చీముపట్టిన మొటిమలకి నిజంగా ప్రభావం చూపించే ఇంట్లో తయరుచేసుకునే మాస్క్ లు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

రసికారుతున్న మొటిమలు మీ చర్మంపై ఉన్న వెంట్రుకల కుదుళ్ళవద్ద మృతకణాలు, మురికి, జిడ్డు పేరుకుపోవటం వలన జరుగుతుంది. ఇది మొటిమలలో తీవ్రరూపం మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ బాధాకర, వికారంగా ఉండే చర్మస్థితికి చాలామంది బలయినవాళ్ళే.

ఈ స్థితిలో, చర్మం పైపొర కింద నొప్పిపుట్టే సిస్టులు ఏర్పడతాయి. ఇదే మిగతా రకం మొటిమల నుంచి ఈ స్థితిని వేరుచేస్తుంది. అందుకనే, సాధారణ మొటిమలకి పనిచేసే చికిత్సలు ఈ ప్రత్యేక స్థితికి పనిచేయకపోవచ్చు.

Homemade Masks For Cystic Acne That Actually Work,

సిస్టిక్ మొటిమలకి తప్పక పనిచేసే ఇంట్లో తయారుచేసుకునే మాస్క్ లు, ఇంటిచిట్కాలు ఈ రకపు మొటిమలను చికిత్స చేయడానికి, మీరు కాస్మెటిక్ ఉత్పత్తులను, విధానాలను అనుసరించవచ్చు లేదా మా ఈ సహజమైన ఇంటి చిట్కాలు పాటించవచ్చు.సిస్టిక్ మొటిమలను తగ్గించడానికి అనేక ఇంటి పద్ధతులు చాలా ప్రభావకరంగా ఉన్నాయని కూడా తేలింది.

సహజపదార్థాలైన వంటసోడా,యాపిల్ సిడర్ వెనిగార్, పసుపుపొడి, టీ ట్రీ నూనె వంటివి ఇతర ప్రభావవంతమైన పదార్థాలతో కలిపి వాడినప్పుడు ఈ చిరాకుగా ఉండే చర్మస్థితిని పోరాడటానికి సాయపడతాయి.

ఈ పదార్థాలను ముఖంపై వాడే మాస్క్ లలో కలిపితే మీ చర్మంపై విషపదార్థాలు, పేరుకున్న చర్మగ్రంథులను తెరచి, ఈ స్థితిని మెరుగుపరుస్తుంది.

ఇక్కడ అలాంటి ఇంట్లో తయారుచేసుకునే మాస్క్ ల తయారీ విధానాలు అందించాం.

గమనిక ; మీకు ఈ సిస్టిక్ మొటిమల సమస్య తీవ్రంగా ఉంటే, ఈ కింది మాస్క్ లను వాడేముందు చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించటం మంచిది.

1. టీ ట్రీ నూనె మరియు కొబ్బరినూనెతో పసుపుపొడిని కలపండి

1. టీ ట్రీ నూనె మరియు కొబ్బరినూనెతో పసుపుపొడిని కలపండి

-చిటికెడు పసుపుపొడిని 3 చుక్కల టీ ట్రీ నూనెను మరియు 1 చెంచా కొబ్బరినూనెను కలపండి.

-ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట సరిగా రాయండి.

-5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీరుతో కడిగేసి కొంచెం మాయిశ్చరైజర్ రాసుకోండి.

-వారానికి రెండుసార్లు ఇలా చేసి ఉపశమనం పొందండి.

2. నిమ్మరసంతో ముల్తానీ మట్టి

2. నిమ్మరసంతో ముల్తానీ మట్టి

- ఈ మాస్క్ ను ½ చెంచా ముల్తానీమట్టిని 1చెంచా నిమ్మరసంతో కలపండి.

- ఈ మాస్క్ ను సమస్య ఉన్నచోట మొత్తం రాయండి, 5నిమిషాలు అలానే ఉంచండి.

- గోరువెచ్చని నీటితో మొహం కడిగేయండి.

-ఈ పద్ధతిని వారానికోసారి పాటించి ఈ సమస్యతో పోరాడండి.

3. ఆలోవెరా జెల్ తో వంటసోడా

3. ఆలోవెరా జెల్ తో వంటసోడా

- ½ చెంచా వంటసోడాను 1చెంచా ఆలోవెరా జెల్ తో కలపండి.

- ఈ మాస్క్ ను సమస్య ఉన్నచోట పట్టించి, 5నిమిషాల పాటు వదిలేయండి.

- దీన్ని గోరువెచ్చని నీటితో కడగండి.

- వారానికి మూడుసార్లు ఈ పద్ధతిని పాటించి మంచి ఫలితాలను పొందండి.

4. బంగాళదుంప తొక్కతో గ్రీన్ టీ

4. బంగాళదుంప తొక్కతో గ్రీన్ టీ

- బంగాళదుంపల తొక్కలను మిక్సీలో వేసి పేస్టును చేయండి. దీన్ని 1చెంచా గ్రీన్ టీ పొడితో కలపండి.

-ఈ మాస్క్ ను సమస్య ఉన్నచోట రాసి, 5నిమిషాలు ఉండనివ్వండి.

- గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

- వారానికి రెండుసార్లు ఈ మాస్క్ వేసుకుని చిరాకు తెప్పించే మొటిమల సమస్య నుండి ఉపశమనం పొందండి.

5. ఎప్సం సాల్ట్ తో వేపనూనె

5. ఎప్సం సాల్ట్ తో వేపనూనె

-నాలుగు చుక్కల వేపనూనెతో చిటికెడు ఎప్సం సాల్ట్ కలపండి.

- ఈ మాస్క్ ను సమస్య ఉన్నచోట ముఖంపై రాయండి.

-15 నిమిషాలు ఎండనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- వారానికి 2-3 సార్లు ఈ పద్ధతి పాటించి ఫలితాలు మీరే చూడండి.

6. చామంతి టీ మరియు జునిపర్ సుగంధ నూనె

6. చామంతి టీ మరియు జునిపర్ సుగంధ నూనె

- 1 చెంచా చామంతి టీను 3-4 చుక్కల జునిపర్ సుగంధ నూనె మరియు 3 చుక్కల ఆలివ్ నూనెతో కలపండి.

- ఈ వచ్చిన మాస్క్ ను సమస్య ఉన్నచోట పట్టించి 5నిమిషాలపాటు అలా వదిలేయండి.

- తేలికపాటి క్లెన్సర్ మరియు గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- వారానికోసారి ఈ చిట్కా పాటించి సిస్టు మొటిమలను తొలగించుకోండి.

 7. తేనెతో పుదీనా ఆకులు

7. తేనెతో పుదీనా ఆకులు

-చేతిలో పట్టినన్ని పుదీనా ఆకులను మిక్సిలో వేసి పొడి చేయండి.

- ఈ పొడిని 1చెంచా తేనెతో కలపండి.

- తయారైన మాస్క్ ను సమస్య ఉన్నచోట రాసి 5 నిమిషాలన్నా బాగా ఎండనివ్వండి.

- గోరువెచ్చని నీటితో కడిగి మళ్ళీ ఇదే మాస్క్ ను 2-3 రోజుల తర్వాత వాడి మంచి ఫలితాలు పొందండి.

8. యాపిల్ సిడర్ వెనిగర్ తో గుడ్డు తెల్లసొన

8. యాపిల్ సిడర్ వెనిగర్ తో గుడ్డు తెల్లసొన

-ఈ మాస్క్ ను ఇబ్బంది ఉన్నచోటంతా రాసి, 5 నిమిషాలు ఉండనివ్వండి.

- గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగండి.

- ఈ పద్ధతిని వారానికోసారి పాటించి రసికారుతున్న మొటిమల నుంచి ఉపశమనం పొందండి.

English summary

Homemade Masks For Cystic Acne That Actually Work

Cystic acne occurs when the hair follicles in your skin get clogged up by dead skin cells, dirt and oil. Natural ingredients, like baking soda, apple cider vinegar, turmeric powder, tea tree oil, etc., when used in combination with other equally effective components can be used for combating this unpleasant skin condition..
Story first published: Friday, December 1, 2017, 9:30 [IST]
Subscribe Newsletter