For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరానికి, ముఖానికి నూనెమర్దనతో శుభ్రపర్చటం ఎలా?

|

నూనెతో శరీరాన్ని శుభ్రపర్చుకోవటం నేర్చుకునే ముందు,మీ చర్మానికి నూనెతో మర్దన ఎందుకు అవసరమో తెలుసుకోండి. ఈ కింది కారణాలు చదవండి.

మీ శరీరంలోనే అతిపెద్ద అవయవం అయిన చర్మానికి అన్నిటికన్నా ఎక్కువ సంరక్షణ చేయాలి. మరియు నూనెతో అభ్యంగనస్నానం చర్మాన్ని సంరక్షించడానికి ఆరోగ్యకరమైన విధానం.

<strong>గ్లోయింగ్ అండ్ సాప్ట్ స్కిన్ పొందడానికి డీప్ క్లెన్సింగ్ అలోవెర ఫేస్ వాష్ ..!!</strong>గ్లోయింగ్ అండ్ సాప్ట్ స్కిన్ పొందడానికి డీప్ క్లెన్సింగ్ అలోవెర ఫేస్ వాష్ ..!!

నూనె ద్రవరూపంలో ఉంటుంది కాబట్టి, చర్మంలో సులభంగా ఇంకి, పేరుకున్న మురికిని చర్మం నుంచి తొలగిస్తుంది.

నూనె మర్దన అన్నిరకాల చర్మాలపై చేయవచ్చు, ఫలితాలు కూడా లభిస్తాయి.

నూనెమర్దన శరీరాన్ని శుభ్రపర్చటమే కాక, శరీరానికి కావాల్సిన తేమను అందిస్తుంది.

నూనెతో అభ్యంగనస్నానానికి కేవలం ఒక నూనె మాత్రం సరిపోదు. మీ చర్మం రకాన్ని బట్టి, సరైన నూనెలు ఎంచుకుని, వాటిని కలిపి, ఈ పద్ధతిని పాటించాలి.

మీ చర్మసంరక్షణ రొటీన్లో నూనెతో మర్దనను చేర్చటానికి మీకు ఐదు బలమైన కారణాలున్నాయి, అందుకే దీన్ని వారానికి రెండు సార్లు చేయాలి.

<strong>చర్మంలో మలినాలను తొలగించడానికి ఓట్ మీల్ స్క్రబ్స్</strong>చర్మంలో మలినాలను తొలగించడానికి ఓట్ మీల్ స్క్రబ్స్

శుభ్రానికి సరైన నూనె నిర్ణయించుకోవడం

శుభ్రానికి సరైన నూనె నిర్ణయించుకోవడం

చర్మం శుభ్రపర్చుకోటానికి సరైన నూనె నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. మీ చర్మ రకాన్ని బట్తి, ఈ కింది నూనెలు ఎంచుకోండి.

మిశ్రమ చర్మరకం ; ఆముదం నూనె/ పొద్దుతిరుగుడు/ కొబ్బరి నూనెతో కలిపిన హేజెల్ నట్ నూనె

జిడ్డు చర్మం ; ఆముదం నూనె/ పొద్దుతిరుగుడు/ కొబ్బరి నూనెతో కలిపిన హేజెల్ నట్ నూనె

పొడిచర్మం ;ఆలివ్/ ఆముదం/హేజెల్ నూనెతో పోషణ అందించే నూనెలైన జొజుబా, అవిసె గింజలు, ఆర్గన్ లేదా అవకాడోలను కూడా కలపండి.

నూనెతో అభ్యంగన స్నానం మొదలుపెట్టడం

నూనెతో అభ్యంగన స్నానం మొదలుపెట్టడం

నూనెతో శుభ్రపరిచే ముందు మీ మొహాన్ని పొడిగా ఉంచుకోండి.నిజానికి, రోజు ముగిసాక మీరు అలసిపోయినప్పుడు, మీ ముఖంపై మేకప్ తొలగిపోయి ఉన్నప్పుడు, మొహాన్ని మరియు చర్మాన్ని నూనెతో శుభ్రం చేసుకోవటం మంచిది. ఇలా చేయటం వలన చర్మంపై పేరుకున్న దుమ్ము మరియు మురికిని నూనెలు లాగేసి, శుభ్రపర్చటానికి సులువుగా ఉంటుంది.

నూనెతో శుభ్రతకి కావాలసిన వస్తువులు

నూనెతో శుభ్రతకి కావాలసిన వస్తువులు

మంచిగా నూనెతో చర్మాన్ని శుభ్రపర్చుకోడానికి కేవలం నూనె ఉంటే చాలదు. మీకు ఒక శుభ్రమైన తెల్లటి గుడ్డ, గోరువెచ్చని నీరు కూడా కావాలి. ఒక గ్లాసులో వేడినీరు సిద్ధంగా ఉంచుకోండి, ఎందుకంటే నూనె రాసుకున్న వెంటనే ఇది మీకు అవసరమవుతుంది. మీరు చర్మంపై వాడే సమయానికి వేడి నీరు ఎలాగో గోరువెచ్చబడుతుంది.

చర్మంపై నూనెతో ఎలా మసాజ్ చేసుకోవాలి?

చర్మంపై నూనెతో ఎలా మసాజ్ చేసుకోవాలి?

మీ చర్మరకాన్ని బట్టి కలిపిన నూనెల మిశ్రమాన్ని అరచేతుల్లో తీసుకోండి.

అరచేతులను వెచ్చబడేదాకా ఒకదానిపై ఒకటి రుద్ది నూనెను సిద్ధపరుచుకోండి.

మొదట చర్మం మొత్తం, ఎక్కడ మురికి ఎక్కువగా ఉందో అక్కడ ప్రధానంగా నూనెను పట్టించండి.

తర్వాత ముఖం మరియు పొట్ట ప్రాంతంలో `గుండ్రంగా అరచేతులతో మసాజ్ చేయండి. చేతులు మరియు కాళ్ళకి నిలువుగా మసాజ్ చేయవచ్చు.

నూనె పూర్తిగా ఇంకిపోయేదాకా ఇలా చేస్తూ ఉండండి.

చర్మంపై నూనె బాగా పట్టేసాక, తెల్ల గుడ్డను గోరువెచ్చని నీరులో ముంచి పిండండి.

ఎక్కడ నూనె పట్టించారో ఆ ప్రాంతాల్లో ఈ తెల్ల గుడ్డను 10 నిమిషాలపాటు పెట్టి ఉంచండి. శరీరానికి తువ్వాలును వాడవచ్చు.

చివరగా, టిష్యూ లేదా దూదితో నూనె మసాజ్ చేసిన ప్ర్రాంతాలను తుడవండి.

మరుసటిరోజు వరకు స్నానం కానీ, కడగటం కానీ, మాయిశ్చరైజర్ రాయటం కానీ చేయవద్దు.

English summary

Oil Cleansing On Your Face And Body | Oil Cleansing | How To Do Oil Cleansing

Oil cleansing is important for your skin and this is how you can do it on the face and body.
Story first published:Saturday, November 11, 2017, 14:26 [IST]
Desktop Bottom Promotion