ఫేస్ బ్లిస్టర్స్ ను ఎఫెక్టివ్ గా పోగొట్టే హోం రెమెడీస్

Posted By:
Subscribe to Boldsky

ఫేస్ బ్లిస్టర్స్ అంటే ఏంటి? ఫేస్ బ్లిస్టర్ మొటిమల్లాంటివే..అయితే ఇవి మొటిమలు నీటితో, పస్ (చీము) లేదా బ్లడ్ తో ముఖంలో ఏర్పడే మొటిమలను ఫేస్ బ్లిస్టర్ అంటారు.

ఫేస్ట్ బ్లిస్టర్ ఎందుకు వస్తాయి? ఇవి ఎక్కువ కాలుష్యం వల్ల, చర్మంలో ఎక్కువ మురికి చేరడం వల్ల, చర్మంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవం వల్ల ఫేస్ బ్లిస్టర్స్ వస్తుంటాయి. బ్లడ్ బ్లిస్టర్స్ అనే మొటిమలు చాలా అరుదుగా వస్తుంటాయి . బ్లడ్ బ్లిస్టర్స్ తో బాదపడే వారు తప్పకుండా డెర్మటాలజిస్ట్ ను కలవాల్సి ఉంటుంది.

ఈ ఫేస్ బ్లిస్టర్స్ యవ్వనారంభ దశలో కూడా వస్తుంటాయి. వీటిని నార్మల్ ఫేస్ బ్లిస్టర్ అని అంటుంటారు. ఈ నార్మల్ ఫేస్ బ్లిస్టర్స్ ను ఇంట్లోనే నేచురల్ హోం రెమెడీస్ తో నివారించుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

ఫీవర్ బ్లిస్టర్స్(జ్వరంతో వచ్చే నోటి పొక్కులు) నయం చేసే సింపుల్ రెమెడీస్..!

1. ఆపిల్ సైడర్ వెనిగర్ :

1. ఆపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇవి ఫేస్ బ్లిస్టర్స్ ను ఎఫెక్టివ్ గా పోగొడుతాయి. కాటన్ బాల్ ను డిప్ చేసి బ్లిస్టర్ మీద అప్లై చేయాలి. వెనిగర్ సన్ బర్న్, పెయిన్, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇందులో అసిటిక్ యాసిడ్ కలిగి ఉండటం వల్ల నయం చేసే గుణం చాల వేగంగా ఉంటుంది. వైట్ వెనిగర్ లో కొన్ని పేపర్ టవల్స్ ను డిప్ చేసి , బ్లిస్టర్స్ ఉన్న ప్రదేశంలో పెట్టాలి . పెపర్ టవల్ కు ఉన్న వైట్ వెనిగర్ బ్లిస్టర్స్ మీద అలాగే కొంత సేపు ఉండటం వల్ల అవి ఎండి పోతాయి.

2. కలబంద:

2. కలబంద:

కలబందలో ఉండే ఔషధగుణాల వల్ల బ్లిస్టర్స్ యొక్క చికాకును మరియు సలుపును తగ్గిస్తుంది. అలోవెరలో ఉండే కెమికల్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంతో పాటు బ్లిస్టర్స్ ను తగ్గిస్తుంది. బ్లిస్టర్స్ చాలా రోజుల నుంచి బాధిస్తుంటే, వాటి మీద అలోవెర జెల్ ను అప్లై చేయాలి. అలోవెర జెల్ లో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు బ్లిస్టర్స్ ను క్లీన్ చేస్తాయి, ఇన్ఫెక్షన్స్ నివారిస్తాయి.

3. కోకనట్ ఆయిల్ :

3. కోకనట్ ఆయిల్ :

చర్మసమస్యలను నివారించడంలో కోకనట్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఫేస్ బ్లిస్టర్స్ ను నివారించడంలో కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెను వేడి చేసి, గోరువెచ్చగా బ్లిస్టర్స్ మీద అప్లై చేయాలి. మసాజ్ చేయకూడదు. ఈ చిట్కా ఆలస్యంగా పనిచేసినా, ఎఫెక్టివ్ ఫలితాలను ఇస్తుంది.

సమ్మర్ లో చెమటకాయలు నివారించే ఎఫెక్టివ్ రెమిడీస్..!

4. గ్రీన్ టీ:

4. గ్రీన్ టీ:

గ్రీన్ టీ ఫేస్ బ్లిస్టర్స్ మీద పనిచేస్తుంది. గ్రీన్ టీని స్ట్రాంగ్ గా తయారుచేసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న గ్రీన్ టీలో కాటన్ డిప్ చేసి బ్లిస్టర్స్ మీద అప్లై చేయాలి. మిగిలిన గ్రీన్ టీని ఫ్రిజ్ లో నిల్వ చేసుకుని, చల్లగా కూడా ఉపయోగించుకోవచ్చు.

5. డియోడరెంట్ :

5. డియోడరెంట్ :

డియోడరెంట్ తీసుకుని ఫేస్ బ్లిస్టర్స్ మీద రోల్ చేయాలి. బయటకు వెళ్ళే ప్రతి సారి డియోడరెంట్ ను ముఖంలోని మొటిమల మీద సున్నితంగా మర్దన చేయడం వల్ల బ్లిస్టర్స్ బర్న్ అవుతాయి.

6. విటమిన్ ఇ ఆయిల్ :

6. విటమిన్ ఇ ఆయిల్ :

విటమిన్ ఇ ఆయిల్ క్యాప్స్యూల్స్ ను బ్రేక్ చేసి అందులోని ఆయిల్ ను బ్లిస్టర్స్ మీద అప్లై చేయాలి. కొద్ది సేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాంటే, కానిండ్యుల్ ఆయిల్ తో విటమిన్ ఇ ఆయిల్ మిక్స్ చేసి బ్లిస్టర్స్ మీద అప్లై చేయాలి.

English summary

Home Remedies To Treat Face Blisters; A Very Common Skin Problem Among Both Men & Women

If you are having a normal face blister at its adolescent stage, then here are the home remedies that you can try to treat it. Blisters do not dry easily. Applying these home remedies on your face blister will make it burst faster with less side effects.
Story first published: Friday, August 18, 2017, 12:24 [IST]
Subscribe Newsletter