పాలిపోయిన చర్మంతో బాధపడే ప్రతి అమ్మాయి అనుసరించాల్సిన మేకప్ ఐడియాలు

Posted By:
Subscribe to Boldsky

పాలిపోయిన చర్మం కలవారు మేకప్ అనవసరంగా ఉండి, వారికి సరైనది కాదని భావిస్తారు. అయితే, పాలిపోయిన చర్మానికి మేకప్ వేయడ చాలా ఇబ్బంది గానే ఉంటుందని చెప్పొచ్చు కాని అది అసాధ్యం కాదు.

మీరు పాలిపోయిన చర్మం కలిగి ఉన్నట్లయితే, మీ ఛాయను దాచుకోవలసిన అవసరం లేదు, డానికి బదులుగా మేకప్ తో మీ ముఖ ఛాయను మెరుగుపరుచుకోవచ్చు.

మీకు పాలిపోయిన చర్మం కలిగి ఉంటే, మీరు ఈ కొద్దిపాటి చిట్కాలను పాటిస్తే మేకప్ వేసుకోవడం చాలా తేలిక నన్ను నమ్మండి. పాలిపోయిన చర్మం గల ప్రతి అమ్మాయి అనుసరించ వలసిన కొన్ని తేలికపాటి మేకప్ ఐడియాలు ఇవ్వబడ్డాయి. ఈ చిట్కాలు పాలిపోయిన చర్మానికి బాగా పనికొస్తాయి, నన్ను నమ్మండి.

బ్లష్ ఎంచుకోండి

బ్లష్ ఎంచుకోండి

పాలిపోయిన చర్మం గల అమ్మాయిలూ, మీకు బ్లష్ అనేది సరైన మేకప్ పద్ధతి. ఎల్లప్పుడూ లీతరంగు బ్లష్ లను ఎంచుకోండి, అవి మీ ముఖ వర్చస్సును మెరుగుపరచడానికి సహాయపడి, మీరు అందంగా కనిపించేట్టు చేస్తుంది. అయితే, మీ ముఖం కృత్రిమంగా, ఎక్కువ పౌడరీ గా కనిపించేట్టు కాకుండా ఉండేట్టు చూసుకోవడం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ తేలికపాటి రంగు గల బ్లాష్ ను ఉపయోగించండి, అది మీ చర్మానికి పొగడ్తలు తెస్తుంది.

లిప్స్టిక్ రంగు

లిప్స్టిక్ రంగు

పాలిపోయిన చర్మం గల అమ్మాయిలకు, సున్నితమైన రంగు గల లిప్స్టిక్ లు ఎల్లప్పుడూ మంచి ఎంపిక. ముదురు, ఎక్కువ మెరిసే లిప్స్టిక్ లు మీ చర్మ టోన్ కి సరిపోక, చాలా అసహ్యంగా కనిపిస్తాయి కాబట్టి వాటిని వాడకండి. ముదురు రంగు లిప్స్టిక్ లను కాకుండా, గులాబి పింక్, లేత నేరేడు రంగు, గులాబీ గోల్డ్ పింక్ లేదా ఇతర లేతరంగులను ఉపయోగించండి. ఈ లేత సున్నితమైన రంగు లిప్స్టిక్ లు మీ స్కిన్ టోన్ కి బాగా నప్పుతాయని నమ్మండి.

మస్కారా

మస్కారా

పాలిపోయిన చర్మం గల ప్రతి స్త్రీ ఉపయోగించే ముఖ్యమైన అందమైన వస్తువులలో మస్కారా ఒకటి. మీరు ఈ మస్కారా తో మీ కళ్ళను అందంగా, ఆకర్షణీయంగా తయారుచేసుకోవచ్చు. మీరు మీ స్కిన్ టోన్ కి సరిపడే, తేలికపాటి రంగులతో కూడిన మస్కారాలను ఎంచుకోవడం మంచిది. ముదురు రంగు మస్కారాలను కాకుండా, ఇవి అందంగా ఉన్న ముఖానికి బాగా నప్పుతాయి. ప్లం, గ్రే, చంపానే ఇతర మృదువైన రంగులు మీ అందాన్ని ఇనుమడింప చేస్తాయి.

 ఐ షాడో లలో లేత రంగులు

ఐ షాడో లలో లేత రంగులు

మీరు ఐ షాడో వేసుకోవాలి అనుకుంటే, లేత, చల్లని చాయ గల ఐ షాడో లను ఎంచుకోవాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ స్కిన్ టోన్ కి నప్పే లేత రంగు ఐ షాడో ను ఎల్లప్పుడూ ఎంచుకోండి. పాలిపోయిన స్కిన్ టోన్ కలిగిన వారు మీ కళ్ళకు నప్పెట్టు లేత గ్రే, లేత పింక్, తేలికపాటి గోల్డెన్ వంటి ఇతర రంగులు మీకు బాగా సరిపడతాయి.

 ఐ లైనర్ ని ఉపయోగించండి

ఐ లైనర్ ని ఉపయోగించండి

ఐ లైనర్ ని ఉపయోగించడం చాలా ముఖ్యం ఎందుకంటే అది మీ స్కిన్ టోన్ ని అందంగా చేస్తుంది. పాలిపోయిన చర్మం కల అమ్మాయిలూ కను రెప్పలకు ఐ లైనర్ లేదా రెండు కనురెప్పలను ఐ లైనర్ చాలా అందంగా ఉంటుంది. లిక్విడ్ ఐ లైనర్ ని ఎంచుకోండి, పెన్సిల్ ఐ లైనర్ మొత్తం మీ ముఖాన్ని నాశనం చేస్తుంది. పాలిపోయిన చర్మం గల అమ్మాయిలూ అదనపు గ్లాస్ ఐ లైనర్ ని వాడకండి.

మితమైన రంగులను ఉపయోగించండి

మితమైన రంగులను ఉపయోగించండి

పాలిపోయిన చర్మానికి మేకప్ ను ఎంచుకునేటపుడు, ఎల్లప్పుడూ మితమైన, అధునాతన రంగులను ఎంచుకోండి. మితమైన రంగులు మీ చర్మంతో కలిసిపోయి, మంచి టోన్ ని ఇస్తుంది. ముదురు లేదా పసేల్ రంగులు మీ ముఖానికి అసహజంగా కనిపించి, ఎక్కువ వయసు వారిలో కనిపించేట్టు చేస్తుంది. పాలిపోయిన చర్మం కలవారు తేనె, పీచ్ లేదా లేత పింక్ రంగును ఎంచుకోండి. అది మీకు సున్నితంగా, తేలికగా, అందంగా ఉండేట్టు చేస్తుంది.

మీరు నివారించాల్సిన రంగులు

మీరు నివారించాల్సిన రంగులు

పాలిపోయిన చర్మం గల వారు వారి ముఖంపై వాడే రంగులతో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు బ్రౌన్, మురుదు ఎరుపు, మెరూన్ లేదా డార్క్ పింక్ రంగులకు దూరంగా ఉండాలి. ఈ రంగులు మీ ముఖానికి అందాన్ని ఇవ్వవు, ఇవి మిమ్మల్ని ఫాషన్ విపత్తు లాగా తయారుచేస్తాయి. అంతేకాకుండా, పాస్టెల్, పసుపు రంగు షెడ్ లను ఉపయోగించడం మానేయడం మంచిది.

English summary

Makeup Ideas Every Girl With Pale Skin Should Follow

Pale skin can surely look dull and lifeless; however, with the right kind of makeup, girls with pale skin can look their best.
Story first published: Saturday, April 15, 2017, 15:00 [IST]
Subscribe Newsletter