మీ అందాన్ని మెరుగుపరిచే వంటగది వస్తువులు!

Posted By: Madhavi Lagishetty
Subscribe to Boldsky

మీరు రోజుమొత్తం..ఎండలో ఉంటే...మీ చర్మం నిర్జీవంగా...డల్ గా కనిపిస్తుందా? గంటల తరబడి వర్క్ చేస్తున్నప్పుడు మీ కళ్లు అలసటగా మారుతున్నాయా? పార్టీకి లేదా ఫంక్షన్ కు హాజరుకావాలంటే...మీరేం చేస్తారు. డల్ స్కీన్ ను కాస్త...కాంతివంతమైన స్కీన్ గా మార్చాలంటే ఏం చేయాలి. కొన్ని నిమిషాల్లోనే మీరు అందంగా కనిపించవచ్చు...దీనికి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరంలేదు.

కిచెన్ లోనే మీ ముఖ సౌందర్యం దాగి ఉంది. వంటగదిలో దొరికే కొన్నివస్తువులతో మీ ముఖాన్ని పాలలా కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే ప్యాక్ లను తయారు చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవచ్చు.

చర్మం తెల్లగా మారడం కోసం టాప్ 10 ఇంటి చిట్కాలు

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ముఖ్యంగా మహిళలు సమయం అనేది ఉండదు. బయటకు పార్లర్ కు వెళ్లి ఫేస్ ప్యాక్ లు వేయించుకునేంత టైం అస్సలు ఉండదు. మరి ఖాళీ సమయంలోనే ఇంట్లోనే ఉండే పదార్థాలతోనే మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

నిమ్మరసం, పాల ఫేప్యాక్...

నిమ్మరసం, పాల ఫేప్యాక్...

నిమ్మరసంలో, చల్లనిపాలు కలిపాలి. చిక్కగా ఉన్నట్లయితే..కొన్ని నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15నిమిషాలు ఉంచండి. 15నిమిషాల తర్వాత కడగాలి.

ఇది మంచి సువాసనను వెదజల్లుతుంది. మీరు స్నానానికి వెళ్లే ముందు మీ ముఖానికి ప్యాక్ లా వేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటుంది.

టమోటా,పెరుగు, ఓట్ మిల్...ఫేస్ ప్యాక్...

టమోటా,పెరుగు, ఓట్ మిల్...ఫేస్ ప్యాక్...

తాజా టమోటాలను తీసుకుని వాటిని గ్రైండ్ చేయండి. మెత్తని పేస్టులా తయారయ్యాక...పెరుగును కలపండి. రెండింటిని మిక్స్ చేయండి. ఈ మిశ్రమం మీ ముఖాన్ని తెల్లగా కనిపించేలా చేస్తుంది ఓట్ మీల్ పౌడర్ను కూడా కలుపుకోవచ్చు. ఓట్ మిల్ స్క్రబ్ లా పనిచేస్తుంది. ముఖానికి బాగా మసాజ్ చేసిన తర్వాత చల్లని నీటితో కడగండి.

ఆరెంజ్ పీల్+పెరుగు

ఆరెంజ్ పీల్+పెరుగు

చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో పెరుగు ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆరెంజ్ పీల్, పెరుగును సమాన మోతాదులో తీసుకుని ముఖంపై అప్లై చేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

చర్మ సౌందర్యంను & చర్మ కాంతిని పెంచే హోం మేడ్ క్రీమ్స్

శనగపిండి, నీరు...

శనగపిండి, నీరు...

ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో నీటిని కలిపి పేస్టులా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కు ప్యాక్ లా అప్లై చేయండి. ఇందులో కొంచెం గోధమ పిండి కూడా చేర్చుకోవచ్చు. శనగపిండి మీ ముఖం తెల్లగా కాంతివంతంగా తయారు చేయడంలో సహాయపడుతుంది. దీంతో తొందరగా ఫలితాన్ని చూడవచ్చు.

తేనె, నిమ్మరసం, మిల్క్ పౌడర్+ ఆల్మాండ్ ఆయిల్...

తేనె, నిమ్మరసం, మిల్క్ పౌడర్+ ఆల్మాండ్ ఆయిల్...

వీటన్నింటికి కలిపి ప్యాక్ లా తయారు చేసుకోవచ్చు. ఫేక్ కు మంచి ప్యాక్ లా పనిచేస్తుంది. జిడ్డు చర్మం వారికి మంచి ఫలితం ఉంటుంది. ఒక హాఫ్ టేబుల్ స్పైర్ తేనె, ఒక నిమ్మకాయ, పాలు కలిపి మిక్స్ చేయాలి. ఇందులో చిటికెడు మిల్క్ పౌడర్ ను యాడ్ చేయాలి. పసుపు రంగులోకి వచ్చిన మిశ్రమంలో కొన్ని చుక్కల ఆల్మాండ్ ఆయిల్ వేసి మీ ముఖంపై మర్థన చేసుకోవాలి. 15నిమిషాల పాటు ఉంచిన తర్వాత...చల్లటి నీటితో కడగాలి.

గుమ్మడికాయ, తేనె, పాలు..

గుమ్మడికాయ, తేనె, పాలు..

ఐదు చిన్న చిన్న గుమ్మడికాయ ముక్కలను తీసుకిన..వాటిని గ్రైండ్ చేయండి. పేస్టులా తయారైన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల పాలు, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె కలిపి పేస్టులా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగివేయండి. మీ ముఖానికి మంచి ప్యాక్ లా పనిచేస్తుంది. గుమ్మడికాయ పేస్టులను ప్రతిరోజు వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఫ్రీజ్ లో కా స్టోర్ చేసుకోవచ్చు.

English summary

Skin Whitening At Home | Skin Whitening With Kitchen Ingredients | Skin Whitening Masks

Prepare skin whitening masks at home with simple kitchen ingredients which we have mentioned about in this article.
Story first published: Tuesday, September 12, 2017, 11:00 [IST]