వయస్సును గుర్తు చేసే ముడుతలకు చెక్ పెట్టే హోం రెమెడీస్

Posted By:
Subscribe to Boldsky

చర్మంలో చారలు, ముడుతలు కనబడ్డాయంటే చాలు ఇక వయస్సైనవారిగా బాధ పడేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి, అటువంటి లక్షణాలు చర్మంలో కనబడకుండా ఉండాలంటే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. 30 ఏళ్ళకు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిలో తప్పనిసరిగా ఇటువంటి ఫైన్ లైన్స్ లేదా ముడుతలు ముఖంలో మరియు కళ్ల క్రింద బాగా కనబడుతుంటాయి.

మరి, ఇటువంటి ముడుతలను చర్మంలోని చారలను నివారించుకోవడం కోసం ఖరీదైన ట్రీట్మెంట్స్, క్రీములను ఉపయోగిస్తుంటారు. అయితే వీటి వల్ల ఆశించిన ఫలితం ఉండదు కాబట్టి, ఇటువంటి ఫైన్ లైన్స్ ముడుతలను నివారించుకోవడం కోసం నేచురల్ పద్దతులను ఉపయోగించడం మంచిది.

వయస్సును గుర్గు చేసే ఇలాంటి ముడతలకు చెక్క పెట్టాలంటే కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

పైనాపిల్ జ్యూస్

పైనాపిల్ జ్యూస్

పైనాపిల్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ ఇటువంటి ఏజింగ్ స్కిన్ లక్షణాలను నివారిస్తుంది. కళ్ళ క్రింది కనిపించే ముడుతను సులభంగా పోగొడుతుంది. పైనాపిల్ జ్యూస్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలు , ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్ చర్మం యవ్వనంగా కనబడేందుకు సహాయపడుతుంది. కొన్ని పైనాపిల్ ముక్కలు తీసుకుని జ్యూస్ తియ్యాలి. ఈ జ్యూస్ ను కళ్ళ క్రింద బాగంలో అప్లై చేయాలి. పూర్తిగా డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

రోజ్మెర్రీ ఆయిల్

రోజ్మెర్రీ ఆయిల్

కళ్ళ క్రింద చారలు, ముడుతలను నివారించడంలో రోజ్మెర్రీ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. రోజ్మెర్రీ ఆయిల్ తో చర్మానికి మసాజ్ చేయడం వల్ల చర్మానికి పోషణను అందిస్తుంది. దాంతో ఫైన్ లైన్స్ , ముడుతలు తగ్గుతాయి. కళ్ళ క్రింద ఉండే చారలను, ముడుతలను నివారించడానికి అప్ వార్డ్ డైరెక్షన్ లో అప్లై చేసి మసాజ్ చేయాలి. డ్రైగా మారిన 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కీరదోసకాయ

కీరదోసకాయ

ముడుతలను మాయం చేయడంలో మరో ఎక్సలెంట్ హోం రెమెడీ కీరదోసకాయ, చర్మంలో తేమ కోల్పోవడం వల్ల , చర్మం డ్రైగా మారడం వల్ల చర్మంలో ముడుతలను కనబడుతుంటాయి. చర్మంలో ముడుతలను మాయం చేయడానికి, కళ్ళ క్రింద వలయాలను నివారించడానికి కీరదోసకాయ జ్యూస్ ను తప్పనిసరిగా నివారించాలి. కీరదోసకాయ జ్యూస్ ను అప్లై చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ఫైన్ లైన్స్ తొలగిపోతాయి.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

కళ్లక్రింద నల్లటి వలయాలు, చారలను నివారించడంలో కొబ్బరి నూనె కూడా గ్రేట్ గా సహాయపడుతుది. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని కళ్ళ క్రింద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది కళ్ళ క్రింద వలయాలను తొలగించి మరియు స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. అలాగే కొబ్బరి నూనెలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి.

గ్రేప్ సీడ్ ఆయిల్

గ్రేప్ సీడ్ ఆయిల్

గ్రేప్ సీడ్ ఆయిల్ ఒక ఎఫెక్టివ్ ఆయిల్. ఇది కళ్ళ క్రింద చారలను మరియు వలయాలను నివారిస్తుంది. ఇది చర్మంలోని ఎపిడెర్మిసిస్ అనే లేయర్ ను మెయింటైన్ చేస్తుంది. దాంతో చర్మం యవ్వనంగా కనబడుతుంది. గ్రేప్ సీడ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల చర్మ క్రింద ఉండే నల్లని వలయాలు తొలగిపోతాయి. గ్రేప్ సీడ్ ఆయిల్ చర్మంను తేమగా మరియు మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది.

గోరువెచ్చని పాలు మరియు బ్రౌన్ షుగర్

గోరువెచ్చని పాలు మరియు బ్రౌన్ షుగర్

కొద్దిగా గోరువెచ్చని పాలు తీసుకుని అందులో బ్రౌన్ షుగర్ ను మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ పాలను చల్లగా చేసి ముఖం మీద అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల కళ్ల క్రింద నల్లని వలయాలు తొలగిపోతాయి. ఇది చారలను, ముడుతలను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే ఇది చర్మంలో మలినాలను కూడా తొలగిస్తుంది. దాంతో చర్మం కాంతివంతంగా మెరుస్తుంటుంది. ఈ ప్రొసెస్ ను రోజుకు రెండు సార్లు రిపీట్ చేయడంతో ఫైన్ లైన్స్ తొలగించుకోవచ్చు.

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముడుతలను , కళ్ళ క్రింద చారలను తగ్గించుకోవచ్చు. ఆరెంజ్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. కళ్ళ క్రింద నల్లని వలయాలను తొలగిస్తుంది. కొద్దిగా ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. రాత్రి నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. తర్వాత ఉదయం చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది కళ్లక్రింద నల్లటి వలయాలను చారలను నివారిస్తుంది.

English summary

Remedies To Reduce Lines Under The Eyes

Fines lines or wrinkles under the eye can jeopardize the entire beauty game, and hence, it is very important to take care of them at the earliest. Women who are over 30 years and above can constantly see fine lines or wrinkles appearing on their face and also the under-eye area.
Story first published: Thursday, March 23, 2017, 18:30 [IST]
Subscribe Newsletter