కళ్లు హెల్తీగా..ఫ్రెష్ గా..అందంగా కనబడటానికి సింపుల్ హోం రెమెడీస్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

కళ్లు దేవుడు మనిషికి ఇచ్చిన ఒక అద్భుత వరం. కళ్లతోటి ప్రపంచంలో ఎన్నో అద్భుతాలను చూడవచ్చు. అటువంటి కళ్ళు మన శరీరంలో ఒక భాగం కావడం ఒక మ్యాజిక్. ఎందుకంటే కళ్లతోనే హావ భావాలు తెలపవచ్చు. ఒక మాట మాట్లాడకుండానే కళ్లతోనే ఎమోషన్స్ ను ఎక్స్ ప్రెస్ చేయవచ్చు.

Remedies To Keep Your Eyes To Look Fresh

ఒక వ్యక్తిని కలిసినప్పుడు మొదట వారి కళ్ల మీదకే చూపు వెలుతుంది. కాబట్టి, కళ్ళు అందంగా..ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కళ్ళు ఎప్పుడూ ఫ్రెష్ గా కనబడాలి. అప్పుడే కళ్ళ అందం తెలుస్తుంది. కళ్ళు ఆకారం, రంగు ఏవిధంగా ఉన్నదన్నది ముఖ్య విషయం కాదు, కళ్లు ఆరోగ్యంగా, అందంగా ఉన్నయన్నదే ముఖ్యం. కొన్ని సందర్భాల్లో కళ్ళు ఎక్కువ ఒత్తిడి గురైనప్పుడు, కళ్ళు మిమ్మల్ని డల్ గా, బాధాకరంగా కనబడేలా చేస్తాయి.

అలా నిర్జీవంగా కనబడే కళ్లు, ముఖ అందాన్ని మొత్తాన్ని పాడు చేస్తాయి. కాబట్టి, కళ్ళు ఆరోగ్యం, అందం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కళ్ళు ఆరోగ్యంగా, ఫ్రెష్ గా ఉంచుకోవడం కోసం కొన్ని సింపుల్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి .

1. కీరదోసకాయ

1. కీరదోసకాయ

కీరదోసకాయ ముక్కలను కళ్లకు అప్లై చేయడం వల్ల ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కళ్ళ ఉబ్బును తగ్గిస్తుంది. కళ్లకు కావల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. రెండు పల్చని కీరదోసకాయ ముక్కలను రెండు కళ్ళ మీద ఉంచి, కొంత సేపు రిలాక్స్ అవ్వాలి. కీరదోసకాయలో ఉండే వాటర్ కంటెంట్ వల్ల , కళ్ళమీద చర్మంను పునరుత్తేజపరుస్తుంది. కళ్లు చూడటానికి ఫ్రెష్ గా కనబడుతాయి.

2. ఐస్ వాటర్

2. ఐస్ వాటర్

ఐస్ వాటర్ ను తో ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలో స్ట్రెస్ తగ్గిస్తుంది. చర్మం కాంతివంతంగా పునరుత్తేజితం అవుతుంది. ఐస్ క్యూబ్స్ తీసుకుని, కళ్ళ చుట్టూ అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. కొద్దిసేపు మసాజ్ చేసిన తర్వాత నేచురల్ గా డ్రైగా మారనివ్వాలి. రాత్రి నిద్రించడానికి ముందు ఐస్ వాటర్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల, నిద్రలేచే సమయానికి కళ్లకు విశ్రాంతి అందడం వల్ల కళ్ళు ఫ్రెష్ గా కనబడుతాయి .

3. కెఫిన్ ఐ క్రీమ్

3. కెఫిన్ ఐ క్రీమ్

ఐక్రీమ్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. కళ్ళ చుట్టూ ఉన్న చర్మానికి కాస్త విశ్రాంతి అందుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. కళ్ల చుట్టూ చర్మం కాంతివంతంగా మారుతుంది. కళ్ళ చుట్టూ డ్రైగా ఉంటే, కళ్ళ క్రింద కెఫిన్ ఎక్స్ ట్రాక్ట్ తో తయారుచేయబడిని ఐ క్రీమ్ ను ఉపయోగించాలి. దాంతో కళ్ళు క్రింద చర్మం కాంతివంతంగా మారుతుంది.

4. కన్సీలర్ ను ఉపయోగించాలి

4. కన్సీలర్ ను ఉపయోగించాలి

కళ్ల అలసటను, నీర్జీవంగా మారిన కళ్ళకు కన్సీలర్ ఒక ఈజీ రెమెడీ. ఇది కళ్ళు అందంగా కనబడేలా చేస్తుంది. కళ్ల ఉబ్బును తగ్గిస్తుంది. డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది. కన్సీలర్ ను ఉపయోగించడం వల్ల కళ్ల వద్ద చర్మం బ్రైట్ గా మారుతుంది. డార్క్ స్పాట్స్ ను హైడ్ చేస్తుంది. కాబట్టి, మీ స్కిన్ టోన్ కు సరిపోయే కన్సీలర్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.

5. విటమిన్ సి ఎక్స్ ట్రాక్ట్

5. విటమిన్ సి ఎక్స్ ట్రాక్ట్

విటమిన్ సితో తయారుచేసిన ఫేస్ వాష్ లేదా బాడీ స్ర్కబ్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. సిట్రస్ ఎక్స్ ట్రాక్ట్ తో తయారుచేసిన బాడీ స్ర్కబ్ ను ఉపయోగించడం వల్ల చర్మంను రిజువేట్ చేస్తుంది. చర్మానికి డీప్ గా హైడ్రేషన్ అందిస్తుంది. విటమిన్ సి క్రీమ్ ఉపయోగించడం వల్ల కళ్ళక్రింద నల్లని వలయాలు తొలగిపోయి, స్కిన్ కు యంగర్ లుక్ ను అందిస్తుంది

6. బంగాళ దుంప ముక్కలు

6. బంగాళ దుంప ముక్కలు

ఒక బంగాళదుంప తీసుకుని, కొద్ది సేపు ఫ్రిజ్ లో ఉంచాలి.అరగంట తర్వాత బయటకు తీసి, సన్నని స్లైస్ గా కట్ చేయాలి. రెండు స్లైస్ తీసుకుని కళ్ళ మీద పెట్టి, విశ్రాంతి తీసుకోవాలి. ఈ కోల్డ్ పొటాటో స్లైస్ కళ్ళను కాంతివంతంగా మార్చుతుంది. కళ్ళ క్రింద చర్మానికి తేమను అందిస్తుంది. ఫ్రెష్ అంగ్ యంగ్ లుక్ ను అందిస్తుంది. కళ్ల ఉబ్బును తగ్గిస్తుంది. డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది.

7. ఎగ్ వైట్

7. ఎగ్ వైట్

ఎగ్ వైట్ ను కళ్లకు అప్లై చేయడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ స్కిన్ తొలగిపోతుంది. ఒక గుడ్డు తీసుకుని,అందులోని వైట్ మాత్రమే తీసుకుని దానికి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, రెండూ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిముసాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల కళ్ళక్రింద చర్మాన్ని టైట్ గా మార్చుతుంది,.నేచురల్ యంగ్ ఫ్రెష్ లుక్ ను అందిస్తుంది .

English summary

Remedies To Keep Your Eyes To Look Fresh

Dull eyes may often destroy the complete appearance of the face and hence it is important to take care of them. So, here are some of the ways to keep your eyes to look fresh all the time.
Story first published: Friday, April 14, 2017, 19:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter