For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పులిపిర్లును శాశ్వతంగా పోగొట్టే ఎఫెక్టివ్ న్యాచురల్ రెమెడీస్

By Mallikarjuna
|

ఎంత మంచి రూపమైనా పులిపిర్లు కుప్పలుగా ఏర్పడితే కురూపమే వచ్చేస్తుంది. కాకపోతే పులిపిర్లలో చాలా వరకు హానికరం కావు. వైరస్ ఇన్ఫెక్షన్‌లతో చర్మం పై పొరలో ఏర్పడే ఈ పులిపిర్లు క్యాన్సర్ కారకం మాత్రం కావు. పులిపిర్లు చాలా వరకు హాని కారకం కావు. పులిపిరికాయలు చాలా సాధారణమైన సమస్య. జనాభాలో ప్రతి వందమందిలోనూ కనీసం 10-15 మందికి చర్మంపైన పులిపిరులు కనిపిస్తుంటాయి. పులిపిరికాయలను ఉలిపిరి కాయలనీ, వార్ట్స్ అనీ సాధారణ పేర్లతో పిలుస్తుంటారు.


పులిపిరులకు ప్రధాన కారణం వైరస్ (హ్యూమన్ పాపిలోమా వైరస్). ఎక్కువగా యుక్త వయస్కుల్లో కనిపిస్తాయి. మగవారికంటే మహిళల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి. పులిపిరి కాయలు చూడటానికి చర్మపురంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఒత్తిడి పడేచోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖంపైనా, మెడపైనా, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి.


ఈ వైరస్ ప్రత్యక్ష సంబంధం వల్ల అంటే పులిపిర్లు ఉన్న వ్యక్తి వాడిన వస్తువులు ఇతరులు వాడినపుడు వారికి వచ్చే ప్రమాదం ఉంది. పులిపిరి ఉన్నచోట గోకి అదే సమయంలో వేరే చోట రుద్దడం వల్ల్ల కూడా పులిపిర్లు ఒకచోటి నుంచి మరోచోటుకు వ్యాప్తి చెందవచ్చు. కొన్ని రకాల పులిపిర్లు వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తాయి. వాటిలో కొన్ని వాటంతటవే కనిపించకుండా పోతాయి. హెచ్‌పీవీ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన పిదప శరీర కణజాలంలో కొన్ని మార్పులు జరిగి చర్మంపై పొర కింది భాగాన ఉండే తెల్లని గట్టి ప్రొటీన్ ఏర్పడుతుంది. ఇది చర్మం మీద ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. దీన్నే మనం పులిపిరి అంటారు. దీని వల్ల నొప్పి ఉండదు.

లక్షణాలు :పులిపిర్లు శరరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. అయితే వాటి మీద ఒరిపిడి జరిగినపుడు అవి పెద్దవైపోవడంతో పాటు నొప్పిని కూడా కలిగిస్తాయి. అయితే చేతులు, కాళ్లు, గడ్డం పైన వచ్చే పులిపిర్లు ఏ కారణంగానైనా తెగితే రక్తవూసావం అంత సులభంగా ఆగదు. చేతులు, కాళ్ల అడుగు భాగాన వచ్చిన పులిపిర్లు నడిచే సమయంలో గానే పనిఒత్తిడిలో గానీ బాగా నొప్పిని కలిగిస్తాయి. కొన్ని రకాల పులిపిర్లు పెన్సిల్ మొనలాగా, మరికొన్ని బొట్టుబిళ్లల రూపంలోనూ ఉంటాయి.


వ్రాట్స్ (పులిపిర్లు)పోగొట్టుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలను బోల్డ్ స్కై పరిచయం చేస్తోంది. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ హోం రెమెడీస్, కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ రెమెడీస్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే, చర్మంపై కనిపించే పులిపిర్లును శాశ్వతంగా పోగొట్టుకోవచ్చు.

1. తులసి

1. తులసి

తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి, ఇవి చర్మంపై కనిపించే పులిపిర్లును శాశ్వతంగా తొలగిస్తాయి.

ఎలా ఉపయోగించాలి:

గుప్పెడు తులసిని ఎండలో ఎండబెట్టి, పొడి చేయాలి. లేదా పచ్చి ఆకు అయినా కూడా మిక్సీ చేయాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు కలిపి పేస్ట్ లా చేసి, పులిపిర్లు మీద పెట్టాలి, 20 నిముసాలు ఉంచి తర్వాత కడిగేయాలి. ఇలా అవి తగ్గే వరకూ రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. బేకింగ్ పౌడర్

2. బేకింగ్ పౌడర్

వ్రాట్స్ పోగొట్టడానికి మరో ఏజ్ ఓల్డ్ రెమెడీ బేకింగ్ పౌడర్, ఇందులో పవర్ ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇది వ్రాట్స్ ను ఎఫెక్టివ్ గా తొలగించి తిరిగి రాకుండా చేస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ లో కొద్దిగా నీళ్ళు కలిపి చిక్కగా పేస్ట్ లా చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను వ్రాట్స్ మీద అప్లై చేసి 10 నిముసాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

3. టీట్రీ ఆయిల్

3. టీట్రీ ఆయిల్

మరో న్యాచురల్ రెమెడీ. పులిపిర్లను తొలగించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల పులిపిర్లుకు కారణమయ్యే వైరస్ లక్షణాలను కూడా తొలగిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

2-3 చుక్కల టీట్రీ ఆయిల్ను అరటీస్పూన్ కొబ్బరి నూనెలో కలపాలి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. కొన్ని నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో కడగాలి.

4. ఆరెంజ్ పీల్ పౌడర్

4. ఆరెంజ్ పీల్ పౌడర్

ఆరెంజ్ తొక్కలో ఉండే విటమిన్ సీ కంటెంట్ మరో అద్భుతమైన రెమెడీ. పులిపిర్లు తిరిగి కనబడకుండా చేస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

అర టీస్పూన్ ఆరెంజ్ తొక్క పౌడర్ లో ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రదేశంలో అప్లై చేసి 10 నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో కడిగేయాలి.

5. యాపిల్ సైడర్ వెనగిర్

5. యాపిల్ సైడర్ వెనగిర్

యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్సలెంట్ హోం రెమెడీ. ఇది ఎఫెక్టివ్ గా వ్రాట్స్ ను తొలగిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

యాపిల్ సైడర్ వెనిగర్ ను నీళ్ళతో కలపాలి. ఈ మిశ్రమాన్ని పులిపిర్లు మీద అప్లై చేసి, 10 నిముషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఈ రెమెడీని వ్రాట్స్ పోయే వరకూ ఉపయోగించుకోవచ్చు.

6.అలోవెర్ జెల్

6.అలోవెర్ జెల్

వ్రాట్స్ పోగొట్టడంలో ఇతర పదార్థాల్లాగే అలోవెర జెల్ కూడా ఒకటి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఇది పులిపిర్లను తగ్గిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

అలోవెర జెల్ ను ప్రభావిత ప్రదేశంలో అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తనార్మల్ వాటర్ తో కడగాలి. ఇలా అవి తగ్గే వరకూ అప్లై చేయవచ్చు.

7. అరటి తొక్క

7. అరటి తొక్క

అరటితొక్కలో ఉండే కొన్ని న్యూట్రీషియన్స్ ఎఫెక్టివ్ వ్రాట్స్ ను తొలగిస్తాయి .

ఎలా ఉపయోగించాలి:

అరటి తొక్కను ప్రభావిత ప్రాంతంలో మర్ధన చేయాలి. 5-10నిముషాలు రుద్ది తర్వాత చన్నీటితో కడగాలి. రోజుకు ఒకసారి ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

8. వెల్లుల్లి

8. వెల్లుల్లి

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్, మరియు యాంటీ బ్యాక్టీరియల్ కాంపౌండ్స్ వ్రాట్స్ తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసికొద్దిగా నీళ్ళు కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను వ్రాట్స్ మీద అప్లై చేసి 10 నిముషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఈ పదార్థాన్ని రెగ్యులర్ గా వ్రాట్స్ పోయే వరకూ అప్లై చేయవచ్చు.

English summary

Natural Ingredients You Can Use To Remove Warts For Good

Natural Ingredients You Can Use To Remove Warts For Good, Today at Boldsky, we're letting you know about such components that can come to your skin's rescue and eliminate warts for good. Used since ages for skin care purposes, these ingredients are safe-to-use, budget-friendly and highly effective in treati
Desktop Bottom Promotion