మగవాళ్ళ చర్మంలో మొటిమలను క్లియర్ చేసే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By: Mallikarjuna
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలనే కోరుకుంటారు. ఈ మద్య కాలంలో మహిళలతో పాటు,పురుషుల్లో కూడా బ్యూటీ కాంన్షియస్ పెరిగింది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మగవారిలో కొన్ని దీర్ఘకాలిక స్కిన్ మరియు హెయిర్ సమస్యలు బాధిస్తున్నాయంటారు. చర్మ సమస్యల్లో ముఖ్యంగా మొటిమలతో బాధపడేవారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి. మగవారి ముఖంలో మొటిమలను తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి.

ఎక్కువగా ఎండలో, దుమ్ము, దూళి కాలుష్యంలో తిరగడం, చర్మంగ్రంథుల్లోని నూనె గ్రంథుల నుండి ఎక్కువగా సెబమ్ విడుదలవ్వడం వల్ల మొటిమలు పెరుగుతాయి.

పురుషుల కొరకు స్పెషల్ సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్

treat stubborn pimples men

బాధాకరమైన విషయం ఏంటంటే, మొండిగా మారిన ఈ మొటిమలు ముఖం, మెడ, చేతులు మరియు భుజాలకు వ్యాప్తి చెందుతాయి.

అందువల్ల, ఈ మొటిమలను నివారించుకోవడం కోసమని డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్లడం, లేదా ఖరీదైన కాస్మోటిక్స్ ను కొనడానికి ముందుగా ఈ సింపుల్ హోం మేడ్ ట్రీట్మెంట్ ను ప్రయత్నించి చూడండి.

ఇంట్లోనే మనకు తెలియని సౌందర్య సాధనాలెన్నో ఉన్నాయి. వీటిని మగవారు రోజువారి బ్యూటీ కోసం ఉపయోగించినట్లైతే మొటిమలను పూర్తిగా నివారించుకోవచ్చు.

నోట్: మగవారు ఈ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ను తప్పకుండా ఫాలో అవ్వడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలను పొందుతారు. మరి వెంటనే మొటిమలను క్లియర్ చేసే హోం రెమెడీస్ గురించి తెలుసుకుందామా..

1. ఐస్

1. ఐస్

మొటిమలను నివారించడంలో ఐస్ ఒకటి. ఇది మొటిల సైజు, నొప్పి, ఎర్రగా ఉన్నవాటిని , దీర్ఘకాలంగా బాధిస్తున్న మొటిమలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఐస్ చాలా చల్లగా ఉండటం వల్ల మొటిమల మీద చాలా త్వరగా రియాక్ట్ అవుతుంది, కొద్ది రోజులకు మొటిమలు మాయం అవుతాయి.

పద్దతి

 • మొదట మీ చర్మం శుభ్రం చేసుకోవాలి.
 • తర్వాత ఐస్ క్యూబ్స్ ను క్లీన్ గా ఉండే కాటన్ క్లాత్ లో పెట్టి చుట్టాలి. ఐస్ క్యూబ్స్ ను నురుగా మొటిమల మీద రుద్ద కూడదు.
 • టిష్యు పేపర్లో లేదా హ్యాండ్ టవల్లో వ్యాప్ చేసి తర్వాత మొటిమల మీద ఉంచాలి. కొన్ని నిముషాల తర్వాత తీసేయాలి.

2.టూత్ పేస్ట్

2.టూత్ పేస్ట్

మగవారు ముఖంలో మొటిమలను నివారించుకోవడం కోసం పింపుల్ ట్రీట్మెంట్ బాగా సహాయపడుతుంది. టూత్ పేస్ట్ ను మొటిమలను అప్లై చేయడం వల్ల మొటిమలను తొలగిపోతాయి. అయితే టూత్ పేస్ట్ ను మొటిమలకు ఎలా అప్లై చేయాలో తెలుసుండాలి.

పద్దతి

 • ముందుగా ముఖం శుభ్రంగా కడిగి, తేమలేకుండా తుడవాలి. మొటిమల మీద అప్లై చేయడానికి కేవలం తెల్లటి టూత్ పేస్ట్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఎక్స్ ట్రా ఫ్లేవర్స్ తీసుకోకూడదు.కాటన్ ప్యాడ్ లో కొద్దిగా పేస్ట్ ను తీసుకుని, తర్వాత నేరుగా మొటిమల మీద మాత్రమే అప్లై చేయాలి. రాత్రుల్లో అప్లై చేయడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
 • రాత్రుల్లో అప్లై చేయడానికి ఇష్టపడని వారు, పగటి పూట్ అప్లై చేసి 15 నిముషాల తర్వాత తొలగించాలి. తడి టవల్ తో తుడవటం వల్ల పేస్ట్ తొలగిపోతుంది. వారంలో రెండు మూడు సార్లు ఇలా టూత్ పేస్ట్ ను మొటిమలన మీద అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

3. వెల్లుల్లి :

3. వెల్లుల్లి :

మొటిమలను మచ్చలను తొలగించడానికి అద్భుతమైన రెమెడీ వెల్లుల్లి, వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ గుణాలున్నాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ రక్త ప్రసరణ మీద నేరుగా ప్రభావం చూపుతుంది.

పద్దతి:

వెల్లుల్లిని నేరుగా మొటిమల మీద అప్లై చేయడం వల్ల మొటిమల మీద మంట కలుగుతుంది. అందువల్ల దీనికి కొద్దిగా నీరు చేర్చాలి. మొదట వెల్లుల్లి పాయలకు పొట్టు తీసి పేస్ట్ చేయాలి. అందులో కొద్దిగా టేబుల్ సాల్ట్ వేయాలి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద అప్లై చేసి 15 నిముషాల తర్వాత తొలగించాలి. గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

4. యాపిల్ సైడర్ వెనిగర్:

4. యాపిల్ సైడర్ వెనిగర్:

మగవారిలో మొటిమల నివారణకు యాపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ కొనేటప్పుడు అది స్వచ్చమైనది, రసాయనాలు కలపనిది ఎంపిక చేసుకోవాలి.

పద్దతి:

 • ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లో మూడు టీస్పూన్ల్ నీళ్లు ఒక బౌల్లో తీసుకోవాలి.
 • అందులో కాటన్ డిప్ చేసి మొండి మొటిమల మీద అప్లై చేయాలి. కాటన్ డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 • తర్వాత మాయిశ్చరైజర్ మరియు యాంటీ పింపుల్ క్రీమ్ ను అప్లై చేయాలి.

5. ఎగ్ వైట్

5. ఎగ్ వైట్

మగవారిలో మొటిమలను నివారించడానికి గుడ్డులోని తెల్లసొన బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్స్, అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ మొటిమల మీద గ్రేట్ గా పనిచేస్తుంది. మరి ఎగ్ వైట్ ను ఏవిధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..

పద్దతి

 • ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత తడిలేకుండా టవల్ తో తుడవాలి.
 • తర్వాత గుడ్డులోని తెల్ల సొనను మొటిమల మీద అప్లై చేయాలి.
 • 5 నిముషాల తర్వాత మరో కోట్ లాగా అప్లై చేసి, పూర్తిగా డ్రై అయిన తర్వాత ముఖం శుభ్రం చన్నీటితో కడిగేసుకోవాలి.

మెన్స్ స్పెషల్: అబ్బాయిలు పాటించాల్సిన స్కిన్ కేర్ హ్యాబిట్స్

6. బొప్పాయి

6. బొప్పాయి

పురుషుల్లో మొటిమలను నివారించుకోవడానికి బొప్పాయి బాగా సహాయపడుతుంది. ఇది ముఖంలో అదనపు నూనెను తొలగిస్తుంది. స్కిన్ లేయర్ ను ఎక్స్ ఫ్లోయేట్ చేసి, యాంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగినది. మొటిమలు, మచ్చలు లేకుండా చేస్తుంది.

పద్దతి:

 • బొప్పాయి ముక్కలను మెత్తగా పేస్ట్ చేయాలి.
 • మొటిమల మీద నేరుగా అప్లై చేయాలి.
 • అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.
 • ఇలా రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

7. తేనె

7. తేనె

తేనె చర్మానికి న్యాచురల్ మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. పురుషుల్లో మొటిమలను నివారిస్తుంది. మంచి ఫలితాలను ఇస్తుంది

పద్దతి:

 • స్వచ్చమైన తేనెను తీసుకోవాలి
 • అందులో కాటన్ డిప్ చేయాలి. తర్వాత నేరుగా మొటిమల మీద అప్లై చేయాలి.
 • అరగంట తర్వాత వేడి నీటితో కడిగేసుకోవాలి.

8. గ్రీన్ టీ :

8. గ్రీన్ టీ :

గ్రీన్ టీలో గల్లేట్, ఎపిగల్లెట్, ఎపిక్యాట్చసిన్స్, వంటివి పురుషుల చర్మంలో మొండిగా మారిన మొటిమల మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. గ్రీన్ టీ మొటిమలతో పాటు, మచ్చలను కూడా తొలగిస్తాయి.

పద్దతి

 • ఒక కప్పు గ్రీన్ టీ తయారుచేసి, పక్కన పెట్టి చల్లారనివ్వాలి
 • చల్లగా మారిన తర్వాత గ్రీన్ టీ బ్యాగ్ ను మొటిమల మీద అప్లై చేయాలి.
 • 15 నిముషాల తర్వాత టీబ్యాగ్స్ ను తీసేసి తేమను పూర్తిగా పొడి బట్టతో తుడిచేయాలి

9. ఆస్పిరిన్

9. ఆస్పిరిన్

మొండిగా ఉన్న మొటిమలను నివారించడంలో ఆస్పిరిన్ గొప్పగా పనిచేస్తుంది. అది ఎలాగో తెలుసుకోండి.

పద్దతి:

 • ఒక ఆస్పిరిన్ మాత్రను తీసుకుని, మూడు టేబుల్ స్పూన్ల నీటిలో కలపాలి.
 • ఈ మిశ్రమాన్ని నేరుగా మొటిమల మీద అప్లై చేయాలి.
 • కాటన్ తో లేదా చేతి వేళ్ళతో మొటిమలకు మాత్రమే అప్లై చేయాలి.
 • ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుని, తేమను పూర్తిగా తుడవాలి.
 • ఈ ఆస్పిరిన్ ట్రీట్మెంట్ ను వారానికొకసారి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Home Remedies To Treat Stubborn Pimples For Men

With easy ingredients available at home or local hypermarkets - these treatments can be added to men's daily skin care routine, in order to completely get rid of the pimples for good.
Story first published: Saturday, September 16, 2017, 8:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter