బ్లాక్ హెడ్స్ పోగొట్టే న్యాచురల్ హోం రెమెడీస్ !

Posted By:
Subscribe to Boldsky

ముఖంపై ఏర్పడే చిన్న చిన్న నల్లని మచ్చలు... ఇవంటే అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకూ ఇష్టం ఉండదు. ఇవి ముఖాలను అందవిహీనంగా చేయడమే కాదు, కొన్ని సార్లు మానసికంగా కూడా కుంగదీస్తాయి. వీటినే బ్లాక్‌హెడ్స్ అంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ బ్లాక్‌హెడ్స్‌ను నివారించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.

మన చర్మం కింద సెబాసియస్ గ్లాండ్స్ ఉంటాయి. యుక్త వయస్సులో ఈ గ్లాండ్స్ చురుకుగా పనిచేస్తాయి. సెబమ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల చర్మంపై ఎర్రగా లేదా నల్లడా ఉండే పింపుల్స్ ఏర్పడతాయి. నల్లగా ఉండే పింపుల్స్‌ను బ్లాక్ హెడ్స్ అంటారు. ఇవి మామూలు పింపుల్స్ కన్నా పెద్దగా ఉంటాయి.

బ్లాక్ హెడ్స్ పోగొట్టే న్యాచురల్ హోం రెమెడీస్ !

మన చర్మానికి అవసరమైన పోషక పదార్థాలను అందజేసే క్రమంలో రక్తం నుంచి అదనంగా ఉండే నూనె పదార్థాలు, సెబమ్, మరికొన్ని రసాయన పదార్థాలు వెలువడతాయి. ఇవి చర్మ రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. బయట ఉండే దుమ్ము, ధూళి కూడా ఇవి ఏర్పడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇవి ఎక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వారికి ఈ సమస్య మరింతగా ఉంటుంది.

ముఖం మీద బ్లాక్ హెడ్స్ కారణాలు: నివారణ చిట్కాలు

బ్లాక్ హెడ్స్ పోగొట్టే న్యాచురల్ హోం రెమెడీస్ !

చాలామంది బ్లాక్‌హెడ్స్‌ని తొలగించడానికి ట్వీజర్లని వాడుతుంటారు. దాంతో వచ్చే పెద్ద ఇబ్బంది ఏంటంటే.. తొలగించిన తర్వాత చర్మ రంధ్రాలు అంత త్వరగా మూసుకుపోవు. ఆ రంధ్రాలు మళ్లీ దుమ్మునీ, ధూళినీ ఆకర్షించి సమస్య మరింతగా పెరుగుతుంది. కాబట్టి, బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి కొన్ని సింపుల్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

బ్లాక్ హెడ్స్ తొలగించే తేనె

బ్లాక్ హెడ్స్ తొలగించే తేనె

ఒక టీ.స్పూను స్వచ్ఛమైన తేనె ఒక టీస్పూను పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని పది సెకండ్లపాటు వేడిచేసి చల్లారాక బాగా కలిపి బ్లాక్‌ హెడ్స్‌ మీద ఒక లేయర్‌లా అప్లై చేయాలి. తర్వాత పొడి బట్టను ఆ ప్రదేశంలో అంటించి బాగా అతుక్కున్న తర్వాత పీకేయాలి. అప్పుడు బట్టతోపాటు బ్లాక్‌హెడ్స్‌ కూడా ఊడి వచ్చేస్తాయి. తర్వాత చ్ల నీళ్లతో కడిగేసుకోవాలి.

బ్లాక్ హెడ్స్ తొలగించే బేకింగ్‌ సోడా

బ్లాక్ హెడ్స్ తొలగించే బేకింగ్‌ సోడా

గోరువెచ్చని నీళ్లలో బేకింగ్‌ సోడా కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌తో వృత్తాకారంలో బ్లాక్‌హెడ్స్‌ ఉన్న ప్రదేశంలో మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే చర్మ రంథ్రాలు తెరుచుకుని బ్లాక్‌హెడ్స్‌ బయటకు వచ్చేస్తాయి. తర్వాత నీళ్లతో ముఖం శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి.

బ్లాక్ హెడ్స్ తో టీనేజ్ మూడ్ ఆఫ్: చిట్కాలుబ్లాక్ హెడ్స్ తో టీనేజ్ మూడ్ ఆఫ్: చిట్కాలు

బ్లాక్ హెడ్స్ తొలగించే తేనె, దాల్చిన చెక్క

బ్లాక్ హెడ్స్ తొలగించే తేనె, దాల్చిన చెక్క

దాల్చిన చెక్క, తేనెలను సమపాళ్లలో తీసుకుని పేస్ట్‌లా తయారుచేయాలి. ముఖం మీద అప్లై చేసి శుభ్రమైన బట్టతో కప్పేయాలి. 5 నిమిషాలాగి శుభ్రంగా కడిగేసుకోవాలి.

బ్లాక్ హెడ్స్ తొలగించే నిమ్మరసం, బేకింగ్‌ సోడా

బ్లాక్ హెడ్స్ తొలగించే నిమ్మరసం, బేకింగ్‌ సోడా

ఒక స్పూను నిమ్మ రసంలో బేకింగ్‌ సోడా కలిపి పేస్ట్‌లా చేసి బ్లాక్‌హెడ్స్‌ మీద అప్లై చేయాలి. మునివేళ్లతో సున్నితంగా 3 నిమిషాలపాటు మసాజ్‌ చేసి నీళ్లతో కడిగేసుకోవాలి.

బ్లాక్ హెడ్స్ తొలగించే టమేటా

బ్లాక్ హెడ్స్ తొలగించే టమేటా

టమేటాల్లో బ్లాక్‌హెడ్స్‌ను పొడిబార్చే యాంటీసెప్టిక్‌ గుణాలుంటాయి. కాబట్టి రాత్రి పడుకోబోయేముందు టమేటా గుజ్జును ముఖానికి పట్టించాలి. ఉదయాన్నే చల్ల నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పక వారం రోజులపాటు చేస్తే బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోతాయి.

బ్లాక్ హెడ్స్ తొలగించే టూత్‌పేస్ట్‌

బ్లాక్ హెడ్స్ తొలగించే టూత్‌పేస్ట్‌

బ్లాక్‌హెడ్స్‌ ఉన్న ప్రదేశంలో టూత్‌పే్‌స్టను పల్చని లేయర్‌లా అప్లై చేయాలి. 25 నిమిషాలాగి చల్ల నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే బ్లాక్‌హెడ్స్‌ వదులుతాయి.

బ్లాక్ హెడ్స్ తొలగించే ఓట్‌మీల్‌, పెరుగు

బ్లాక్ హెడ్స్ తొలగించే ఓట్‌మీల్‌, పెరుగు

2 స్పూన్ల ఓట్‌మీల్‌కు 3 స్పూన్ల పెరుగు, ఒక టీస్పూను నిమ్మరసం, ఒక టీస్పూను ఆలివ్‌ ఆయిల్‌ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

బ్లాక్ హెడ్స్ ను శాశ్వతంగా తొలగించే ఇంటి చిట్కాలు

బ్లాక్ హెడ్స్ తొలగించే గుడ్డు తెల్లసొన, తేనె

బ్లాక్ హెడ్స్ తొలగించే గుడ్డు తెల్లసొన, తేనె

రెండు గుడ్ల తెల్ల సొనలకు ఒక టే.స్పూను తేనె కలిపి బాగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట ఆగి కడిగేసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా చేస్తే తప్పక ప్రయోజనం ఉంటుంది.

బ్లాక్ హెడ్స్ తొలగించే గ్రీన్‌ టీ

బ్లాక్ హెడ్స్ తొలగించే గ్రీన్‌ టీ

గ్రీన్‌ టీ ఆకులని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఆ పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా చేసుకోవాలి. దానిని సమస్య ఉన్న చోట రాసి ఆరిన తర్వాత కడిగేయాలి. బ్లాక్‌హెడ్స్‌ పోతాయి.

బ్లాక్ హెడ్స్ తొలగించే ఎప్సమ్‌సాల్ట్‌

బ్లాక్ హెడ్స్ తొలగించే ఎప్సమ్‌సాల్ట్‌

ఒక కప్పు నీళ్లలో కొద్దిగా ఎప్సమ్‌సాల్ట్‌ కలపాలి. దానికి తగినంత సెనగపిండిని కలిపి ప్యాక్‌లా తయారుచేసి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి

English summary

Natural Home Remedies to Get Rid of Blackheads Fast In Telugu

If you are tired of scrubbing your nose to remove those stubborn blackheads, then its time for you to try some other ways. Blackheads, also known as open comedones is a common symptom of acne. Blackheads develop when the skin pores are clogged with oil, dirt and dead skin cells.
Subscribe Newsletter