డ్రై స్కిన్ నివారణకు హాట్ థెరఫీ మరియు ఫేస్ ప్యాక్స్

Posted By:
Subscribe to Boldsky

పొడి చర్మానికి రకరకాల ఫేస్‌ప్యాక్‌లు వేయడం కంటే సింపుల్‌గా ఆయిల్‌ థెరపీ ఇస్తే చాలు. చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి బాదం నూనె కాని ఆలివ్‌ ఆయిల్‌ కాని రాయాలి. ముఖంతోపాటు పాదాలు, అరచేతులు, మోచేతుల వంటి చర్మం పొడిబారి గట్టిపడిన ప్రదేశాల్లో కూడా ఆయిల్‌ రాయాలి. ఆయిల్‌ రాయడానికి ముందు చర్మం మీద దుమ్ము, ధూళి లేకుండా సబ్బుతో కడగాలి.

రోజూ పదినిమిషాల సేపు హాట్‌థెరపీ ఇస్తే చర్మంలోని నూనెగ్రంథులు ఉత్తేజితమై పొడి చర్మానికి స్వాంతన కలుగుతుంది. హాట్‌ థెరపీ చాలా సింపుల్‌... గోరువెచ్చటి నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇదే హాట్‌థెరపీ. ఉదయం స్నానం చేయడానికి ముందు ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి చేస్తే చాలు. చర్మంలో మురికి తొలగిపోయి, మొటిమలు, మచ్చలు, డ్రై స్కిన్ సమస్యలు తగ్గడంతో పాటు, చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మారుతుంది. ప్యాక్‌ల విషయానికి వస్తే...

వారం రోజుల్లో సాఫ్ట్ స్కిన్ పొందే అమేజింగ్ ఐడియా..

పొడి చర్మానికి ఎగ్ -ఆరెంజ్ జ్యూస్

పొడి చర్మానికి ఎగ్ -ఆరెంజ్ జ్యూస్

ఒక కోడిగుడ్డు సొనలో, ఒక టీ స్పూన్‌ కమలారసం, ఒక టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి.

డ్రై స్కిన్ నివారించే అటిపండు ఫేస్ ప్యాక్

డ్రై స్కిన్ నివారించే అటిపండు ఫేస్ ప్యాక్

బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడ మీద చర్మం నల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపు కూడా వదులుతుంది.

చలికాలంలో వేధించే పొడిచర్మాన్నికి గుడ్ బై చెప్పండిలా..

డ్రై స్కిన్ నివారణకు గ్రేప్ సీడ్ ఆయిల్

డ్రై స్కిన్ నివారణకు గ్రేప్ సీడ్ ఆయిల్

పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్‌సీడ్‌ ఆయిల్‌ బాగా పని చేస్తుంది. దేనితోనూ కలపాల్సిన అవసరం లేకుండా ఆయిల్‌ను యథాతథంగా ఒంటికి రాసి మర్దన చేస్తే చాలు. ఇది ఇప్పుడు అన్ని సూపర్‌మార్కెట్లలోనూ దొరుకుతోంది.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

బాదం నూనెలో విటమిన్ ఇ, విటమిన్ ఎ అధికంగా ఉన్నాయి. ఇందులో అద్భుతమైన ఆరోమా వాసన మరియు గ్రేట్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మరో బెనిఫిట్ కూడా ఉంది, బాగా నిద్రపడుతుంది.

పొడి చర్మానికి కుకుంబర్ ఫేస్ ప్యాక్:

పొడి చర్మానికి కుకుంబర్ ఫేస్ ప్యాక్:

కీరదోసకాయ ఫేస్ ప్యాక్ చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. కీరదోస రసాన్ని లేదా పేస్టును ముఖానికి మెడకు పట్టించి బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.

డ్రై స్కిన్ కు చెక్ పెట్టి, ముఖం కాంతివంతంగా..సాప్ట్ గా మెరిపించుకోవడానికి వెన్నపూత..!!

బొప్పాయి ఫేస్ ప్యాక్:

బొప్పాయి ఫేస్ ప్యాక్:

బొప్పాయి నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ . ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది మరియు ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . డ్రై స్కిన్ లో మాయిశ్చరైజింగ్ కంటెంట్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే బొప్పాయి గుజ్జుకు కొద్దిగా పైనాపిల్ రసం జోడించి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం రంద్రాలు మాయమవుతాయి.

చర్మానికి స్వచ్ఛమైన ఆముదం

చర్మానికి స్వచ్ఛమైన ఆముదం

పొడిచర్మం తీవ్రంగా బాధిస్తున్నప్పుడు... అనేక రకాల కాంబినేషన్‌లతో ప్యాక్‌లు తయారు చేసుకోవడానికి సాధ్యం కాకపోతే చర్మానికి స్వచ్ఛమైన ఆముదం కాని అవొకాడో ఆయిల్‌ కాని రాసి మర్దన చేయాలి.

English summary

Hot Therapy and Face Packs for Dry Skin

Hot Therapy and Face Packs for Dry Skin, how to treat dry skin with hot Therapy,
Story first published: Tuesday, July 11, 2017, 17:14 [IST]
Subscribe Newsletter