యవ్వనంగా..కాంతివంతమైన చర్మ సౌందర్యం పొందడానికి : గుడ్డు

Posted By:
Subscribe to Boldsky

చర్మ సమస్యల్లో అత్యంత సాధారణ సమస్యలు..చర్మం సాగడం, చర్మం వదులుగా కనబడుట. ఈ మద్యకాలంలో ఎక్కువ మంది మహిళలు ఈ సమస్యను ఎందుర్కొంటున్నారు. ఈ చర్మం వల్ల మహిళలు మరింత వయస్సైన వారిలా కనబడుతున్నారు.

ఇలాంటి చర్మ గుణాన్ని ఏ ఒక్క మహిళ ఇష్టపడదు. అందుకే ఈ మద్యకాలంలో చాలా మంది మహిళలు కాస్మోటిక్స్ సర్జరీలను ఎంపిక చేసుకుంటున్నారు. అదే విధంగా వారి చర్మం టైట్ గా..మంచి షైనింగ్ తో, కాంతివంతంగా మార్చుకోవడానికి కొన్ని ప్రొండక్ట్స్ ను కూడా ఎంపిక చేసుకుంటున్నారు. అయితే ఈ రెండు మార్గాల వల్ల మహిళల్లో స్కిన్ డ్యామేజ్ మరింత పెరుగుతుంది.

పచ్చసొన తినడం లేదా ? ఐతే పోషకాలు కోల్పోయినట్టే

అందుకే , అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మహిళలు నేచురల్ పదార్థాలను ఎంపిక చేసుకోవడం మంచిది. వీటి వల్ల ఎలాంటి హాని జరగదు. వదులైన చర్మాన్ని టైట్ గా మార్చాడానికి ఒకే ఒక రెమెడీ చాలు తిరిగి పూర్వస్థితికి తీసుకురావడానికి. అదే ఎగ్ వైట్ మ్యాజిక్.

ఎగ్ వైట్ లోని యాంటీఆక్సిడెంట్స్ చర్మంను వేగంగా పూర్వస్థితికి తీసుకొస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వదులైన మీ చర్మ సమస్యను పరిష్కరించుకోండి. యంగ్ అండ్ యూత్ ఫుల్ లుక్ తో కనబడేలా ఈ ఫ్యాక్ ను ఫాలో అవ్వండి.

ఎగ్ వైట్ -క్యారెట్ జ్యూస్

ఎగ్ వైట్ -క్యారెట్ జ్యూస్

ఒక గుడ్డులోని తెల్లని పదార్థం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి ఫ్రెష్ గా తయారుచేసిన క్యారెట్ జ్యూస్ ను జోడించి , బాగా మిక్స్ చేయాలి. దీన్ని చర్మం మొత్తానికి అప్లై చేయాలి. పూర్గిగా డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో ఒకసారి చేస్తే చాలు అద్భుత మార్పు కనిపిస్తుంది.

ఎగ్ వైట్ విత్ ఓట్ మీల్

ఎగ్ వైట్ విత్ ఓట్ మీల్

ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ తీసుకుని, అందులో ఎగ్ వైట్ చేర్చి రెండూ బాగా మిక్స్ చేయాలి. అంతే ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది.

ఎగ్ వైట్ -తేనె:

ఎగ్ వైట్ -తేనె:

ఎగ్ వైట్ మరియు తేనె మిశ్రమం వదులైన చర్మాన్ని టైట్ గా మార్చడం మాత్రమే కాదు, ఇది చర్మంను కాంతివంతంగా చేస్తుంది. ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఎగ్ వైట్ -పెరుగు

ఎగ్ వైట్ -పెరుగు

ఒక ఎగ్ వైట్ లో పెరుగు చేర్చి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం స్మూత్ గా ఫెయిర్ గా మారుతుంది. అంతే కాదు చర్మం కాంతివంతంగా, సాస్ట్ గా మారుతుంది. ఈ మిశ్రమాన్ని వారానికొకసారి అప్లై చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

ఎగ్ వైట్ మరియు శెనగపిండి

ఎగ్ వైట్ మరియు శెనగపిండి

ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి తీసుకుని, అందులో ఎగ్ వైట్ ను మిక్స్ చేయాలి. 20 నిముషాల తర్వాత డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

ఎగ్ వైట్ ఫుల్లర్స్ ఎర్త్

ఎగ్ వైట్ ఫుల్లర్స్ ఎర్త్

ఒక టీస్పూన్ ఫుల్లర్స్ ఎర్త్ కు కొద్దిగా ఎగ్ వైట్ చేర్చి, 10 నిముషాలు అలాగే వదిలేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

ఎగ్ వైట్ విత్ ఆపిల్ సైడర్ వెనిగర్

ఎగ్ వైట్ విత్ ఆపిల్ సైడర్ వెనిగర్

ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో కొద్దిగా ఎగ్ వైట్ మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఎగ్ వైట్ విత్ లెమన్ జ్యూస్

ఎగ్ వైట్ విత్ లెమన్ జ్యూస్

ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఎగ్ వైట్ ను మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఈ నేచురల్ రెమెడీని వారానికొకసారి ఫాలో అయితే చాలు మంచి ఫలితం ఉంటుంది.

English summary

How To Use Egg White For Firmer Skin

Egg white is enriched with antioxidants that can make loose skin a thing of the past. You can use egg white in various ways to treat this skin problem at your home.
Story first published: Saturday, March 25, 2017, 16:46 [IST]
Subscribe Newsletter