For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పగిలిన పెదవులకి మాత్రమే కాక లిప్ బామ్ ను ఇంకా ఎలా వాడుకోవచ్చు

By Deepti
|

పెదవులకి రాసుకునే బామ్ అందాల ఉత్పత్తుల్లో అంత ఆకర్షణీయమైనదేం కాకపోవచ్చు. కానీ మనందరికీ చాలా అవసరమైన వస్తువు. అన్ని సమయాల్లో మన బ్యాగుల్లో ఒక లిప్ బామ్ అయినా లేకపోతే ఉండలేం.

కానీ పగిలిన పెదవుల నుంచి కాపాడటం ఒకటే ఈ బామ్ లు చేయవని మీకు తెలుసా? మన దగ్గర నిజానికి అవసరం కంటే ఎక్కువ లిప్ బామ్ లే ఉంటాయన్నది వాస్తవం. ఎందుకంటే అవి దొరికే వివిధ రుచులని మనం మిస్సవలేం లేదా ఊరికే పోతుంటాయి కూడా కాబట్టి ఎక్కువ కొంటూ ఉంటాం.

How To Use Lip Balm & Not Just For Chapped Lips

పగిలిన పెదవులను సరిచేయటానికి మాత్రమే కాక లిప్ బాంలను ఇంకా ఎన్ని రకాలుగా వాడవచ్చో తెలుసుకోండి.

1. పొడిబారిన చేతులు

1. పొడిబారిన చేతులు

మీ దగ్గర్ ఏ లోషన్ లేనప్పుడు, కొంచెం లిప్ బాం ను చేతిలో తీసుకుని పొడిబారిన చేతులకి రాయండి. ఇది ముఖ్యంగా వేళ్ళ మధ్యన, చుట్టూ రాయటం మంచిది.ఇక లిప్ బాంలు ఉండగా పొడి చేతులన్నవి కనబడవు!

2. గోళ్ళ పైపొర;

2. గోళ్ళ పైపొర;

పొడిబారిన గోళ్ళపై చర్మపొరలు అస్సలు చూడటానికి బాగోవు. కొన్నిసార్లు వాటిని బాగుకూడా చేయలేం. కొంచెం లిప్ బామ్ ను క్యుటికల్స్ పై రాసి వాటికి తేమ, పోషణ అందించండి. అవి కొంచెం మెత్తబడగానే క్యుటికల్ స్టిక్ తో వాటిని లోపలికి తోయండి.

 3. కళ్ళ మేకప్ ను తీసేయడానికి ;

3. కళ్ళ మేకప్ ను తీసేయడానికి ;

కొంచెం లిప్ బామ్ ను క్యూ టిప్ పై వేసి, కళ్ళ మేకప్ ను తొలగించటానికి వాడండి. మీ దగ్గర కళ్ల మేకప్ తొలగించే రిమూవర్ లేనప్పుడు లేదా దొరకనప్పుడు ఇలా చేసుకోవచ్చు. లిప్ బామ్ లో మింట్ వాసన వచ్చేవాటిని దీని కోసం వాడుకోవచ్చు.

 4. కళ్ల క్రీమ్ ;

4. కళ్ల క్రీమ్ ;

లిప్ బాం కళ్ళ కింద గీతలను మరియు కళ్ళ కింద క్రౌ ఫీట్ ను కూడా తగ్గేలా చేస్తుంది. ముఖ్యంగా మీకు కళ్ళ కోసం ప్రత్యేకంగా క్రీం కొనటం ఇష్టం లేకపోతే ఇలా చేయవచ్చు. లేతరంగుల వాటిని దీనికోసం వాడవద్దు. మామూలు మాయిశ్చరైజర్ ల కన్నా కంటి కింద లిప్ బామ్ లే ఎక్కువ తేమను అందిస్తాయి.

5. ఎగురుతూ చిందరవందరయ్యే జుట్టును నియంత్రించండి ;

5. ఎగురుతూ చిందరవందరయ్యే జుట్టును నియంత్రించండి ;

ఎగురుతూ చిక్కుపడిపోయే జుట్టు మీ అందాన్నే దెబ్బతీస్తుంది. అలాగని మనలో అందరం హెయిర్ స్ప్రేలు వాడం. అందుకని కొంచెం లిప్ బామ్ వాడి జుట్టును సరిచేయండి. మీరు సాధారణ ఫ్లేవర్ లేని లిప్ బామ్ లను దీనికోసం వాడవచ్చు.

6. ముక్కు

6. ముక్కు

మీకు జలుబుగా ఉంటే, మీ ముక్కును టిష్యూతో రుద్దుతూ ఉంటే అది ఎర్రగా, పొడిగా మారిపోతుంది. అలా రుద్దగానే కొంచెం లిప్ బామ్ ను అక్కడ రాయండి. కొంచెం ఉపశమనం లభిస్తుంది.

English summary

How To Use Lip Balm & Not Just For Chapped Lips

Lip balm may not be the most glamorous beauty product, but it is definitely one of the most important beauty products for most of us. We just can't live without having at least one lip balm in our bags at all times.
Desktop Bottom Promotion