సమ్మర్లో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే హోం మేడ్ షుగర్ స్ర్కబ్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

పంచదార ఒక నిత్యవసర వస్తువు. ఇది ఒక న్యాచురల్ పదార్థం. పంచదార స్వీట్స్ తయారుచేయడానికి , కాఫీ, టీలకు మాత్రమే కాదు, ఇందులో సౌందర్య ప్రయోజనాలు కూడా అధికంగా ఉన్నాయి. పంచదారలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. చర్మ సౌందర్యానికి ఉపయోగించినప్పుడు సహజగుణాలను అదిస్తుంది .

పంచదార చర్మ సౌందర్యంలో ఉపయోగించడానికి ముఖ్య కారణం, చర్మం కాంతివంతంగా మరియు ఆరోగ్యంగా మారుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో చర్మం ఎండకు బహిర్గతం అవుతుంది.సూర్యుని నుండి వెలువడే హానికరమైన యూవీ కిరణాలు, వేడి వాతావరణం వల్ల చర్మసౌందర్యం పాడవుతుంది. ఇటువంటి పరిస్థితిలో వారానికి ఒక్క సారైనా చర్మానికి పంచదారను ఉపయోగించడం ఉత్తమం. ఇది చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది. మొటిమలను నివారించి, అనేక చర్మ సమస్యలకు పరిస్కారం చూపుతుంది.

facial scrubs

చర్మ సంరక్షణ కోసం పంచదారను ఎండకాలంలోనే కాదు, అన్ని సీజన్లలో ఉపయోగించుకోవచ్చు. పంచదారతో ఇంట్లోనే స్వయంగా కొన్ని హోం మేడ్ షుగర్ స్ర్కబ్స్ ను తయారుచేసుకోవచ్చు.ఈ షుగర్ స్ర్కబ్ వల్ల స్కిన్ ట్యాన్ నివారించుకోవచ్చు. అన్నిసీజన్స్ లోనూ చర్మాన్నికాంతివంతంగా, తేమగా ఉంచుకోవచ్చు.

ఇంట్లో తయారుచేసుకుని షుగర్ స్ర్కబ్స్ 100శాతం న్యాచురల్ గుణాలు కలిగినవి. ఇందులో చర్మ అందాన్ని మెరుగుపరిచి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు అధికంగా ఉన్నాయి. మరి ఈ హోం మేడ్ షుగర్ స్ర్కబ్ ను ఎలా ఉపయోగించాలి, అందులోని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

1. పంచదార-ఆలివ్ ఆయిల్ స్ర్కబ్:

1. పంచదార-ఆలివ్ ఆయిల్ స్ర్కబ్:

పంచదార మరియు ఆలివ్ ఆయల్ చర్మానికి అద్భుతాలను చేస్తుంది. వేసవి సీజన్ లో ఈ హోం రెమెడీ మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ రెండు పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల స్కిన్ ట్యాన్ ను ఎఫెక్టివ్ గా తగ్గించి , చర్మంను తేమగా ఉంచుతుంది.

ఎలా తయారుచేయాలి.

ఒక టీస్పూన్ పంచదార తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. వారానికొకసారి స్ర్కబ్ చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

2. పంచదార -నిమ్మరసంతో స్క్రబ్

2. పంచదార -నిమ్మరసంతో స్క్రబ్

పంచదారను నిమ్మరసంతోం మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. ఈ హోం రెమెడీ సన్ ట్యాన్ నివారిస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది.

ఎలా తయారుచేసుకోవాలి.

ఒక టేబుల్ స్పూన్ పంచదార తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ హోం మేడ్ షుగర్ స్ర్కబ్ సన్ టాన్ తగ్గుతుంది. ముఖ్యంగా వేసవి సీజన్ లో చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.

3. పంచదార మరియు కాఫీ గింజల స్ర్కబ్

3. పంచదార మరియు కాఫీ గింజల స్ర్కబ్

పంచదార మరియు కాఫీ గింజల్లో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మంలోని మలినాలను తొలగిస్తాయి. చర్మంలోపల దాగుండే టాక్సిన్స్ ను పూర్తిగా నివారిస్తాయి.

ఎలా తయారుచేయాలి:

ఒక టీస్పూన్ పంచదార మరియు కాఫీ గింజలు పొడి తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ హోం మేడ్ షుగర్ స్ర్కబ్ వల్ల చర్మంలో జిడ్డు తగ్గుతుంది. టాక్సిన్స్ తొలగిపోతాయి.

4. పంచదార, వెనీలా, విటమిన్ ఇ స్క్రబ్

4. పంచదార, వెనీలా, విటమిన్ ఇ స్క్రబ్

పంచదారలో చర్మఆరోగ్యానికి కావల్సిన న్యూట్రీషియన్స్ మరియు చర్మాన్ని మ్రుదువుగా మార్చే గుణాలు అధికంగా ఉన్నాయి. వెనీలాను విటమిన్ ఇ ఆయిల్ తో మిక్స్ చేసి చర్మానికి స్క్రబ్ చేయడం వల్ల చర్మం తేమగా, మాయిశ్చరేజ్డ్ గా మారుతుంది.

ఎలా తయారుచేయాలి:

పంచదార, వెనీలా, ఒక్కో టేబుల్ స్పూన్ తీసుకుని,అందులో రెండు విటమిన్ ఇ క్యాప్స్యుల్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈమిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ హోం మేడ్ షుగర్ స్ర్కబ్ చర్మంలోని టాక్సిన్ ను తొలగించి స్కిన్ సాప్ట్ గా మార్చుతుంది.

5. పంచదార మరియు ల్యావెండర్ ఆయిల్ స్క్రబ్ :

5. పంచదార మరియు ల్యావెండర్ ఆయిల్ స్క్రబ్ :

పంచదారలో ఉండే సహజగుణాలు, ల్యావెండర్ ఆయిల్లో ఉండే యాంటీఫంగల్ లక్షణాలు చర్మం ఫ్రెష్ గా ఉండేలా, తేమతో ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో దీని ప్రభావం ఎక్కువ

ఎలా తయారుచేయాలి:

ఒక టేబుల్ స్పూన్ పంచదార తీసుకుని, అందులో ఒక అరటేబుల్ స్పూన్ ల్యావెండర్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడగడం వల్ల సాప్ట్ గా మరియు ఫ్రెష్ లుక్కింగ్ స్కిన్ పొందవచ్చు.

6. పంచదార, ఓట్ మీల్ హనీ స్ర్కబ్

6. పంచదార, ఓట్ మీల్ హనీ స్ర్కబ్

ఓట్ మీల్స్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. ఈ రెండు పదార్థాల్లో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు క్లెన్సింగ్ గుణాలను కలిగి చర్మంను శుభ్రపరచడంతో పాటు, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఎలా తయారుచేయాలి:

ఒక టీస్పూన్ పంచదార , ఒక టీస్పూన్ ఉడికించిన ఓట్ మీల్ తీసుకుని, అందులో రెండు టీస్పూన్ల తేనె మిక్స్ చేయాలి. ఈ హోం మేడ్ షుగర్ స్క్రబ్ మురికిని తొలగిస్తుంది. ఎప్పుడూ చర్మం తేమగా ఉండటానికి సహాయపడుతుంది.

7. పంచదార మరియు వాటర్ మెలోన్ జ్యూస్

7. పంచదార మరియు వాటర్ మెలోన్ జ్యూస్

వాటర్ మెలోన్ లో గ్రేట్ గా అమినో యాసిడ్స్ ఉన్నాయి. ఇది సన్ ట్యాన్ నివారిస్తాయి. స్కిన్ మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది.పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్స్, వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది. .

ఎలా తయారుచేయాలి:

ఒక టేబుల్ స్పూన్ పంచదార తీసుకుని, అందులో రెండు టేబుల్ స్పూన్ల వాటర్ మెలోన్ జ్యూస్ మిక్స్ చేయాలి. స్ర్కబ్ ప్యాడ్ తీసుకుని, ముఖానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. డ్రైగా మారిన తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి.

English summary

Homemade Sugar Scrubs To Perk Up Your Skin In Summer

Take a look at these miraculous homemade sugar scrubs for that strikingly beautiful summer skin.
Story first published: Wednesday, May 31, 2017, 14:30 [IST]
Subscribe Newsletter