మీ చర్మానికి చింతపండు రాసి చూడండి అద్భుత మార్పులు కలుగుతాయి

By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

చింతపండు మీ చర్మం కోసం చాలా మంచిది. దాని ప్రయోజనాలను ఆస్వాదించటానికి తినకూడదు. చింతపండు రుచి పుల్లగా ఉన్నా చర్మానికి రాస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. మీ చర్మ సంరక్షణకు రెగ్యులర్ గా చింతపండు ఉపయోగించి ఆ వ్యత్యాసాన్ని చూడండి.

మీ చర్మంపై చింతపండు గుజ్జును ఉపయోగించాలి. దీనిని నేరుగా ఉపయోగించకుండా చింతపండుతో తయారుచేసిన ప్యాక్ లను ఉపయోగించాలి. ఈ ప్యాక్ లను సిద్ధం చేయటానికి కొంచెం సమయం పడుతుంది. కానీ మీ చర్మంపై దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంది.

చింతపండుని డైలీ డైట్ లో చేర్చుకోవాలనడానికి స్ట్రాంగ్ అండ్ హెల్తీ రీజన్స్..!

ఫేస్ ప్యాక్ రెసిపీ I: చర్మం కాంతివంతంగా మరియు మెరవటానికి

ఫేస్ ప్యాక్ రెసిపీ I: చర్మం కాంతివంతంగా మరియు మెరవటానికి

కావలసిన పదార్ధాలు

చింతపండు

వేడి నీరు

పసుపు పొడి

విధానం

1. వేడి నీటిలో చింతపండును 15 నిమిషాల పాటు నానబెట్టాలి.

2. నానిన చింతపండు నుంచి గుజ్జును తీయాలి. (ఒక స్పూన్)

3. చింతపండు గుజ్జులో చిటికెడు పసుపు పొడి కలపాలి.

4. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు చర్మానికి పట్టించాలి.

5. ఒక గంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

చింతపండు ఫేస్ ప్యాక్ రెసిపీ II: స్క్రబ్బర్

చింతపండు ఫేస్ ప్యాక్ రెసిపీ II: స్క్రబ్బర్

కావలసిన పదార్ధాలు

చింతపండు

వేడి నీరు

పెరుగు

కల్లు ఉప్పు

విధానం

1. వేడి నీటిలో చింతపండును 15 నిమిషాల పాటు నానబెట్టాలి.

2. నానిన చింతపండు నుంచి గుజ్జును తీయాలి. (ఒక స్పూన్)

3. చింతపండు గుజ్జుకు అరస్పూన్ పెరుగు కలపాలి.

4. చింతపండు,పెరుగు మిశ్రమానికి చిటికెడు ఉప్పు కలపాలి.

5. మీ చర్మ రంద్రాల ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని రాసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

6. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగి మాయిశ్చరైజర్ రాయాలి.

7. పెరుగు అలర్జీ ఉన్నవారు పచ్చి పాలను ఉపయోగించవచ్చు.

చింతపండు ఫేస్ ప్యాక్ రెసిపీ III: మొటిమలు -ఫ్రోన్ స్కిన్ కోసం

చింతపండు ఫేస్ ప్యాక్ రెసిపీ III: మొటిమలు -ఫ్రోన్ స్కిన్ కోసం

కావలసిన పదార్ధాలు

చింతపండు

వేడి నీరు

నిమ్మరసం

చక్కెర

వంట సోడా

విధానం

1. వేడినీటిలో చింతపండును 15 నిముషాలు నానబెట్టి గుజ్జు తీయాలి.

2. రెండు స్పూన్ల చింతపండు గుజ్జులో అరస్పూన్ నిమ్మరసం,బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.

3. ఈ పేస్ట్ కి ఒక స్పూన్ పంచదార కలపాలి.

4. ఈ పేస్ట్ ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయాలి.

5. 15 నుంచి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

6. ఈ ప్యాక్ ని వారంలో మూడు సార్లు వేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

చింతపండు ఫేస్ ప్యాక్ రెసిపీ IV: స్కిన్ టోనర్

చింతపండు ఫేస్ ప్యాక్ రెసిపీ IV: స్కిన్ టోనర్

కావలసిన పదార్ధాలు

చింతపండు

నీరు

లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

విధానం

1. చింతపండును నీటిలో వేసి ఒక గంట పాటు ఉడికించాలి. ఆలా నీరు రంగు మారేవరకు ఉడికించాలి.

2. చల్లారిన తర్వాత నీటిని వడకట్టాలి.

3. చల్లారిన చింతపండు నీటిలో 5 నుంచి 8 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి.

4. ఈ చింతపండు స్కిన్ టోనర్ ని తయారుచేసుకొని ఒక వారం పాటు నిల్వ చేసుకోవచ్చు.

5. ప్రతి రోజు మీ చర్మానికి చింతపండు టోనర్ ని ఉపయోగించవచ్చు.

6. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కి బదులుగా టీ ట్రీ ఆయిల్ ను కూడా ఉపయోగించవచ్చు.

చింతపండు ఫేస్ ప్యాక్ రెసిపీ V: ఇనిస్టెంట్ ప్రకాశం కోసం

చింతపండు ఫేస్ ప్యాక్ రెసిపీ V: ఇనిస్టెంట్ ప్రకాశం కోసం

కావలసిన పదార్ధాలు

చింతపండు

ముల్తానీ మిట్టి

గంధం పౌడర్

పెరుగు / పాలు

రోజ్ వాటర్

విధానం

1. వేడినీటిలో చింతపండును 15 నిముషాల పాటు నానబెట్టాలి.

2. సుమారుగా మూడు స్పూన్ల చింతపండు గుజ్జును తీయాలి.

3. చింతపండు గుజ్జులో మొదట పెరుగు/పాలు కలపాలి.

4. ఆ తర్వాత ఒక స్పూన్ ముల్తానీ మిట్టి, ఒక స్పూన్ గంధం పొడి కలపాలి.

5. ఈ పొడులను కలిపాక చింతపండు గుజ్జు చాలా మందంగా తయారవుతుంది. దీనిలో 5 నుంచి 10 చుక్కల రోజ్ వాటర్ వేసి కొంచెం పలుచగా చేసుకోవాలి.

6. ఇనిస్టెంట్ ప్రకాశం కోసం ఈ చింతపండు ప్యాక్ ని వేసుకోండి.

7. 45 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానము చేయండి.

English summary

Apply Tamarind On Your Skin | Apply Tamarind On Skin | How To Apply Tamarind On Skin | Tamarind For Skin

Add tamarind to your skincare routine now and you will see a big change in your skin.
Story first published: Sunday, November 12, 2017, 12:00 [IST]
Subscribe Newsletter