సౌందర్యాన్ని పెంచుకోవడానికి నిమ్మతొక్కను ఇలా కూడా వాడుకోవచ్చు

By: Mallikarjuna
Subscribe to Boldsky

చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడానికి వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటాము. అలాగే చాలా వరకూ హోంమేడ్ స్కిన్ రెమెడీస్ లో నిమ్మతొక్కను కూడా ఉపయోగిస్తుంటాము. అయితే నిమ్మతొక్కను నేరుగా చర్మానికి మర్ధన చేయడం వల్ల అనుకున్న ఫలితాలను ఇవ్వకపోవచ్చు. నిమ్మతొక్కతో పాటు ఇతర బ్యూటీ న్యాచురల్ పదర్థాలను కూడా ఉపయోగించడం వల్ల ఫేస్ మాస్క్, ఫేస్ ప్యాక్ లను తయారుచేసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలుంటాయి.

నిమ్మరసంలోనే కాదు నిమ్మతొక్కలో కూడా విటమిన్ సి మరియు ఇతర న్యూట్రీషియన్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో ఉండే బ్లీచింగ్ లక్షణాలు చర్మంను కాంతివంతంగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. నెక్ట్స్ టైమ్ మీరు నిమ్మకాయ నుండి రసాన్ని తీసినప్పుడు, తొక్కను పడేయకుండా పది, పదిహేను రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. తొక్క ఎడిన తర్వాత వాటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. రెగ్యులర్ గా చర్మ సంరక్షణ జాగ్రత్తలు తీసుకొనే వారికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

కీళ్ల నొప్పులు నివారించే.. అమేజింగ్ సొల్యూషన్: నిమ్మ తొక్క..!!

ఈ పౌడర్ ను మీరు తరచూ ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ తో పాటు మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవడం వల్ల చర్మంను తెల్లగా..కాంతివంతంగా మార్చుతుంది.ఈ రెమెడీస్ ను స్త్రీ పురుషులిద్దరూ ఉపయోగించుకోవచ్చు.

రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితాలను అందిస్తుంది, మరి ఆలస్యం ఎందుకు? నిమ్మ తొక్క చర్మానికి ఏవిధంగా పనిచేస్తుందో..ఎలా ఉపయోగించాలో తెలుసుకునేద్దాం...

చర్మానికి నిమ్మతొక్క ఉపయోగించే విధానం I: చర్మంలో మచ్చలు లైట్ గా మార్చుతుంది:

చర్మానికి నిమ్మతొక్క ఉపయోగించే విధానం I: చర్మంలో మచ్చలు లైట్ గా మార్చుతుంది:

చర్మంలో, లేదా శరీరంలోని ఏ ఇతర భాగాల్లో అయినా మొటిమలు మచ్చలు ఏర్పడుట సహజం. వాటిని వెంటనే తొలగించుకోకపోవడం వల్ల చర్మం మరింత అసహ్యంగా కనబడుతుంది. చర్మంలో ఎలాంటి మచ్చలైనా మార్క్స్ అయినా నిమ్మతొక్క ఉత్తమ రెమెడీ. దీనికి నిమ్మతొక్క పౌడర్ అవసరం లేదు, ఎండిన నిమ్మతొక్కతో మచ్చల మీద 5 నిముషాలు మర్ధన చేసినా చాలు. మంచి ఫలితం ఉంటుంది. అయితే మచ్చలు పోయే వరకూ ఈ చిట్కాను రిపీట్ చేస్తుండాలి.

చర్మానికి నిమ్మతొక్క ఉపయోగించే విధానం II: స్క్రబ్బర్

చర్మానికి నిమ్మతొక్క ఉపయోగించే విధానం II: స్క్రబ్బర్

లెమన్ పీల్ బేస్డ్ స్కిన్ స్ర్కబ్బర్ ను తయారుచేసుకోవడం మంచిది. ఇది మీ చర్మంను శుభ్రం చేస్తుంది, అందుకు కావల్సిందల్లా పంచదార, నిమ్మతొక్క, మరియు ఆలివ్ ఆయిల్. దీనికి కూడా పౌడర్ అవసరం లేదు, సింపుల్ గా డ్రై లెమన్ పీల్ తీసుకుని, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, పంచదార, ఆలివ్ ఆయిల్ తో కలపాలి. మూడు బాగా కలిసే వరకూ మిక్స్ చేసి, బాడీ మొత్తానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. పది నిముషాలు మసాజ్ చేసిన తర్వాత తప్పకుండా చర్మంలో మార్పులు కనబడుతాయి.

చర్మానికి నిమ్మతొక్క ఉపయోగించే విధానం III: ఫేస్ ప్యాక్

చర్మానికి నిమ్మతొక్క ఉపయోగించే విధానం III: ఫేస్ ప్యాక్

నిమ్మ తొక్కను ఫేస్ ప్యాక్ ల తయారీలో ఉపయోగిస్తారు. లెమన్ పీల్ ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవడానికి, నిమ్మతొక్కను ఎండబెట్టి, పౌడర్ చేయాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పౌడర్ లో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలను కలపాలి. ఈ పేస్ట్ కొద్దిచిక్కగా ఉండాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పూర్తిగా అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉండాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ లెమన్ పీల్ ప్యాక్ వేసుకున్నప్పుడు నవ్వడం, స్ట్రెచ్ చేయడం, మాట్లాడటం, వ్యాయామం చేయడం వంటి పనులు చేయకూడదు.

చర్మానికి నిమ్మతొక్క ఉపయోగించే విధానం IV : చర్మంలో మొటిమల రంద్రాలు, మచ్చలను తొలగించే ఫేస్ ప్యాక్

చర్మానికి నిమ్మతొక్క ఉపయోగించే విధానం IV : చర్మంలో మొటిమల రంద్రాలు, మచ్చలను తొలగించే ఫేస్ ప్యాక్

నొమ్మ తొక్కతో తయారుచేసే ఈ ఫేస్ ప్యాక్ కోసం రెండు పదార్థాలు చాలు. ఒకటి లెమన్ పీల్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్, కోకనట్ వాటర్ మూడు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఈ రెండూ బాగా కలపాలి. ఈ పేస్ట్ ను మొటిమలు, మచ్చలు, రంద్రాలున్న చోట అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఉదయాన్నేలెమన్ వాటర్ తాగితే: గొప్ప ప్రయోజనాలు

చర్మానికి నిమ్మతొక్క ఉపయోగించే విధానం V : చర్మ కాంతిని పెంచుకోవడం కోసం..

చర్మానికి నిమ్మతొక్క ఉపయోగించే విధానం V : చర్మ కాంతిని పెంచుకోవడం కోసం..

చాలా తక్కువ సమయంలో చర్మంలో ఇన్ స్టాంట్ గా కాంతి రావాలంటే లెమన్ పీల్ ఫేస్ ప్యాక్ సహాయపడుతుంది. చర్మంలో కాంతిని పెంచుతుంది. లెమన్ పీల్ పౌడర్ ను రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని, అందులో పసుపు అరటీస్పూన్, తేనె ఒక టేబుల్ స్పూన్ కలపాలి. మూడూ బాగా కలిపిన తర్వాత చర్మానికి అప్లై చేయాలి. డ్రై స్కిన్ ఉన్న వారు రోజ్ వాటర్ ను మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు.

English summary

Lemon Peels For Skincare | Skincare With Lemon Peels | How To Lemon Peels On Skin | Benefits Of Lemon Peels | Uses Of Lemon Peels

Lemon peels are beneficial for the skin and you can use them in the below listed ways.
Story first published: Tuesday, November 14, 2017, 15:00 [IST]
Subscribe Newsletter