For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ మూడు మూలికలు కలిపి, 15నిమిషాల పాటు ఆవిరిపట్టండి, మీ చర్మంపై కలుషిత పదార్థాలను తొలగించి, తేమను పెంచ

కొత్త దిల్లీలో జరిగిన స్కేచర్స్ స్ట్రీట్ పార్టీలో కృతి సనన్ సెలబ్రిటీ అతిధిగా పాల్గొంది. బబుల్ గమ్ పింక్ స్టైల్ లో ఆమె చాలా కూల్ గా అందంగా కనిపించింది.

|

మన రోజువారి చర్మసంరక్షణ ఇలా ఉంటుంది- శుభ్రపర్చటం, టోనింగ్, మాయిశ్చరైజర్ వాడటం మరియు వారానికోసారి ముఖానికి మాస్క్, కదా? మీరు ఇది చాలని అనుకోవచ్చు, కానీ మీరు పెద్ద మార్పు తెచ్చే ఒక ముఖ్యమైన పనొకటి మర్చిపోతున్నారు.- పొడి చర్మానికి, జిడ్డు చర్మానికి, మిశ్రమ చర్మానికి హెర్బల్ ఆవిరిపట్టటం!

మీ చర్మం ఉత్పత్తి చేసే సెబం అనే స్రావం మీ చర్మాన్ని రక్షిస్తూ, పొడిబారకుండా కాపాడుతుంది. ఇది గ్రంథులలో చిక్కుకుపోయినప్పుడు మొటిమలు ఏర్పడుతాయి.

kriti sanon at skechers event in new delhi

ఆవిరి పట్టటం వలన మీ ముఖంపై చెమట పట్టి, అది గ్రంథులను తెరుస్తుంది, మృతకణాలతో నిండిన పై ఉపరితల పొరను వదులు చేసి మురికిని బయటకి వదులుతాయి.

అదేకాదు, ఇది రక్తనాళాలను వెడల్పు చేసి రక్తప్రసరణను ప్రేరేపిస్తుంది, ఇంకా చర్మం ఆక్సిజన్ ను, పోషకాలను బాగా పీల్చుకుని మీకు మెరిసిపోయే కాంతిని అందిస్తుంది.

కానీ, పొడిచర్మానికి హెర్బల్ ఆవిరి పట్టటం గూర్చి అందరికీ చాలా సందేహాలు ఉంటాయి. క్లెన్సింగ్ తర్వాత ఆవిరి పట్టాలా? ఎంతసేపు పట్టాలి? ఏ మూలికలను కలపాలి? అన్ని రకాల చర్మరకాలకి ఈ మూలికలు ఒకేలా ప్రభావం చూపుతాయా?

ఇదిగో ఈ ప్రశ్నలకి జవాబులివ్వటం కోసమే మేము ఇక్కడ ఉన్నాం. 5 నుంచి 10 నిమిషాలకి మించి ఆవిరి పట్టకండి. అలాగే వారానికోసారి ఇలా హెర్బల్ ఆవిరి పడితే చాలు. మీది మొటిమలు వచ్చే చర్మం అయితే, ముందు వైద్యున్ని సంప్రదించండి.

మీకు పొడిచర్మం ఉన్నట్లయితే, తేమను పెంచే ఆవిరి, జిడ్డు చర్మానికి అదే వ్యతిరేకంగా చేయండి. ఇవేకాక, ఇక్కడ ఆవిరితో చర్మంపై పేరుకున్న కలుషిత పదార్థాలను ఎలా తొలగించుకోవాలో వివరంగా స్టెప్ బై స్టెప్ పద్ధతి అందించబడింది!

స్టెప్ 1

స్టెప్ 1

మీ ముఖాన్ని మైల్డ్ ఫేస్ వాష్ తో కడగండి. ముందు ముఖాన్ని కడుక్కోకుండా హెర్బల్ ఆవిరి పడితే, మొహంపై ఉన్న మురికి, మేకప్ పదార్థాలన్నీ గ్రంథుల లోపలికి మరింతగా వెళ్ళిపోతాయి.

స్టెప్ 2

స్టెప్ 2

స్క్రబ్. కొంచెం రేణువులున్న స్క్రబ్ ను వాడి గుండ్రంగా చేతులు తిప్పుతూ ముఖంపై రుద్దండి. ముక్కు, నుదురు ప్రాంతాలపై ఎక్కువ ధ్యాస పెట్టండి. ఒక నిమిషం పాటు ఇలా చేసి మామూలు నీళ్ళతో ముఖాన్ని కడిగేయండి. నెమ్మదిగా తడిని వత్తుకోండి.

స్టెప్ 3

స్టెప్ 3

3 కప్పుల మంచినీరును ఒక కుండలాంటి పాత్రలో పోసి మరగనివ్వండి. మంట తగ్గించి 3 చుక్కల గులాబీ నూనెను వేయండి. గులాబి చర్మాన్ని శుభ్రపరిచి, టోన్ చేస్తుంది. ఏమైనా మరకలుంటే వాటి రంగుతేల్చి, చర్మం ఎర్రబారకుండా చూస్తుంది.

స్టెప్ 4

స్టెప్ 4

అరచెంచా నిమ్మతొక్క పొడిని నీటికి కలపండి. ఆవిరిలో నిమ్మ చర్మంపై మురికిని తొలగించి, విషపదార్థాలను తీసివేసి, చర్మాన్ని మెత్తగా మారుస్తుంది మరియు ఏమైనా నల్లని మచ్చలుంటే తెల్లబరుస్తుంది.

 స్టెప్ 5

స్టెప్ 5

ఆఖరున, 3 చుక్కల చమోమిలే (చామంతి) నూనెను వేయండి. ఇందులో ఉండే వాపులను తగ్గించే లక్షణం బ్యాక్టీరియాను చంపేసి, మంటతో ఉన్న పొడి చర్మానికి తేమను అందిస్తుంది.

స్టెప్ 6

స్టెప్ 6

మీ చర్మం మరీ దురద పెడుతుంటే, అరచెంచా ఎండబెట్టిన లావెండర్ ఆకులను నీటికి కలపండి. ఇది దురద నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది, మంటను తగ్గేలా చేస్తుంది. పైగా ఇది చాలా సున్నితంగా,హాయిగా కూడా ఉంటుంది.

స్టెప్ 7

స్టెప్ 7

ఈ వేడి ద్రావణాన్ని ఒక పెద్ద గిన్నెలో పోసి బల్లపై ఉంచండి. మొహంపై జుట్టు అడ్డురాకుండా హెయిర్ బాండ్ లేదా ముడి వేసుకోండి. మీ ముఖాన్ని గిన్నె వద్దకు తీసుకెళ్ళండి. మరీ దగ్గరగా కాదు లేకపోతే మీ చర్మం కమిలిపోతుంది. ఆవిరి కక్కుతున్న గిన్నెకి కొన్ని అంగుళాల దూరంలో మీ ముఖం ఉంచండి. మీ తలను తువ్వాలుతో మూసేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఆవిరి పట్టండి.

స్టెప్ 8

స్టెప్ 8

ఏ సమయంలోనైనా ఆవిరి మరీ వేడిగా అన్పిస్తే, వెంటనే మొహాన్ని వెనక్కి తీసేయండి. తర్వాత మీ మొహాన్ని చల్లనీరుతో కడుక్కోండి.

స్టెప్ 9

స్టెప్ 9

కొన్ని చుక్కల యాపిల్ సిడర్ వెనిగర్ ను దూదిపై తీసుకుని మీ మొహం, మెడ మొత్తం అద్దండి. గడకట్టించే లక్షణాలున్న వెనిగర్ చర్మగ్రంథులను మరింత శుభ్రం చేసి, చర్మాన్ని టోన్ చేస్తుంది. ఒకనిమిషం అలానే ఉంచి కడిగేయండి. తువ్వాలుతో తడిని అద్దుకోండి.

స్టెప్ 10

స్టెప్ 10

మీ ముఖాన్ని పోషకవిలువలున్న ఫేస్ క్రీమ్ తో మసాజ్ చేయండి.రెండు నిమిషాలు గుండ్రంగా తిప్పుతూ క్రీం చర్మంలోకి ఇంకేదాకా అలానే చేయండి.

ఏం ఆశించవచ్చు?

ఏం ఆశించవచ్చు?

ఈ తేమనిచ్చే ఆవిరి మిశ్రమం మీ చర్మానికి అద్భుతమైన కాంతినిచ్చి, మెత్తగా, శుభ్రంగా మారుస్తుంది. కానీ జాగ్రత్త కోసం, పైన మేము చెప్పిన ఏ పదార్థాలకీ మీకు అలర్జీ ఉందో లేదో నిర్థారించుకునే పాటించండి. మీ చర్మం మరీ పొడిదైతే, ఈ హెర్బల్ ఆవిరి నెలకి రెండుసార్లకి మించి తీసుకోవద్దు!

English summary

Mix These 3 Herbs & Take Steam For 15 Min, It Will Remove Skin Impurities & Hydrate Skin!

This is precisely why we are here. Steam for not more than 5 to 10 minutes. Restrict herbal steam once a week. If you have an acne-prone skin, consult with a doctor first. If you have dry skin, use hydrating steam blend and vice versa for oily skin. Other than that, here is step-by-step method on how to remove skin impurities naturally with steam!
Story first published:Thursday, December 7, 2017, 18:35 [IST]
Desktop Bottom Promotion