ఇంట్లోనే తయారుచేసుకొనే డి-టానింగ్ ఫేస్ ప్యాక్స్ ని మీరు తప్పకుండా ప్రయత్నించాలి.

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

వేసవికాలం సమీపిస్తోంది, దానితో పాటు సూర్యుడు కూడా కఠినంగా ఉండవచ్చు. మీరు కొన్నిఅనివార్య కారణాల వల్ల బయటకి వెలసివచ్చిన్నపుడు సూర్యుడి వేడివలన మీ చర్మం యొక్క రంగు మారవచ్చు. అలాగని బయటకి వెళ్లకుండా ఉండలేము కదా! కాబట్టి, ఈ సమస్యను పరిష్కరించి మీకు సహాయం చేయడానికి ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే డి-టానింగ్ ఫేస్ ప్యాక్లను ఎలా తయారుచేసుకోవాలో మీకు తెలియజేస్తున్నాము.

టాన్ ఏర్పడటం అనేది అందరి విషయంలో జరుగుతుంది మరియు చర్మానికి పట్టిన ఈ టాన్ వదిలించుకొని తిరిగి అసలు చర్మాన్ని పొందడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. తరచూ టాన్ ఏర్పడటం వలన మీ చర్మం పూర్తిగా రంగుని కోల్పోయి చూడటానికే అసహ్యంగా మారవచ్చు. కాబట్టి సూర్యుడు మరియు టాన్ నుండి మీ చర్మానికి ఏర్పడే కఠినమైన ప్రభావాన్ని వదిలించుకోవడానికి, మీ చర్మాన్ని రక్షించుకోవడానికి మీరు తప్పకుండా ఈ ప్యాక్లను ప్రయత్నించి చూడండి.

ఇక్కడ మీ ఇంట్లోనే డి-టానింగ్ ఫేస్ ప్యాక్లు ఎలా తయారు చేయవచ్చనే దాని గురించి వివరాలు వున్నాయి. తెలుసుకోవడానికి మరింత చదవండి.

అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కి బెస్ట్ శనగపిండి ఫేస్ ప్యాక్స్

1. బొప్పాయి ప్యాక్:

1. బొప్పాయి ప్యాక్:

మీరు ఒక రోజు మొత్తం సూర్యుడి ఎండలో బాగా గడిపి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక బొప్పాయి ముక్క ని తీసుకొని మీ ముఖం మీద రుద్దండి మరియు 10 నిమిషాల పాటు అలానే ఆరనిచ్చి తర్వాత కడిగేయండి. ఇది మీ చర్మం కోల్పోయిన రంగుని తిరిగి తెస్తుంది. మరియు మీ చర్మం మీద సూర్యుని యొక్క దుష్ప్రభావాలను తగ్గిస్తుంది.

2. వోట్మీల్ ప్యాక్:

2. వోట్మీల్ ప్యాక్:

ఈ ప్యాక్ ని తయారుచేయడానికి వోట్మీల్ పొడిని 5 నిముషాల పాటు పాలలో నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోవడానికి ముందు అది మృదువుగా వుండేలా చూసుకోండి తర్వాత మీ ముఖం మొత్తం రాసుకొని కాస్సేపు వదిలేయండి. ఇది చర్మం మీద వున్న నలుపుని తొలగించడంలో సహాయపడుతుంది. పాల లో లాక్టిక్ యాసిడ్ చర్మం తెల్లబడటంలో సహాయపడుతుంది.

కాంతివంతమైన చర్మానికి ఆరెంజ్-లెమన్ ఫేస్ ప్యాక్

3. టమోటో ప్యాక్:

3. టమోటో ప్యాక్:

టమోటాని బాగా నలిపి లేదా పేస్ట్ ను కొంచం పెరుగుతో కలిపి మీ ముఖం మీద రాయండి. టమోటాలో తేలికపాటి బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది, పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది, డి-టానింగ్ ని పోగొట్టడానికి చాలా చక్కటి ప్యాక్ ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ ప్యాక్ ని మీ ముఖం మీద 10-15 నిముషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో కడిగేయండి.

4. శనగపిండి ప్యాక్:

4. శనగపిండి ప్యాక్:

శనగపిండి లో కొన్ని పాలని కలిపి పేస్ట్ లాగ సిద్ధం చేసుకొని దీనిని మీ ముఖానికి స్కర్బ్ లాగా ఉపయోగించండి. పాలు స్కర్బ్ ఎక్కువ మంట కాకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది. శనగపిండి మీ చర్మం యొక్క రంగుని మార్చడంలో చాలా బాగా పనిచేస్తుంది.

5. నిమ్మ రసం ప్యాక్:

5. నిమ్మ రసం ప్యాక్:

నిమ్మరసం అనేది సహజ బ్లీచింగ్ ఏజెంట్లలో ఒకటి. నిమ్మరసాన్ని తేనెతో పాటు కలిపి దీనిని డి-టానింగ్ ప్యాక్ లాగా ఉపయోగించండి. దీనిని మీ ముఖానికి రాసి 15 నిమిషాలు వదిలేసి తర్వాత దానిని కడగాలి. క్రమంగా ఈ పద్ధతిని అనుసరించడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చును.

English summary

Homemade De-tanning Face Packs You Should Try

Homemade De-tanning Face Packs You Should Try,Here are some de-tanning face packs you can try making at home.
Subscribe Newsletter