For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందం విషయంలో మహిళలు & మగవారు తరచూ రిపీట్ చేస్తున్న కొన్ని తప్పులు!

By Ashwini Pappireddy
|

చర్మ సంరక్షణ విషయంలో ఎల్లపుడూ తప్పులు జరుగుతాయి.దాని గురించి తెలియక దానిని మీరు అనుకోకుండా చేసి ఉండవచ్చు. చర్మం నిపుణులు మీ చర్మం కోసం చిట్కాలను చెపుతారు కానీమీ చర్మ సంరక్షణ పొరపాట్లను గురించి చెప్పడం మరిచిపోవచ్చు.

ఏవిధంగా పురుషులు మరియు మహిళలు తరచుగా సాధారణ చర్మ సంరక్షణ విషయంలో తమ తప్పులను పునరావృతం చేస్తారో ఇక్కడ చూద్దామా.

స్నానం చేసేటప్పుడు చేసే పొరపాట్లతో చర్మానికి కలిగే హాని..!స్నానం చేసేటప్పుడు చేసే పొరపాట్లతో చర్మానికి కలిగే హాని..!

ఈ చర్మ సంరక్షణ తప్పులు అనేవి చాలా సాధారణం మరియు చాలా సార్లు మనకి తెలియకుండానే వాటిని

చేసేస్తూ ఉంటాము.సాధారణ చర్మ సంరక్షణ తప్పుల గురించి ఇక్కడ చదివి తెలుసుకోండి మరియు మీరు మళ్ళీ ఎప్పుడూ వాటిని పునరావృతం చేయరని ఆశిస్తున్నాము.

మీరు ఓల్డ్ గా క‌నిపించ‌డానికి కార‌ణ‌మ‌య్యే మేక‌ప్ మిస్టేక్స్మీరు ఓల్డ్ గా క‌నిపించ‌డానికి కార‌ణ‌మ‌య్యే మేక‌ప్ మిస్టేక్స్

స్కిన్ మిస్టేక్ I: ఓవర్ స్క్రబ్బింగ్ ఓవర్ మరియు ఓవర్ ఎక్సఫోలియాటింగ్ స్కిన్

స్కిన్ మిస్టేక్ I: ఓవర్ స్క్రబ్బింగ్ ఓవర్ మరియు ఓవర్ ఎక్సఫోలియాటింగ్ స్కిన్

తరచుగా బయటకు వెళ్లడం వలన చర్మం సులభంగా మురికి పడుతుంది మరియు దీనిని ఎక్సఫోలియాటింగ్ ఒక వేగవంతమైన మార్గం.ఎక్సఫోలియాటింగ్ చేయడం, చర్మం ని

స్క్రబ్బింగ్ చేయడం అనేవి సాదారణంగా మనం చేసేవి. కానీ వీటిని అతిగా చేయడం కూడా సమస్యతో కూడుకున్నది. అతిగా ప్యాక్ వేసుకోవడం మరియు స్క్రబ్బింగ్ చేయడం వలన, అది మీ చర్మంలోని సహజ ఆయిల్ ని తీసుకొని, మీ చర్మాన్ని పొడి బారినట్లు చేసి ఫ్లాకీ గా తయారుచేస్తుంది.

స్కిన్ మిస్టేక్ II: మేకప్ తోనే రాత్రి అంతా నిద్రపోవడం

స్కిన్ మిస్టేక్ II: మేకప్ తోనే రాత్రి అంతా నిద్రపోవడం

చాలామంది మహిళలు తరచుగా వర్క్ నుండి తిరిగి వచ్చిన తర్వాత లేదా పార్టీ నుండి తిరిగి వచ్చిన తర్వాత బాగా అలసిపోయి వారి చర్మంపై వున్న మేకప్ తోనే అలానే నిద్రపోతారు. మొత్తం రాత్రంతా మేకప్ రసాయనాలు అన్ని చర్మంపై వుండి మొత్తం చర్మం అంతా విస్తరించి లైన్ లను ఏర్పరుస్తుంది. దీనివలన

మీ చర్మం కాలక్రమేణా చాలా నిస్తేజంగా మరియు దిగులుగా కనిపిస్తుంది. ఈ విధంగా, మీరు ఒక ఫాన్సీ లుక్ కోసం వేసుకున్న మేకప్ ని మీరు ప్రతిసారీ ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే మీ మేకప్ ని పూర్తిగా తీసివేయండి.

స్కిన్ మిస్టేక్ III: రెగ్యులర్ CTM రొటీన్ ని మిస్ చేయడం

స్కిన్ మిస్టేక్ III: రెగ్యులర్ CTM రొటీన్ ని మిస్ చేయడం

CTM అనేది మూడు దశలను సూచిస్తుంది - క్లీన్సింగ్, టోనింగ్, మరియు మాయిశ్చరైజింగ్ . మీరు వారానికి ఒకసారి టోనింగ్ చేయవచ్చు, కానీ ప్రతిరోజూ క్లీన్సింగ్ మరియు మాయిశ్చరైజింగ్ చేయాలి. మీరు ఎంత బిజీగా ఉన్నా, మీ CTM రొటీన్ లని స్కిప్ చేయడం లేదా కట్ చేయడం వలన కాలక్రమేణా నిజంగా మీ చర్మానికి మీరు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.

స్కిన్ పొరపాటు IV: వేసవిలో మాత్రమే SPF- ఉత్పత్తులను ఉపయోగించడం

స్కిన్ పొరపాటు IV: వేసవిలో మాత్రమే SPF- ఉత్పత్తులను ఉపయోగించడం

వేసవి జరుగుతుండటంతో,అందరు పురుషులు మరియు మహిళలు ఒక మంచి సన్స్క్రీన్ ని పొందడానికి మేకప్ స్టోర్ కి వెళతారు. అది శరదృతువు నుండి వింటర్ కి వచ్చేసరికి దానిని ఉపయోగించడం మానేస్తాము.నిజానికి, సంవత్సరం యొక్క 365 రోజులలో ప్రతి రోజు సన్స్క్రీన్ను ఉపయోగించడం చాలా ఉత్తమమైనది.

స్కిన్ మిస్టేక్ V: అందుబాటులో వున్న అన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ బ్రాండ్స్ ని వాడటం

స్కిన్ మిస్టేక్ V: అందుబాటులో వున్న అన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ బ్రాండ్స్ ని వాడటం

మార్కెట్ లో అందుబాటులో వున్న రకాల బ్రాండ్లు మరియు వివిధ సౌందర్య ఉత్పత్తుల సంఖ్య నిజానికి కంటి మీద చెడు ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి ఎంపిక చేయడానికి తీవ్రమైన పరిశోధన అవసరమవుతుంది. కేవలం పరిశోధన చేయడం గురించి పక్కన పెడితే, అన్ని రకాల మేకప్ మరియు అందం సంరక్షణ ఉత్పత్తుల ను మీ ముఖానికి ఇష్టమొచ్చినట్లు వాడకండి. ఇదంతా మీరు ఒక మీ ముఖంపై ఒక చర్మ ఉత్పత్తులను వాడటం దానిమీద ఎలాంటి ప్రభావం కలుగుతుందో అని అయోమయం చెంది మరొక ఉత్పత్తిని వాడటం మళ్ళీ దానిని వదిలేసి ఇంకొకటి వాడటం మొదలు పెడుతుంటారు. దీనికి మీరు ఒక బ్రాండ్ ని ట్రై చేసి మరియు అది మీ చర్మంపై ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడమే మీ ఔషదం.

స్కిన్ మిస్టేక్ VI: స్కిన్ యొక్క కొంతభాగం మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించడం

స్కిన్ మిస్టేక్ VI: స్కిన్ యొక్క కొంతభాగం మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించడం

ఇక చర్మ సంరక్షణ విషయానికి వస్తే, సూర్యుడికి ఎక్సపోజ్ అవుతున్న కొంత భాగంవరకు ఉదాహరణకు, నుదురు, బుగ్గలు మరియు మొదలైనవి. దవడ, మెడ లేదా చెవులు ,వీపు వంటి చర్మం యొక్క మృదువైన మరియు సున్నితమైన ప్రాంతాలను మిస్ అవుతారు. ఫలితం అసమాన చర్మ టోన్. మీరు

ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాలి, చర్మం మన శరీరం యొక్క అతిపెద్ద అవయవంగా ఉంటుంది మరియు తల నుండి బొటనవేలు వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి.

స్కిన్ పొరపాటు VII: జిట్స్ మరియు పింపుల్స్ తో ఆడుకోవడం

స్కిన్ పొరపాటు VII: జిట్స్ మరియు పింపుల్స్ తో ఆడుకోవడం

జిట్స్ లేదా మొటిమలతో చుట్టూ మనం తాకుతూ గిల్లడం మనందరి అభిమాన టైంపాస్ గా చెప్పవచ్చు

కానీ మీరు మరింత తాకడం వలన అది మీ చర్మంపై అంతా విస్తరించి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాటుకి బాయ్ చెప్పి మరియు వాటిని మీ చర్మంపై తక్కువగా పొందండి. జిట్స్ మరియు మొటిమలను చికిత్స చేయడానికి సరైన మార్గం కేవలం మాయిశ్చరైజింగ్ సాలిసిలిక్ యాసిడ్ ని అప్లై చేయడం.

స్కిన్ మిస్టేక్ VIII: స్కిన్ డ్రై అవడానికి సమయం కేటాయించాలి.

స్కిన్ మిస్టేక్ VIII: స్కిన్ డ్రై అవడానికి సమయం కేటాయించాలి.

ఇక చర్మ సంరక్షణ విషయానికి వస్తే, దీనిని అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం. మనందరం సాధారంగా చేసే తప్పు చర్మం ని ఆరబెట్టకుండా మరియి తడి చర్మం ఫై అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ని వాడటం. ఇలా చేయడం వలన మీ మేకప్ మీ శరీరం లోని చర్మపు రంధ్రాలకి వ్యాప్తి చెందడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి, ఎల్లవేళలా పొడి చర్మంపై మాత్రమే అన్ని అందం మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడాలి.

English summary

Major Skin Care Mistakes | Skin Care Mistakes | Everyday Skin Care Mistakes

Check out these skin care mistakes and put a stop to it, if you also do the same.
Desktop Bottom Promotion