For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మం మెరిపంచడానికి : నేచురల్ పదార్థలతో స్కిన్ స్ర్కబ్బింగ్

ప్రస్తుత వాతావరణంలో తరచూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్క తీవ్రమైన ఎండలు, మరో పక్క అక్కడక్కడ కొద్ది కొద్దిగా వానలు..ఇలా వాతావరణం ఎప్పటికప్పుడు విభిన్నంగా కబడుతోంది. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్యం సం

|

ప్రస్తుత వాతావరణంలో తరచూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్క తీవ్రమైన ఎండలు, మరో పక్క అక్కడక్కడ కొద్ది కొద్దిగా వానలు..ఇలా వాతావరణం ఎప్పటికప్పుడు విభిన్నంగా కబడుతోంది. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్యం సంరక్షణతో పాటు, చర్మ సంరక్షణ విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

అలాగే కాలుష్యం ప్రభావం నుంచి కూడా చర్మాన్ని రక్షించుకోవాలి. చర్మం మీద పేరుకున్న దుమ్ము, ధూళిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. దీనికోసం చర్మాన్ని స్ర్కబ్ చేసుకోవడం ఉత్తమం. మార్కెట్లో ఎన్నో రకాల స్ర్కబ్స్ లభిస్తున్నప్పటికీ ఇంట్లోనే మనకు అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో స్ర్కబ్ ని తయారుచేసుకోవడం మంచిది. మరి వాటిని ఎలా తయారుచేసుకోవాలో చూద్దామా..

బొప్పాయితో :

బొప్పాయితో :

బొప్పాయిలో ఉండే విటమిన్స్, న్యూట్రీషియన్స్ చర్మానికి మేలు చేసేవే.దీంతో తయారుచేసే స్ర్కబ్ వల్ల చర్మం శుభ్రపడటంతో పాటు చక్కటి పోషణ కూడా అందుతుంది. అలాగే ఇది ఏ చర్మ తత్వం కలిగిన వారికైనా ఫర్ఫెక్ట్ గా నప్పుతుంది. బొప్పాయి ముక్కలను తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో కొద్దిగా బ్రౌన్ షుగర్ , ఓట్ మీల్ పౌడర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మర్ధన చేయాలి. రెండు నిముషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

పీచ్ :

పీచ్ :

పీచ్ పండు నుంచి గింజను వేరు చేసి ముద్దగా చేసుకోవాలి. దీనికి కప్పు పంచదార , అరకప్పు ఆలివ్ నూనె కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో కొంతసేపు మర్ధ చేసుకుని, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పీచ్ ఫ్రూట్ లో ఉన్న విటమిన్ ఎ, సి, కె, పొటాషియం వంటి పోషకాలు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తాయి. అలాగే అతినీలలోహిత కిరణాల ప్రభావానికి చర్మం గురి కాకుండా చూస్తాయి. పంచదార చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. ఈ స్క్రబ్ పొడి చర్మం కలిగిన వారికి బాగా నప్పుతుంది.

గంధం :

గంధం :

గంధం పౌడర్ లో నారింజ తొక్కల పొడి, ముల్తానీ మట్టిని కొద్దిగా నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీనితో ముఖాన్ని కాసేపు సున్నితంగా మర్ధన చేసుకుని అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. నారింజ చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ముల్తానీ మట్టి చర్మం జిడ్డుగా మారకుండా చేస్తుంది. చందనం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. ఈ స్క్రబ్ జిడ్డు చర్మతత్వం కలిగిన వారికి బాగా పనిచేస్తుంది.

మెంతులు:

మెంతులు:

మెంతిపిండి, శెనగపిండి, పెసరపిండి సమంగా తీసుకుని, ఈ మూడు బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమ పిండిని స్నానం చేసే సమయంలో రోజ్ వాటర్ కలిపి శరీరం మొత్తం మర్ధన చేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, మురికి తొలగిపోవడంతో చర్మం సాప్ట్ గా మారుతుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో కొద్దిగా తేనె, పంచదార మిక్స్ చేయాలి. పేస్ట్ లా తయారైన తర్వాత స్ర్కబ్ చేసి మొత్తం శరీరానికంతటికి ఉపయోగించుకోవచ్చు. ఈ మిశ్రమానికి చర్మాన్ని మెరిపించే గుణం కూడా ఉంటుంది.

స్క్రబ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి:

స్క్రబ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి:

రెండు నిముసాలకు మించి చర్మాన్ని రుద్దకూడదు. ఎందుకంటే అంత కంటే ఎక్కువ సమయం స్ర్కబ్ చేస్తే చర్మం వదులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరీ వేగంగా, గట్టిగా కూడా స్ర్కబ్ చేసుకోకూడదు.

వారానికి రెండు సార్లు కంటె ఎక్కువ స్ర్కబ్ చేసుకోకూడదు.

స్ర్కబ్ చేసుకున్న వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోకూడదు. కాసేపాగిన తర్వాత మాత్రమే రాసుకోవాలి.

English summary

Natural Homemade Skin Scrubs

Facial scrubs remove the dead cells from skin and improve complexion. They also open up the skin pores to remove black heads. There are some homemade facial scrubs that we will share with you today.
Desktop Bottom Promotion