Latest Updates
-
ఫైబర్, కాల్షియం వంటి పుష్కలంగా రాగి సమోసా..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి -
ఇడ్లీ, దోశ, పెసరట్టు,అన్నం దేనికైనా అదిరిపోయే అల్లం మామిడి పచ్చడి..ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేస్తారు! -
తెలియని వ్యక్తులతో చాటింగ్ చేస్తున్నారా? హనీ ట్రాప్ ముఠాల వలలో పడితే జీవితమే నాశనం! -
బిర్యానీని మించిన రుచితో మటన్ కీమా రైస్.. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరు! -
వృషభం, కర్కాటక, సింహ రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 20 నుండి 26 మే 2026 వరకు -
రెస్టారెంట్ స్టైల్ మటర్ పనీర్ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటారు -
గ్రహాల కదలికలతో ఈ రాశుల వారికి నేడు అదృష్టం..అనుకోని ధనలాభం ఖాయం! -
నిద్రలో ఒక కాలు దుప్పటి బయట ఎందుకు ఉంటుందో తెలుసా? నిద్రలేమితో భాదపడేవాళ్లకు గుడ్ న్యూస్! -
మే 21న గురు పుష్య అమృత యోగం.. ఈ చిన్న మార్పులతో మీ ఆర్థిక కష్టాలు మాయం! -
పప్పు, అన్నం,రోటీలోకి అదిరిపోయే సైడ్ డిష్..భజ్జీ మిరపకాయల కూర రుచికి ఫిదా అవ్వాల్సిందే!
మీ ముఖంపై ఉన్న విషపదార్థాలను సముద్రపు ఉప్పుతో డీటాక్సిఫై చేసుకోవటం ఎలా
ప్రతిరోజూ, మీ చర్మం హానికరమైన విషపదార్థాలకి, మలినాలకి, కలుషితాలకి మరియు మట్టికి బలవుతుంది.అందుకే, అప్పుడప్పుడైనా మీ చర్మంపై విషపదార్థాల నుంచి దూరం చేసే డీటాక్సిఫికేషన్ ప్రక్రియ చేయాలి.
ప్రతిరోజూ, మీ చర్మం హానికరమైన విషపధార్థాలకి,మలినాలకి, కలుషితాలకి మరియు మట్టికి బలవుతుంది.
అందుకే, అప్పుడప్పుడైనా మీ చర్మంపై విషపదార్థాల నుంచి దూరం చేసే డీటాక్సిఫికేషన్ ప్రక్రియ చేయాలి.డీటాక్సిఫికేషన్, చర్మం మీదున్న దుమ్ము, శకలాలని తొలగించి, వికారమైన మొటిమలు మరియు మరకలుగల చర్మం నుంచి కాపాడి చర్మం యొక్క సహజ సౌందర్యాన్ని విజయవంతంగా పునరుద్ధరిస్తుంది.

మీ ముఖాన్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవడం ఎలా, డీటాక్సిఫికేషన్ కోసం మీరు బజారులో ఉన్న చాలా వాణిజ్య ప్రాధాన్యమైన ఉత్పత్తులను ప్రయత్నించచ్చు.కానీ ఈ ఉత్పత్తులు చాలా వరకు మంచి చేయకపోగా హాని కలిగించే రసాయన పధార్థాలతో నిండి ఉంటాయి.
అందుకే, బజారులో కొనే ఉత్పత్తుల కంటే, చర్మ డీటాక్సిఫికేషన్ ప్రయోజనం కోసం ఎన్నో ఏళ్ళ నుంచి వాడే సహజ పదార్థాన్ని మీరు ప్రయత్నించవచ్చు. మనం మట్లాడుకుంటుంది సముద్రపు ఉప్పు గురించి.
సముద్రపు ఉప్పులో ఉండే బ్యాక్టీరియా వ్యతిరేక అణువులు, మీ చర్మంలోని విషపధార్థాలని తొలగించి, చర్మాన్ని శుభ్రంగా మరియు స్పష్టంగా తయారుచేస్తాయి.పైగా ఈ అందమైన ఉపయోగానికి సముద్రపు ఉప్పుని అనేక విధాలుగా కూడా వాడచ్చు.
ఉన్న చాలా పద్ధతుల్లో తేలికైన,సమర్థవంతమైన కొన్ని పద్ధతులు ఇక్కడ రాశాం.

1) నీళ్ళతో సముద్రపు ఉప్పు
- అర చెంచా సముద్రపు ఉప్పుని ఒక గ్లాసు నిండా ఉన్న నీళ్ళలో పోసి బాగా కలపండి.
- ఈ ఇంట్లో చేసిన పదార్థంతో మీ మొహమంతా కడిగి, అలాగే ఒక 5 నిమిషాలు ఉంచి, గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయండి.
- మీ చర్మాన్ని డీటాక్సిఫికేషన్ చేసుకోడానికి ఈ పద్ధతిని ప్రతి వారం పాటించండి.

2) విటమిన్-ఇ తో సముద్రపు ఉప్పు
- విటమిన్-ఇ గుళికల నుంచి తీసిన నూనెలో ఒక చిటికెడు సముద్రపు ఉప్పు కలపాలి.
- ఆ ఫలితంగా వచ్చిన పదార్థాన్ని ముఖమంతా రుద్ది ఒక 10 నిమిషాలు ఉండనివ్వాలి.
- తరువాత గోరువెచ్చని నీళ్ళు మరియు మృదువైన సబ్బుతో కడిగేయాలి.
- ప్రతీ వారం ఈ ముద్దని వాడితే, మీ చర్మం మీద మృతకణాలని సమర్ధవంతంగా తొలగిస్తుంది.

3) సముద్రపు ఉప్పు ఆవిరి
- ఒక చెంచాడు సముదపు ఉప్పు ని ఒక గిన్నె నిండా నీళ్ళలో వేసి కొంచెం సేపు మరగనివ్వాలి.
- ఆ గిన్నెని స్టవ్ మీద నుంచి తీసేసి, బల్ల మీద పెట్టి అందులో నుంచి 5-10 నిమిషాలు వరకు ఆవిరి తీసుకోవాలి
- ఈ సముద్రపు ఉప్పు ఆవిరిని ఇలా వారానికొకసారి తీసుకుంటే, మీ చర్మం డీటాక్సిఫికేషన్ అయ్యి తాజాగా ఉంటుంది.

4) తేన తో సముద్రపు ఉప్పు
- ఒక అరచెంచా ఉప్పు ని 2 చెంచాల తేనెలో కలపాలి.
- ఫలితంగా వచ్చిన పదార్థాన్ని మీ చర్మమంతా రుద్ది, ఒక 10 నిమిషాలు ఎండబెట్టి, తరువాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి.
- విషపదార్థాలని నిర్మూలించి, కాంతివంతమైన చర్మం కోసం ఈ మాస్క్ని రెండు వారాలకొకసారి వాడండి.

5) బాదం నూనె మరియు ఓట్మీల్ తో సముద్రపు ఉప్పు
- ఒక చెంచా బాదం నూనెలో, చెరో అరచెంచా ఓట్మీల్ మరియు సముద్రపు ఉప్పుని కలపాలి.
- ఆ పదార్థాన్ని సబ్బులా వాడి ముఖమంతా సున్నితంగా రుద్దాలి.
- 5 నిమిషాల తరువాత, ఆ అవశేషాలని గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి.
- ఈ సముద్రపు ఉప్పు సబ్బు ని నెలకొకసారి వాడితే, ఇది మీ చర్మాన్ని సమర్ధవంతంగా డీటాక్సిఫై చేసి అందంగా మరియు యవ్వనంతో కనిపించేలా చేస్తుంది.

6) ఆలో వెరా జెల్ తో సముద్రపు ఉప్పు
- రెండు చెంచాల ఆలోవెర మరియు 1/2 చెంచా సముద్రపు ఉప్పుని కలిపి ఒక మిశ్రమం చేయాలి
- ఆ పదార్థాన్ని శుభ్రంగా కడిగిన ముఖం మీద రాసి, ఒక 10 నిమిషాలు తరువాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి.
- ఇది రెండు వారాలకి ఒకసారి వాడితే, మీ చర్మం మీద ఉండే కలుషితాలు మరియు మలినాలను తీసేస్తుంది.

7) గ్రీన్ టీ తో సముద్రపు ఉప్పు
- ఒక 1/2చెంచా సముద్రపు ఉప్పుని తీపి లేని ఒక కప్పు గ్రీన్ టీ తో కలపాలి.
- ఈ మిశ్రమాన్ని బాగా కలిపి చర్మమంతా రాయాలి. ఒక 5 నిమిషాలు అలానే ఉంచి తరువాత దాన్ని గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి.
- చర్మం గొప్పగా ఉండటం కోసం,ఈ నిర్దిష్టమైన పదార్థాన్ని నెలకి రెండు సార్లు వాడాలి.

8) ఆలివ్ నూనె తో సముద్రపు ఉప్పు
- ఒక చెంచా ఆలివ్ నూనె లో 1/2 చెంచా సముద్రపు ఉప్పుని కలపాలి.
- ఈ ఫలితంగా వచ్చిన పదార్థాన్ని ఒక 5 నిమిషాలు చర్మం మీద ఉంచి తరువాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి.
- ఈ మిశ్రమాన్ని, చర్మం మీద విషపదార్థాలు మరియు మలినాలు రాకుండా ఉండటానికి వారనికి ఒకసారి వాడండి.



Click it and Unblock the Notifications