ఐబ్రో త్రెడింగ్ వలన వచ్చే మొటిమలను నివారించడమెలా?

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఐబ్రోస్ త్రెడింగ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలను కట్టిపడేసే బ్యూటీ టెక్నీక్. త్రెడింగ్ వలన కనుబొమ్మలు చక్కని షేప్ ని సంతరించుకుంటాయి. ఈ బ్యూటీ ప్రాసెస్ ని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షలకొద్దీ మహిళలు తమ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకున్నారు. అవాంఛిత రోమాలను తొలగించడంతో పాటు మీ ఐబ్రోస్ కి తగిన షేప్ ను ఇవ్వడం వలన ఈ బ్యూటీ ప్రాసెస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

ఈ ప్రాసెస్ పూర్తయిన తరువాత, కనుబొమ్మల చుట్టూ ఉండే చర్మం స్పష్టంగా మరియు శుభ్రంగా మారుతుంది. అయితే, చర్మంపై త్రెడ్ ని వాడడం వలన కనుబొమ్మల చుట్టూ ఉండే స్కిన్ పోర్స్ తెరుచుకుంటాయి...

ఐబ్రో త్రెడింగ్ వలన కలిగే మొటిమలను నివారించడమెలా?

స్కిన్ పోర్స్ తెరచుకోవడమంటే అనేకమైన ఇన్ఫెక్షన్స్ కి మార్గం కల్పించడమనే అర్థం. మొటిమలుగా మారే ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ మీ చర్మాన్ని అందవిహీనంగా తయారుచేస్తాయి.

how to prevent breakouts after eyebrow threading

ఒక అంచనా ప్రకారం, ఐ బ్రోస్ చేయించుకున్న పదిమంది మహిళలలో కనీసం ఏడుగురు ఈ బ్రేక్ అవుట్స్ సమస్య నుంచి సతమతమవుతున్నారు. దీంతో పాటు, త్రెడింగ్ వలన చర్మంపై దురదలు, చర్మం ఎర్రబడడంతో పాటు చర్మానికి ఇరిటేషన్ కలగవచ్చు.

అందుచేతనే, మహిళలు కొన్ని ప్రాథమిక చర్మ సంరక్షణ నియమాలను పాటించడం ద్వారా త్రెడింగ్ వలన చర్మానికి కలిగే మొటిమల వంటి భయానక ఇబ్బందులను తొలగించుకోవడానికి ప్రయత్నించాలని బ్యూటీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.

అటువంటి టిప్స్ కోసమే మీరు ఎదురుచూస్తున్నట్లయితే ఈ ఆర్టికల్ ప్రత్యేకంగా మీ కోసమే. ఈ రోజు, బోల్డ్ స్కై, మీ చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుంచి మొటిమల నుంచి సంరక్షించుకోవడానికి అవసరమయ్యే ప్రభావవంతమైన కొన్ని చిట్కాలను మీ కోసం అందిస్తోంది.

ఈ చిట్కాలను తప్పకుండా పాటించడం ద్వారా త్రెడింగ్ తరువాత మీ చర్మానికి ఎదురయ్యే మొటిమల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆలస్యమెందుకు, ఇక చదవండి మరి.

గమనిక: ఒకవేళ తీవ్రమైన మొటిమల సమస్యతో మీరు ఇబ్బందిపడుతున్నట్లైతే మీరు తప్పకుండా డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి అంతర్లీనంగా ఉన్న సమస్యను తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి.

1. త్రెడింగ్ ప్రదేశాన్ని తాకవద్దు:

1. త్రెడింగ్ ప్రదేశాన్ని తాకవద్దు:

త్రెడ్ చేయబడిన ప్రదేశాన్ని తాకకండి. ఒకవేళ తాకినట్లయితే, అది ఇన్ఫెక్షన్ కి దారి తీసి మొటిమలకు నిలయమవుతుంది. త్రెడింగ్ చేయించుకున్న కొన్ని గంటల వరకు ఈ నియమాన్ని పాటించాలని గుర్తుంచుకోండి.

2. ఆయింట్మెంట్ ను అప్లై చేయండి:

2. ఆయింట్మెంట్ ను అప్లై చేయండి:

మీ చర్మాన్ని తరచూ మొటిమల సమస్య వేధిస్తున్నట్లైతే, ఐబ్రోస్ త్రెడింగ్ చేయించుకున్న తరువాత స్కిన్ సూతింగ్ ఆయింట్మెంట్ ను అప్లై చేయండి. డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి స్కిన్ సూతింగ్ ఆయింట్మెంట్ గురించి తెలుసుకుని త్రెడింగ్ తరువాత వచ్చే మొటిమల సమస్య నుంచి ఉపశమనం పొందండి.

3. ఎండలోకి వెళ్ళవద్దు:

3. ఎండలోకి వెళ్ళవద్దు:

త్రెడింగ్ చేయించుకున్న వెంటనే ఎండలోకి వెళ్ళకూడదు. కఠినమైన సూర్యకిరణాలు మీ చర్మాన్ని దెబ్బతీసి మొటిమలకు దారితీయవచ్చు. కనీసం 12 నుంచి 13 గంటల వరకు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్ళవలసి వస్తే, చక్కటి సన్ స్క్రీన్ తో చర్మాన్ని సంరక్షించుకోవటం తప్పనిసరి.

4. రోజ్ వాటర్ ని అప్లై చేయండి:

4. రోజ్ వాటర్ ని అప్లై చేయండి:

చర్మానికి ఉపశమనం కలిగించే గుణం రోజ్ వాటర్ లో కలదు. ఐబ్రోస్ త్రెడింగ్ చేయించుకున్న తరువాత రోజ్ వాటర్ ని చర్మంపై అప్లై చేస్తే త్రెడింగ్ వలన కలిగే మొటిమలకు చెక్ పెట్టవచ్చు. అలాగే, త్రెడింగ్ వలన కలిగే స్కిన్ ఇరిటేషన్ ని అలాగే ఇన్ఫ్లమేషన్ ని తగ్గించే సామర్థ్యం రోజ్ వాటర్ కు కలదు. ఒక కాటన్ బాల్ ని తీసుకుని రోజ్ వాటర్ లో ముంచి ప్రభావిత ప్రదేశంపై సున్నితంగా రాయండి. ఈ ప్రాసెస్ ను ఫాలో అయితే త్రెడింగ్ తరువాత ఎదురయ్యే మొటిమల సమస్య దరిచేరదు.

5. స్కిన్ టోనర్ ని వాడండి:

5. స్కిన్ టోనర్ ని వాడండి:

త్రెడింగ్ తరువాత ప్రభావిత ప్రదేశంపై స్కిన్ టోనర్స్ ని వాడితే చర్మానికి ఉపశమనం కలుగుతుంది. స్కిన్ టోనర్స్ సూతింగ్ ఏజెంట్స్ లా పనిచేయడం వలన చర్మానికి ఇరిటేషన్ నుంచి విముక్తి లభిస్తుంది. అంతే కాకుండా, చర్మంపై నున్న దుమ్మూ ధూళిని తొలగించి చర్మరంధ్రాలని శుభ్రపరచడంలో స్కిన్ టోనర్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. మార్కెట్ లో లభించే కమర్షియల్ స్కిన్ టోనర్ ను గాని లేదా సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసుకునే హోంమేడ్ టోనర్ ని గాని ఉపయోగించి మంచి ఫలితం పొందవచ్చు.

6. మేకప్ ని అవాయిడ్ చేయండి:

6. మేకప్ ని అవాయిడ్ చేయండి:

త్రెడింగ్ చేయించుకున్న వెంటనే మేకప్ ని వేసుకోకండి. ఎందుకంటే, మేకప్ సామగ్రిలో కఠినమైన కెమికల్స్ నిండి ఉంటాయి. త్రెడింగ్ చేయించుకున్న ప్రదేశం సున్నితంగా ఉండటం వలన కఠినమైన కెమికల్స్ కలిగిన మేకప్ ఐటమ్స్ కు చర్మం ఇబ్బంది పడుతుంది. కాబట్టి, త్రెడింగ్ చేయించుకున్న తరువాత కనీసం ఒకటి రెండు రోజులపాటు ఐషాడో మరియు ఐబ్రో పెన్సిల్స్ వాడకాన్ని అవాయిడ్ చేయండి.

7. అలోవెరా జెల్ ను అప్లై చేయండి:

7. అలోవెరా జెల్ ను అప్లై చేయండి:

ప్రభావవంతమైన అలోవెరా జెల్ చర్మాన్ని సంరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. తాజాగా త్రెడ్ చేయబడిన చర్మంపై అలోవెరా జెల్ ని అప్లై చేస్తే చర్మానికి ఇరిటేషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ అద్భుతమైన జెల్ లో యాంటీ ఇంఫ్లమ్మెటరీ ఏజెంట్స్ కలవు. ఇవి వికారమైన మొటిమలను తొలగించి చర్మాన్ని ప్రశాంతపరుస్తాయి.

8. ఆయిలీ బ్యూటీ ప్రాడక్ట్స్ వాడకాన్ని తగ్గించండి:

8. ఆయిలీ బ్యూటీ ప్రాడక్ట్స్ వాడకాన్ని తగ్గించండి:

మీ చర్మాన్ని ఆయిలీగా చేసే బ్యూటీ ప్రాడక్ట్స్ వాడకాన్ని తగ్గించండి. త్రెడింగ్ తరువాతైతే ఇటువంటి బ్యూటీ ప్రాడక్ట్స్ జోలికే వెళ్ళకపోవడం మంచిది. ఇవి చర్మరంధ్రాలని మూసివేసి యాక్నే వంటి సమస్యలను కలిగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకే, త్రెడింగ్ చేయించుకున్న తరువాత కనీసం రెండు మూడు రోజుల వరకు ఆయిల్ బేస్డ్ బ్యూటీ ప్రాడక్ట్స్ కి దూరంగా ఉండండి.

English summary

how to prevent breakouts after eyebrow threading | tips to keep the freshly threaded area free of pimples and acne

Breakouts is a highly common problem that 7 out of 10 women face after getting their eyebrows threaded. Apart from that, your skin may experience irritation, redness and itching. That is why, beauty experts urge women to follow a few basic skin care rules to minimize irritation caused by threading whilst keeping hideous breakouts at bay..
Story first published: Friday, December 15, 2017, 12:00 [IST]