మెడ నలుపును మాయం చేసే అద్భుత హోం రెమెడీస్

By: Mallikarjuna
Subscribe to Boldsky

పిగ్మెంటేషన్ అంటే, సహజంగా మనకున్న చర్మ రంగులో మార్పు రావడం. అది వాతావరణ కాలుష్యం వల్ల కావచ్చు లేదా ఎండవల్ల కావచ్చు లేదా సరైన పరిశుభ్రత పాటించకపోవడం, ఆరోగ్యానికి సంబంధించిన ఇతర సమస్యల వల్ల చర్మం నల్లగా మారడాన్ని పిగ్మెంటేషన్ అంటారు.

చాలా సందర్బాల్లో ముఖానికి తీసుకునే జాగ్రత్తలు, మెడకు తీసుకోకపోవడం వల్ల ముఖం తెల్లగా మెడ వద్ద నల్లగా కనబడుతుంది. ఫేషియల్ స్కిన్ అందంగా కనబడుట వల్ల మెడ నలుపును పోగొట్టుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది.

home remedies to treat dark neck

ముఖం మాత్రమే కాదు, మెడను కూడా ముఖం శుభ్రం చేసుకున్న ప్రతి సారి మెడకు కూడా క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అవసరం అవుతుంది. కానీ పదికి ఎనిమిది మంది మాత్రం మెడను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫలితంగా డార్క్ నెక్ ఇంకా కొంచెం నల్లగా కనబడుతుంది.

ఒక వారంలో మెడ నలుపును మాయం చేసే బేకింగ్ సోడా చిట్కాలు ..!!

ఇటువంటి డార్క్ నెక్ సమస్యతో మీరూ బాధపడుతుంటే కనుకు, ఈ ఆర్టికల్ మీకు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. డార్క్ నెక్ సమస్యను నివారించుకోవడానికి హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ రెమెడీస్ అన్నింటిలో స్కిన్ బ్లీచింగ్ ఏజెంట్ కలిగి ఉంటాయి. చర్మంను కాంతివంతంగా మార్చడంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. కాబట్టి, మెడనలుపు తగ్గించుకోవడానికి వీటిని నిరభ్యరంతంగా ఉపయోగించుకోవచ్చు.

మరి ఆలస్యం చేయకుండా ఈ హోం రెమెడీస్ గురించి తెలుసుకుని, వెంటనే వీటిని ట్రై చేయండి..

1. సాండిల్ ఉడ్ పౌడర్:

1. సాండిల్ ఉడ్ పౌడర్:

ఈ సంప్రదాయ హోం రెమెడీలో విటమిన్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి కొన్ని అద్భుతాలను చేస్తుంది. మెడ నలుపు సమస్యను తగ్గిస్తుంది.

2. కోకనట్ మిల్క్ :

2. కోకనట్ మిల్క్ :

మరో ట్రైడ్ అండ్ టెస్టెడ్ హోం రెమెడీ ఇది. మెడనలుపును తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ముందుగా మెడను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత కోకనట్ మిల్క్ లో కాటన్ ప్యాడ్ ను డిప్ చేసి మెడ చుట్టూ అప్లై చేస్తూ సున్నితంగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

3. బియ్యం పిండి:

3. బియ్యం పిండి:

బియ్యం పిండిలో చర్మాన్ని తెల్లగా మార్చే గుణాలున్నాయి. ఇది చర్మ రంగున్న చాలా ఎఫెక్టివ్ గా మార్చుతుంది. అందుకోసం ఒక టీస్పూన్ బియ్యం పిండికి రెండు టీస్పూన్ల డిస్టిల్డ్ వాటర్ కలపి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మెడకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత మర్ధన చేస్తూ చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. నిమ్మరసం:

4. నిమ్మరసం:

నిమ్మరసం న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్. ఈ రెమెడీని ఉపయోగించడం వల్ల మెడ నలుపు తగ్గుతుంది. నిమ్మరసంలో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి మెడకు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

5. స్ట్రాబెర్రీస్:

5. స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. మెడనలుపు తగ్గిస్తుంది. రెండు మూడు స్ట్రాబెర్రీస్ తీసుకుని, మెత్తగా చేసి మెడకు అప్లై చేయాలి. మెడ చూట్టు అప్లై చేసి 20 నిముసాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కేవలం 10 రోజుల్లో స్వచ్ఛమైన చర్మ సౌందర్యం

6. టమోటో:

6. టమోటో:

చర్మంను తెల్లగా మార్చడంలో టమోటో గ్రేట్ రెమెడీ. టమోటోను మెత్తగా పేస్ట్ చేసి మెడకు పూర్తిగా అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత మంచిచల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఇస్తుంది.

7. బంగాళదుంప:

7. బంగాళదుంప:

బంగాళదుంప న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్. ఇది మెడనలుపును తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ హోం రెమెడీని నేరుగా ఉపయోగించవచ్చు. బంగాళదుంపను కట్ చేసి, మెడ నల్లగా ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తూ మర్దన చేయాలి. ఇలా నలుపు తగ్గే వరకూ రోజూ ప్రయత్నించవచ్చు.

8. బాదం ఆయిల్:

8. బాదం ఆయిల్:

బాదం నూనె ఒక న్యాచురల్ రెమెడీ. మెడనలుపు తగ్గించడంలో రెగ్యులర్ గా ఈ నూనెను మెడకు అప్లై చేయవచ్చు. నూనెను గోరువెచ్చగా చేసి తర్వాత మెడకు అప్లై చేయాలి. ఈ పద్దతిని రోజూ ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.

9. ఆరెంజ్ పీల్ పౌడర్:

9. ఆరెంజ్ పీల్ పౌడర్:

విటమిన్ సి చర్మంలో గొప్ప మార్పులు తీసుకొస్తుంది. ఆరెంజ్ పీల్ పౌడర్ మెడనలుపును తగ్గిస్తుంది. అందుకోసం అరటీస్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుని, అందులో ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి మెడకు పూర్తిగా అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

home remedies to treat dark neck | how to treat dark neck | ways to treat dark neck | tips to treat dark neck in telugu

home remedies to treat dark neck | how to treat dark neck | ways to treat dark neck | tips to treat dark neck in telugu .Check out for some of the best home remedies that can actually work wonders on your dark neck problem.
Subscribe Newsletter