తమ పరిష్కారం. ఐస్ క్యూబ్స్ తో ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తూ సున్నితంగా మర్ధన చేయాలి. అయితె ఎక్కువ సమయం చేయకుండా జాగ్రత్తపడాలి

కావలసినవి:

- 1 ఐస్ క్యూబ్

- ఒక క్లీన్ క్లాత్

విధానం:

1) ఒక శుభ్రమైన వస్త్రంలో ఐస్ క్యూబ్ ను ఉంచి, ప్రభావిత ప్రాంతంలో మర్ధన చేయాలి. రోజులో ఇలా చాలా సార్లు చేస్తుంటే, చర్మంలో వాపు, ఎరుపు తగ్గుతుంది.

English summary

15 Effective Home Remedies For Burning Sensation Of The Skin

15 Effective Home Remedies For Burning Sensation Of The Skin,Home remedies are the best when treating burning sensation on the skin. Read to know what are these home remedies that help in treating burning sensation
Desktop Bottom Promotion