మెరుగైన చర్మంకోసం చమోమైల్ టీని ఈ విధంగా వాడండి

By: :Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

చర్మ సంరక్షణకు తోడ్పడే గుణాలు చమోమైల్ టీలో పుష్కలంగా ఉన్నాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన చమోమైల్ టీని ప్రభావవంతమైన స్కిన్ కేర్ ఇంగ్రీడియెంట్ గా పేర్కొనవచ్చు. ఇందులోనున్న సుగుణాలు అనేకరకాల చర్మ సమస్యలను అరికట్టడంలో తోడ్పడతాయి. చమోమైల్ టీలోనున్న పదార్థాలు స్కిన్ టెక్స్చర్ ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మానికి రక్షణనిస్తాయి.

మనం తరచూ వాడే బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే ప్రభావవంతంగా ఈ చమోమైల్ టీ పనిచేస్తుంది. ఈ సహజ సిద్ధమైన చమోమైల్ టీ చర్మానికి తగిన సంరక్షణనివ్వడానికి తోడ్పడుతుంది. మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్ననిగారింపైన చర్మాన్ని పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

మెరుగైన చర్మంకోసం చమోమైల్ టీని ఈ విధంగా వాడండి

ఆశించిన ఫలితాలు పొందేందుకు చమోమైల్ టీని సరైన పద్దతిలో చర్మసంరక్షణకు వాడాలి. ఈ హెర్బల్ టీని మీ బ్యూటీ రొటీన్ లో ఏ విధంగా వాడాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ఆర్టికల్ లో మీకు ఈ విషయాన్నే స్పష్టం చేస్తాము.

బోల్డ్ స్కై లో ఈ రోజు అనేకరకాలైన చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందటం కోసం చమోమైల్ టీని వాడే వివిధ పద్దతులను పొందుపరచాము.

ఇంకెందుకాలస్యం, చమోమైల్ టీను మీ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకుని మిమ్మల్ని వేధిస్తున్న చర్మసమస్యలకు అతితక్కువ టైంలోనే గుడ్ బై చెప్పండి.

ఇక్కడ వివరించబడిన ప్రభావవంతమైన పద్దతులను తెలుసుకోండి:

గమనిక: ఈ క్రింది పద్దతులను పాటించేముందు మీ స్కిన్ పై ప్యాచ్ టెస్ట్ ను నిర్వహించుకోండి.

1. నేరుగా అప్లై చేయండి:

1. నేరుగా అప్లై చేయండి:

ఒక కప్పు తీపిలేని చమోమైల్ టీని మరిగించుకుని కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిన ఈ టీతో మీ చర్మాన్ని కడగండి. అయిదు నిముషాలు అలాగే ఉంచండి. ఇప్పుడు గోరువెచ్చటినీటితో మీ చర్మాన్ని శుభ్రపరచండి. ఈ పద్దతిని వారానికి ఒకసారి పాటిస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతం.

2. ఓట్ మీల్ తో:

2. ఓట్ మీల్ తో:

ఒక టీస్పూన్ ఓట్ మీల్ తో రెండు టీస్పూన్ల చమోమైల్ టీను కలపండి.

ఈ మిశ్రమంతో మీ చర్మంపై దాదాపు అయిదు నిమిషాలపాటు స్క్రబ్ చేయండి.

గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రపరచండి.

వారానికి ఒకసారి ఈ పద్దతిని పాటించడం ద్వారా చర్మంపై నున్న మృతకణాలను తొలగించుకోవచ్చు. తద్వారా చర్మంపైనున్న ఇంప్యూరిటీస్ తొలగిపోతాయి.

3. తేనెతో:

3. తేనెతో:

ఒక టీస్పూన్ తీపిలేని చమోమైల్ టీతో అర టీస్పూన్ ఆర్గానిక్ తేనెను కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేసి ఐదునిమిషాల తరువాత చల్లటి నీటితో మీ చర్మాన్ని శుభ్రంగా కడగండి.

వారానికి ఒకసారి ఈ కాంబినేషన్ ను ప్రయత్నిస్తే మొటిమల సమస్య దరిచేరదు.

4. అలో వెరా జెల్ తో:

4. అలో వెరా జెల్ తో:

ఒక టీస్పూన్ చమోమైల్ టీతో రెండు టీస్పూన్ల అలో వెరా జెల్ ను కలపండి.

తయారైన మిశ్రమాన్ని మీ చర్మంపై మృదువుగా అప్లై చేయండి. పదినిమిషాల వరకు చర్మంపైనున్న ఈ మిశ్రమాన్ని కద వద్దు.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

వారానికొకసారి ఈ పద్దతిని పాటించడం ద్వారా నిస్తేజంగా ఉన్న చర్మానికి కాంతిని కలిగించవచ్చు.

5. ఆలివ్ నూనెతో:

5. ఆలివ్ నూనెతో:

ఒక టీస్పూన్ ఆలివ్ నూనెతో ఒక టీస్పూన్ చమోమైల్ టీని కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై సున్నితంగా అప్లై చేయండి. పది నిముషాల తరువాత చల్లటి నీటితో శుభ్రపరచండి.

వారానికి ఒకసారి ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేస్తే మీ చర్మానికి తగిన పోషణ లభించి మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.

6. గ్రీన్ టీ తో:

6. గ్రీన్ టీ తో:

రెండు టీస్పూన్ల చమోమైల్ టీతో ఒక టీస్పూన్ గ్రీన్ టీ ని కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేయండి. పదినిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రపరచండి.

వారానికి ఒకసారి ఈ హోంమేడ్ రిన్స్ ను ప్రయత్నిస్తే చర్మంపై అకాల వృద్ధాప్య లక్షణాలు కనిపించవు.

7. ఆల్మండ్ పౌడర్ తో:

7. ఆల్మండ్ పౌడర్ తో:

ఒక పాత్రలోకి ఒక టీస్పూన్ చమోమైల్ టీని అలాగే అర టీస్పూన్ ఆల్మండ్ పౌడర్ ని తీసుకుని వీటిని బాగా కలపండి.

తయారైన మిశ్రమాన్ని మీ చర్మంపై మృదువుగా అప్లై చేయండి. దాదాపు పది నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరచుకోండి.

ఈ హోంమేడ్ మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేయడం ద్వారా చర్మాన్ని అనేకరకాలైన సమస్యల నుంచి సంరక్షించుకోవచ్చు. అతిముఖ్యంగా, బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది.

8. శనగపిండి, నిమ్మరసాల కలయికతో:

8. శనగపిండి, నిమ్మరసాల కలయికతో:

ఒక టీస్పూన్ చమోమైల్ టీతో అర టీస్పూన్ నిమ్మరసాన్ని, అర టీస్పూన్ శనగ డిని కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేయండి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడగండి.

ఈ విధమైన పద్దతులలో చమోమైల్ టీని మీ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకుంటే మీ చర్మం సహజసిద్ధమైన కాంతితో మెరిసిపోతుంది.

English summary

Here’s How You Can Use Chamomile Tea For Better Skin

Chamomile tea is a widely used skin care ingredient that is known to be packed with powerful antioxidants. These compounds can treat various unpleasant skin problems, whilst preventing free radicals from damaging the skin's texture.
Subscribe Newsletter