ఫేస్ తెల్లగా..కాంతివంతంగా కనబడాలంటే పెరుగు ఫేస్ ప్యాక్

Posted By:
Subscribe to Boldsky

ఆరోగ్యం కోసం తీసుకునే ఆహార పదార్థాలతో అందం కూడా పెరుగుతుందనే విషయం మీకు తెలుసా? పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబితే.. తక్కువ ఖరీదులో అందాన్ని మెరుగుపరుచుకోవడానికి పెరుగు చాలంటారు సౌందర్య నిపుణులు.ప్రతి ఇంట్లో తప్పకుండా లభించే పెరుగు ముఖ్యమైన బ్యూటీ ఇంగ్రీడియెంట్ అన్న విషయం మరచిపోకూడదు. కాంతివంతమైన చర్మం కోసం ప్రయత్నిస్తుంటే, కచ్చితంగా మీ బ్యూటీ ప్యాక్స్ లో పెరుగుకి స్తానం కలిపించాలి. వెడ్డింగ్ సీజన్ లో ఆరోగ్యవంతమైన చర్మం కోసం పెరుగుకు మొదటి స్థానాన్ని కల్పించడం ప్రధానం.

పెరుగుతో చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో పెరుగు ముఖ్యపాత్ర పోషిస్తుంది. కేవలం పెరుగునే ఫేస్ మాస్క్ గా అప్లై చేసుకున్నా మెరుగైన ఫలితముంటుంది. పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్ లు అత్యధిక స్థాయిలో లభిస్తాయి. అంతే కాకుండా, విటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే, పెరుగులో ఉండే యాంటి మైక్రోబియాల్ ప్రాపర్టీస్ చర్మ సమస్యలకు రెమిడీగా పని చేస్తాయి.

How To Use Yogurt For Skin Whitening,

స్కిన్ వైట్ గా మార్చుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఎంతో డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే స్కిన్ వైట్ గా మార్చుకోవడం కోసం ఒక సింపుల్ హోం రెమెడీ మన ఇంట్లోనే అందుబాటులో ఉండే పెరుగు. చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడం కోసం పురాత కాలం నుండి పెరుగును లేపనాలు..పూతలుగా ఉపయోగిస్తున్నారు. పెరుగు చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. పెరుగులో స్కిన్ వైటనింగ్ గుణాలు అధికంగా ఉండటం వల్ల దీన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. వారంలో ఒకసారి అప్లై చేస్తే చాలు ఫలితం మెరుగ్గా ఉంటుంది.

తక్కువ సమయంలో ముఖాన్ని తాజాగా మెరిపించాలి. ఏం చేయాలంటారా. పెరుగుకి మరికొన్ని పదార్థాలు కలిపి చకచకా పూతలు వేసేయండి. ఎలాగంటారా..

పెరగు మరియు బియ్యం పిండి:

పెరగు మరియు బియ్యం పిండి:

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఈ రెండింటి కాంబినేషన్ గ్రేట్ అని చెప్పవచ్చు. ఒక టీస్పూన్ పెరుగులో ఒక టీస్పూన్ బియ్యం పిండి మిక్స్ చేసి, ముఖం, మెడకు అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

పెరుగు, బంమగాళదుంప, గ్లిజరిన్

పెరుగు, బంమగాళదుంప, గ్లిజరిన్

పెరుగు, పొటాటో జ్యూస్, గ్లిజర్ కాంబినేషన్ ఫేస్ ప్యాక్ తో స్కిన్ కాంప్లెక్షన్ లో అద్భుతమైన మార్పు వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా ఉండే పెరుగును ఒక స్పూన్ పొటాటో జ్యూస్ , రెండు చెంచాలా గ్లిజరిన్ తో మిక్స్ చేయాలి. ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

పెరుగు, టమోటో గుజ్జు మరియు తేనె

పెరుగు, టమోటో గుజ్జు మరియు తేనె

ఈ స్కిన్ లైటనింగ్ కాంబినేషన్ వండర్ ఫుల్ గా పనిచేస్తుంది. అందుకోసం మీరు చేయాల్సిందల్ల ఒక టేబుల్ స్పూన్ పెరుగులో ఒక టీస్పూన్ టమోటో గుజ్జు, తేనె మిక్స్ చేయాలి.

పెరుగు, అలోవెర జెల్, మరియు ఆలివ్ ఆయిల్

పెరుగు, అలోవెర జెల్, మరియు ఆలివ్ ఆయిల్

పెరుగు, అలోవెర జెల్, ఆలివ్ ఆయిల్ ఈ మూడు పదార్థాలు నేచురల్ పదార్థాలు. ఒక టేబుల్ స్పూన్ పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ మిక్స్ చేసి, మూడు చుక్కల ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.

పెరుగు, నిమ్మరసం మరియు ఓట్ మీల్

పెరుగు, నిమ్మరసం మరియు ఓట్ మీల్

ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు మరియు రెండు టీస్పూన్ల నిమ్మరసం తీసుకుని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి డ్రై అయిన తర్వాత, ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది ఫేస్ టోనర్ గా పనిచేస్తుంది.

పెరుగు , కీరదోసకాయ

పెరుగు , కీరదోసకాయ

చర్మంను కాంతివంతంగా, తెల్లగా మార్చడంలో గ్రేట్ కాంబినేషన్ పెరుగు, కీరదోసకాయ. కీరదోసకాయను తురిమి అందులో నుండి వచ్చే వాటర్ ను పెరుగుతో మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇది బాగా డ్రై అయిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

 రోజ్ వాటర్ మరియు ఆరెంజ్ పీల్ పౌడర్

రోజ్ వాటర్ మరియు ఆరెంజ్ పీల్ పౌడర్

ఆరెంజ్ పీల్ వాటర్ స్కిన్ కాంప్లెక్స్ ను మెరుగుపరుస్తుంది. ఒక టీస్పూన్ ఆరెంజ్ పొడిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు మరియు కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.

English summary

How To Use Yogurt For Skin Whitening

How To Use Yogurt For Skin Whitening,Tired of spending big bucks on over-the-counter skin-whitening products that just don't seem to live up to the hype? Trust us, when we say that you're not the only one going through that.
Story first published: Wednesday, March 8, 2017, 17:00 [IST]
Subscribe Newsletter