For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రికి రాత్రి బ్యూటిఫుల్ స్కిన్ పొందటానికి 7 చిట్కాలు

By Ashwini Pappireddy
|

రాత్రి సమయం అనేది మీ చర్మం కోల్పోయిన జీవాన్ని తిరిగి పొందడానికి మరియు మెరిసేలా చేయడానికి ఒక మంచి సమయం గా చెప్పవచ్చు. ఈ కారణం వలనే దీనిని ఎనిమిది గంటల పాటు నిద్రించే ఈ సమయాన్నే సౌందర్య నిద్ర అని పిలుస్తారు.సరైన నిద్ర లేని ప్రజల ముఖం నిస్తేజంగా మరియు బిగుసుకు పోయిన చర్మాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా మన ఆరోగ్యం విషయానికి వస్తే మన జుట్టుకి ఎక్కువ నిద్ర ముఖ్యం,అవసరమవుతుంది.నిద్రపోయే ముందు కొన్ని సాధారణ బ్యూటీ చిట్కాలను పాటించడం వలన మీ చర్మం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఆయిల్ స్కిన్ నివారించుకోవడం కోసం 11 బేసిక్ స్కిన్ కేర్ టిప్స్ఆయిల్ స్కిన్ నివారించుకోవడం కోసం 11 బేసిక్ స్కిన్ కేర్ టిప్స్

మహిళల మార్నింగ్ స్కిన్ కేర్ టిప్స్

పడుకోవడానికి ముందు పాటించే ఈ సాధారణ అందం చిట్కాలు మీ చర్మంను మెరిసేలా చేసి మరియు మరింత రిపేర్ చేయటానికి సహాయం చేస్తుంది, తద్వారా ఇది మిమల్ని మరింత యవ్వనం గా మరియు తాజాగా కనిపించేలా చేసి మరియు మొత్తం రోజు అంత ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది.

అందం లో పాటించేటువంటి ఒక నియమం ప్రకారం మీరు పడుకోవడానికి ముందు పగటి పూట వేసుకున్న మొత్తం మేకప్ ని తొలగించాల్సి ఉంటుంది. మీ ముఖం మీద మీరు వేసుకున్న మేకప్ తో నిద్రించడంవల్ల మీ చర్మం దెబ్బతింటుంది మరియు రాత్రి సమయంలో రిపేర్ చేయబడదు.రాత్రి సమయంలో మేకప్ మీ చర్మం ని శ్వాస పీల్చుకోవడానికి అనుమతించదు దీనివలన మొటిమలు మచ్చలు రావడానికి కారణమవుతుంది.

కాబట్టి ఇలాంటి అందవిహీనానికి కారకులు కాకండి రాత్రిపూట మీరు పాటించవలసిన కొన్ని బ్యూటీ చిట్కాలు ఇక్కడ వున్నాయి.

ఉబ్బిన కళ్ళు

ఉబ్బిన కళ్ళు

ఉదయమే ఉబ్బిన కళ్ళను నివారించడానికి ఒక సాధారణ చిట్కా ఉంది. మీ తల క్రింద మృదువైన మరియు సౌకర్యవంతమైన దిండును ఉంచండి. మీ తల మీ శరీరం కన్నా ఎత్తుగా వున్నప్పుడు మీ కళ్ళ క్రింద ఉన్న అదనపు ద్రవాలను దూరం చేస్తుంది.

మీ లాషెస్ కి కాస్టర్ ఆయిల్ ని అప్లై చేయండి

మీ లాషెస్ కి కాస్టర్ ఆయిల్ ని అప్లై చేయండి

కాస్టర్ ఆయిల్ ని మీరు నిద్రించడానికి వెళ్ళే ముందు మీ కనురెప్పలకి అప్లై చేయడం వలన మీ కను రెప్పలని మందంగా తయారు చేస్తాయి. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది, ఇది మీ కనురెప్పల ను పెంచుతుంది మరియు వాటి విఘటనను నివారిస్తుంది.

ఓవర్నైట్ లో షైనీ హెయిర్ ని పొందండి

ఓవర్నైట్ లో షైనీ హెయిర్ ని పొందండి

మీరు పడుకోవడానికి ముందు మీ జుట్టు కి కొబ్బరి నూనె అప్లై చేసి మొత్తం రాత్రి అంతా అలానే ఉంచండి నిద్ర పోవడానికి ముందు మీరు మీ పొడి జుట్టు కి కండీషనర్ను కూడా అప్లై చేసుకోవచ్చు. మీ జుట్టును కవర్ చేయడానికి షవర్ టోపీని ఉపయోగించండి. ఉదయం షాంపూతో మీ జుట్టు ని కడగండి. ఇలా చేయడం వలన మీ జుట్టు ని మృదువుగా మరియు పట్టులా మెరిసే చేస్తుంది.

కిస్సబుల్ లిప్స్ కోసం

కిస్సబుల్ లిప్స్ కోసం

మీరు రాత్రి సమయంలో పడుకోవడానికి ముందు మీ పెదాలకు షియా వెన్న ని అప్లై చేయండి. ఇది మీ లిస్ప్ మృదువుగా ఉంచి మరియు ఎక్కువసేపు తేమగా ఉండేలా చేస్తుంది. రోజ్ వాటర్ యొక్క కొన్ని చుక్కలతో మీరు షియా వెన్న ని కలపవచ్చు, దీని వలన మీ పెదాల లోపల మరింత చల్లగా ఉండేలా చేసి సాఫ్ట్ గా మారుస్తుంది.

ఆరోగ్యకరమైన నెయిల్స్ మరియు కటికిల్స్

ఆరోగ్యకరమైన నెయిల్స్ మరియు కటికిల్స్

నిద్రించడానికి ముందు విటమిన్ E చమురు మరియు ఆముదము నూనెతో మీ గోర్లు మరియు కోటిల్స్ను మసాజ్ చేయండి. ఇది మీ గోర్లు ను మరింత స్ట్రాంగ్ గా చేస్తుంది మరియు క్యూటికల్స్ ని సాఫ్ట్ గా చేస్తుంది.

ఇంట్లో అరటిపండు ఉంటే చాలు.. బ్యూటీపార్లర్‌ ఇంట్లో ఉన్నట్టే!ఇంట్లో అరటిపండు ఉంటే చాలు.. బ్యూటీపార్లర్‌ ఇంట్లో ఉన్నట్టే!

మీ టీత్ తెల్లగా ఉండటానికి

మీ టీత్ తెల్లగా ఉండటానికి

రోజు సమయంలో ఒక నమ్మకమైన స్మైల్ కోసం మీ పళ్ళను వైట్ గా మార్చడానికి, మీ వేలితో బేకింగ్ సోడా ని తీసుకొని 5 నిముషాల పాటు పడుకోవడానికి ముందు పల్లకి రుద్దడం చేయాలి. రోజు ఈ విధంగా పడుకోవడానికి ముందు చేయడం వలన మీ పళ్ళు తెల్లగా మారుతాయి.

స్లీపింగ్ ముందు మేకప్ తొలగించండి

స్లీపింగ్ ముందు మేకప్ తొలగించండి

మీరు పడుకోవడానికి ముందు మీరు మేకప్ తొలగించకపోతే, మేకప్ రసాయనాలు మీరు చర్మం రంధ్రాల లోకి వెళ్లి మొటిమలను కలిగించవచ్చు. అలంకరణలోని రసాయనాలు మీరు చర్మంపై నష్టం కలిగిస్తాయి. రాత్రి సమయంలో మీ చర్మ శ్వాసక్రియలు మరియు రిపేర్ కోసం, మీరు అన్ని మేకప్లను తీసివేయాలి, తద్వారా మీ చర్మం చైతన్యం గా ఫ్రెష్ గా ఉంటుంది.

English summary

Simple Beauty Tips At Night| Beauty Habits Before Going To Sleep| Beauty Routine At Night| Beauty Tips And Tricks At Bedtime| How To Look Beautiful Overnight

There are some simple beauty tips at night that will make your skin glowing overnight. Adapt these habits for a beautiful skin. Here are some beauty tips..
Desktop Bottom Promotion