ముఖ సౌందర్యాన్ని పెంచే శ్రీగంధం ఫేస్ ప్యాక్

By: Mallikarjuana
Subscribe to Boldsky

అందం.. చాలామంది దీనికోసం ఏమిచేయడానికైన సిద్దపడతారు. దీన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు, అయితే అందమైన చర్మం కోసం చందనం చెప్పే మరింత అందమైన చిట్కాలు ఉన్నాయి. చందనం మన చర్మానికి ఎంతో మంచిది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. వివిధ రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. ఈ ట్రెడిషినల్ రెమెడీలో వివిధ రకాల ఉపయోగాలున్నాయి. యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని బేసిక్ స్కిన్ కేర్ కోసం ఉపయోగిస్తుంటారు.

అయితే చర్మ తత్వాన్ని బట్టి కూడా ఈ న్యాచురల్ రెమెడీనీ ఉపయోగిస్తుంటారు. అన్ని రకాల చర్మతత్వాలకు చందనం ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్ ఇలా వీటిలో మీ చర్మ తత్వం తెలుసుకుని చందనం ఎలా వాడోలో తెలుసుకోండి.

మీచర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే ఈ చందనం ఎలా వాడాలో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...అవుతుంది.

1. జిడ్డు చర్మం కోసం

1. జిడ్డు చర్మం కోసం

కావల్సినవి:

 • ½ టీస్పూన్ చందనం పౌడర్
 • ½ టీస్పూన్ ముల్తాని మట్టి
 • 2 టీస్పూన్ల రోజ్ వాటర్

ఎలా ఉపయోగించాలి:

పైన పేర్కొన్న పదార్ధాలన్నింటిని ఒక గిన్నెలో వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మెడకు పూర్తిగా అప్లై చేయాలి.20 నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఆయిల్ స్కిన్ సమస్యలు తగ్గుతాయి.

గంధాన్ని చర్మసౌందర్యానికి ఎలా వాడాలి ?

2. డ్రై మరియు ఫ్లాకీ స్కిన్ కోసం

2. డ్రై మరియు ఫ్లాకీ స్కిన్ కోసం

కావల్సినవి:

 • ½ టీస్పూన్ చందనం పౌడర్
 • 1 టీస్పూన్ కొబ్బరి నూనె

ఎలా ఉపయోగించాలి:

పైన సూచించిన పదార్థాలన్నింటికి కలిపి, గోరువెచ్చగా చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిముషాలు అలాగే ఉండనిచ్చి, డ్రైగా మారిన తర్వాత చన్నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల డ్రై అండ్ ఫ్లాకీ స్కిన్ సమస్యలు తగ్గుతాయి. సమస్య పూర్తిగా తగ్గాలంటే, వారానికొకసారి ప్రయత్నించండి మంచి ఫలితం ఉంటుంది.

3. మొటిమల చర్మం కోసం

3. మొటిమల చర్మం కోసం

కావల్సినవి:

 • గ్రీన్ టీ 1 టీస్పూన్
 • 1 టీస్పూన్ గంధపు పొడి
 • ఆపిల్ సైడర్ వినెగార్ 3-4 చుక్కలు

ఎలా ఉపయోగించాలి:

పైన సూచించిన పదార్థాలన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేస్తే చాలు మొటిమలను నివారించే మెటీరియల్ రెడీ. ఈ ప్యాక్ వేసుకోవడానికి ముందు ముఖాన్ని మైల్డ్ క్లెన్సర్ తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ప్యాక్ ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. నెలలో రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు పూర్తిగా తొలగిపోతాయి.

4. ట్యాన్డ్ స్కిన్ :

4. ట్యాన్డ్ స్కిన్ :

కావల్సినవి:

 • దోసకాయ రసం 2 టీస్పూన్లు
 • ½ టీస్పూన్ గంధం పొడిని
 • 1 టీస్పూన్ వోట్మీల్

ఎలా ఉపయోగించాలి:

పైన సూచించిన పదార్థాలన్నింటిని ఒక గిన్నెలో తీసుకుని, బాగా మిక్స్ చేయాలి. ట్యాన్ కు ప్రభావితం అయిన ప్రదేశంలో దీన్ని అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత చన్నీటింతో కడిగేయాలి. ఇలా రెగ్యులర్ గా వారానికొకసారి వేసుకుంటే స్కిన్ ట్యాన్ తొలగిపోతుంది.

5. ముడుతలు మరియు ఫైన్ లైన్స్ కోసం

5. ముడుతలు మరియు ఫైన్ లైన్స్ కోసం

కావాల్సినవి:

 • 1 టీస్పూన్ బాదం నూనె
 • ½ టీస్పూన్ చందనం
 • 1 టీస్పూన్ కలబంద

ఎలా ఉపయోగించాలి:

ఒక గిన్నెల, పైన సూచించిన పదార్థాలన్నింటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పల్చటి లేయర్ గా అప్లై చేయాలి. 15 నిముషాలు డ్రైగా మారిన తర్వాత ట్యాప్ వాటర్ తో కడగాలి. వారంలో ఒకసారి తప్పనిసరిగా వేసుకోవడం వల్ల చర్మంలో ముడుతలు, మచ్చలు తొలగిపోయి అందంగా కనబడుతారు.

చందనం ఒక అద్భుతమైన సౌందర్యవర్ధకసాధనం..!

6. అన్ని రకాల చర్మ తత్వం కోసం

6. అన్ని రకాల చర్మ తత్వం కోసం

కావాల్సినవి:

 • ½ టీస్పూన్ చందనం పొడి
 • 1 టీస్పూన్ బొప్పాయి పల్ప్

ఎలా ఉపయోగించాలి:

ఈ చర్మానికి ప్రయోజనం కలిగించే పదార్ధాలను సిద్ధం చేయడానికి ఈ 2 పదార్ధాలను కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూర్తిగా అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ అన్ని రకాల చర్మ తత్వాలకు సహాయపడుతుంది, చందనం పొడిని వారంలో రెండుసార్లు ఉపయోగిస్తే కూడా చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

7. పిగ్మెంటేషన్ స్కిన్ కోసం

7. పిగ్మెంటేషన్ స్కిన్ కోసం

కావల్సినవి:

 • ½ టీస్పూన్ విటమిన్ సి పౌడర్
 • ½ టీస్పూన్ చందనం పొడి
 • 1 టీస్పూన్ నిమ్మరసం
 • విటమిన్ ఎ క్యాప్సుల్ నుండి నూనె

ఎలా ఉపయోగించాలి:

పైన సూచించిన పదార్థాలన్నింటిని ఒక గిన్నెలో వేసి కలపాలి. పేస్ట్ లా తయారైన తర్వాత ముఖానికి అప్లై చేసి డ్రై అయిన తర్వాత ట్యాప్ వాటర్ తో కడగాలి. ఈ చిట్కాను రెండు వారాలకొకసారి అప్లై చేస్తే చాలు స్కిన్ పిగ్మెంటేషన్ దూరం

English summary

How To Use Sandalwood Powder For Different Skin Concerns

Did you know that sandalwood powder can be used for different skin concerns? Read to know how to prepare sandalwood powder face mask using other ingredient
Subscribe Newsletter